ఇంట్లో చోరీ
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు – భీమవరం రోడ్డులోని పూలపల్లి ఎస్బీఐకు సమీపంలోని ఓ ఇంట్లో గురువారం వేకుజామున చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరాజు రవి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి పదిహేనున్నర కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సీఐ కోలా రజనీకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.