ఆకస్మిక తనిఖీలు : సారా వ్యాపారులు అరెస్ట్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పులిమడుగు వద్ద శనివారం పోలీసు, అటవీ శాఖ, ఆర్టీఏ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వాహనాలు సీజ్ చేశారు. అలాగే రూ. లక్ష విలువైన టేకు, కలపతోపాటు 125 లీటర్ల సారా, 2500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 10 మంది సారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.