పటాన్ కోట్ లో కారు అపహరణ కలకలం
పటాన్ కోట్: పంజాబ్ లోని పటాన్ కోట్ లో మల్లీ అలజడి మొదలైంది. కొందరు వ్యక్తులు ఆయుధాలతో వచ్చి ఓ కారును అపహరించుకుపోవడం కలకలం రేపింది. జిల్లాలోని సుజన్ పూర్ పట్టణంలో ఓ వ్యక్తి నుండి తుపాకి గురిపెట్టి కారును త ఎత్తుకుపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు, ఇతర భద్రతా అధికారుల్లో కలవరం మొదలైంది. మంగళవారం రాత్రి చోటు చేసుకుందని, పోలీసులు బుధవారం చెప్పారు. దీంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు విచారణ చేపట్టారు.
ఫోర్డ్ ఫిగో కారులో వెళుతున్న వ్యక్తిని అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులు ఆయను బలవంతంగా లాగి పడేశారు. అనంతరం తుపాకి చూపించి బెదిరించి కారును ఎత్తుకెళ్లారు. దీనిపై భద్రతా అధికారులు సీరియస్ గా దృష్టి సారించారు. విస్త్రృత తనిఖీలు చేపట్టారు. ఆయుధాలతో వచ్చిన వ్యక్తుల ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పంజాబ్ లోని గురుదాస్ దూర్ ఉగ్రదాడి, పటాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఈసంఘటనను సీరియస్ గా స్పందించిన భద్రతబలగాలు నిఘా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఈ సంఘటనలో ఉగ్రనేపథ్యంలేనప్పటికీ, హై ఎలర్ట్ ప్రకటించినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నామన్నారు.