ట్రంప్ సలహా కమిటీలో భారతీయులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గపడుతున్న క్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్ని శక్తులనూ కూడగట్టుకొనే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా తన ‘ఆసియా పసిఫిక్ అమెరికా సలహా కమిటీ’ (ఏఏపీఐ)లో భారత సంతతి వారిని నియమించారు. మొత్తం 30 మంది ఉన్న ఈ కమిటీలో భారత సంతతికి చెందిన పునీత్ అహ్లూవాలియా (వర్జీనియా), కేవీ కుమార్ (కాలిఫోర్నియా), షలబ్ కుమార్ (ఇలియేయిస్) ఉన్నట్టు ట్రంప్ ప్రతినిధి తెలిపారు.
షలబ్కుమార్ వ్యాపార దిగ్గజం. రిపబ్లికన్ హిందూ కొలియేషన్ వ్యవస్థాపక చైర్మన్. అహ్లూవాలియా వర్జీనియా ఏఏపీఐ సలహా మండలి సభ్యుడు. కేవీ కుమార్ గతంలో ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. ట్రంప్ నాయకత్వంలో భారత్-అమెరికా సంబంధాలు నూతన శిఖరాలకు చేరతాయని షలబ్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.