తమిళనాడులో పూండి వాసి మృతి
పూండి: వజ్రపుకొత్తూరు మండలం పూండి గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ వ్యిద్యార్థి దున్న సందీప్(20) తమిళనాడులోని వేలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాల య్యాడు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేలూరు నుంచి స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండు కార్లలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఓవర్ టేక్ చేసే సమయంలోనే ప్రమా దం జరిగినట్లు భావిస్తున్నారు. మృతు డు వేలూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ ట్రిపుల్ ఈ తృతీ య సంవత్సరం విద్యార్థి. ఘటనలో హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి కూడా మృతి చెందాడు. సమాచారం అందగానే పూండి వాసు లు శోకసంద్రంలో మునిగిపోయారు.
మృతదేహం చేరిక
మృతదేహం శనివారం సా యంత్రం 3 గంటలకు పూండి చేరుకోవడంతో శ్మశాన వాటికకు బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకుని భోరుమన్నారు. మృతుని తల్లిదండ్రులు దున్న రమేష్, రాధలు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కడే కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ కుటుంబానికి తీరని శోకమే మిగిలింది. క్యాంపస్ ఇంటర్వ్యూలో విజయం సాధించి త్వరలోనే ఇంటికి వస్తాడనుకున్న కొడుకుని ఈ రూపంలో చూడా ల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదని తల్లిదండ్రులు రోదిస్తుంటే చూపరులు కూడా కంటతడిపెట్టారు. మృతు ని కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నేతలు పేడాడ తిలక్, ఎర్ర చక్రవర్తి, ఎన్.శ్రీరామ్మూర్తి, కె.నారాయణమూర్తితోపాటు పలువురు ప్రముఖులు పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు.