లోయలో పడ్డ బస్సు.. నలుగురి మృతి
పండగపూట దారుణ ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని సతార్ నుంచి ముంబై వెళ్లే బస్సు ఒకటి లోయలో పడిపోయింది. దీంతో నలుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే, లోయ చాలా లోతులో ఉండటం, బస్సు పైనుంచి పడిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
పుణెగావ్ ఘాట్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదం నుంచి ఎంతమంది బతికి బయటపడతారన్న విషయం ఏమాత్రం చెప్పలేమని స్థానిక అధికారులు అంటున్నారు. బస్సును పైకి తీసేందుకు సహాయ కార్యకలాపాలు మొదలవుతున్నాయి.