pune robbery
-
సినీ ఫక్కీలో కార్లు, బైక్‌లతో ఛేజింగ్.. తుపాకులతో బెదిరించి రూ.కోట్లు లూటీ
ముంబై: డబ్బులు తీసుకెళ్తున్న వాహనాన్ని ఛేజింగ్ చేసి దొంగలు లూటీ చేసే దృశ్యాలు చాలా సినిమాల్లో చూశాం. అయితే, నిజ జీవితంలోనూ అలాంటి సంఘటనే జరిగింది. సినిమాను తలదన్నేలా ఛేజింగ్‌లు, కాల్పులు ఇందులో హైలైట్. నగదుతో కారులో వెళ్తున్న ఇద్దరు బాధితులను చితకబాది రూ.3.6కోట్లు కొట్టేశారు కొందరు దుండగులు. సినిమా స్టైల్ జరిగిన ఈ దోపిడి మహారాష్ట్రలోని పుణెలో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూ.3కోట్ల 60 లక్షల నగదుతో భవేశ్ కుమార్ పటేల్, విజయ్ భాయ్ అనే ఇద్దరు వ్యక్తులు పుణె-సోలాపూర్ హైవేపై వెళ్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ముఠా ఆ డబ్బును ఎలాగైనా కొట్టేయాలని వారి వెంటపడింది. స్పీడ్ బ్రేకర్ వద్ద వారి కారును నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్లతో వచ్చి ఆపేందుకు ప్రయత్నించగా స్పీడ్ పెంచారు. దీంతో రెండు కార్లు, రెండు ద్విచక్రవాహనాలపై డబ్బుతో వెళ్తున్న వారి కారును కొన్ని కిలోమీటర్ల పాటు ఛేజ్ చేశారు దుండగులు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన వారు కారుపై కాల్పులు చేపట్టారు. ఆ తర్వాత కారును ఇందాపుర్ సమీపంలో ఆపి బాధితులను చితకబాదారు. నగదుతో అక్కడి నుంచి ఉడాయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే, భవేశ్ కుమార్ పటేల్, విజయ్‌భాయ్ అంత డబ్బును కారులో ఎందుకు తరలిస్తున్నారనే విషయం తెలియలేదని, అది హవాలా రాకెట్‌కు సంబంధించినదై ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: సినిమాను తలపించిన లవ్‌స్టోరీ.. పెళ్లి.. కిడ్నాప్.. ఛేజింగ్.. -
లిఫ్ట్ ఇస్తామంటూ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను దోచేశారు!
ఆఫీసు నుం1చి ఇంటికి వెళ్దామని కారులో బయల్దేరిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొంతమంది అతడిచి చితక్కొట్టి అతడి నుంచి రూ. 25వేలు దోచుకున్నారు. గడిచిన 45 రోజుల్లో పుణెలో ఇలాంటి దోపిడీ జరగడం ఇది మూడోసారి. ప్రధానంగా హింజెవాడి ఐటీ పార్కు, దాని పరిసరాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులను దోపిడీ దొంగలు టార్గెట్ చేసుకుని, వాళ్ల మీద దాడి చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండటం, అక్కడివాళ్లు రాత్రి పొద్దుపోయే వరకు పనిచేసి తిరిగి వెళ్లడం లాంటి పరిస్థితులు వాళ్లకు అనుకూలిస్తున్నాయి. అమోల్ అనంత్ హతీమ్ (25) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాత్రి 8.15 గంటల సమయంలో తన పని ముగించుకున్నాడు. సాధారణంగా రోజూ అతడు పుణె మెట్రోపాలిటన్ బస్సుల్లో వెళ్తాడు. కానీ అరగంట పాటు బస్సురాలేదు. అప్పుడే ఓ కారు వచ్చింది. డాంగే చౌక్ వరకు తీసుకెళ్తానని డ్రైవర్ చెప్పాడు. యఅఇతే కారులో అప్పటికే నలుగురు ఉన్నారు. ముందు ఇద్దరు, వెనక ఇద్దరు ఉన్నారు. ఆ కారు భుంకర్ చౌ్ వైపు వెళ్తుండగా, ఉన్నట్టుండి డ్రైవర్ రూటు మార్చాడు. దాంతో అనుమానం వచ్చిన హతీమ్ఓ అతడిని ఆపమని చెప్పేలోగానే కారు వేగం పెరిగింది. పక్కన ఉన్నవాళ్లు అతడిని కొట్టారు. అతడి ఏటీఎం కార్డు లాక్కుని, పిన్ నెంబరు చెప్పాలని బలవంతపెట్టారు. తొలుత తప్పు నెంబరు చెప్పినా, వాళ్లు చంపేస్తామని బెదిరించడంతో అసలు నెంబరు చెప్పాడు. దాంతో వాళ్లు ఏటీఎం సెంటర్ వద్దకువెళ్లి నాలుగుసార్లుగా రూ. 25వేలు డ్రా చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.