Punjabi Beauty
-
నేను చనిపోయాననడంతో తీవ్రమైన భయానికి గురయ్యా.. నటి ఆవేదన
ప్రముఖ పంజాబీ నటి నికిత్ ధిల్లాన్ సోషల్ మీడియా ఖాతా ఇటివలే హ్యాకింగ్‌కు గురైంది. ఆమె ఖాతాలో హ్యాక్ చేసిన ఓ దుండగుడు నటి చనిపోయిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలయింది. ఈ వార్త విని నటి తీవ్ర మానసిక వేదనకు గురైనట్లు తెలిపింది. ఆ సమయంలో అత్యంత భయానక పరిస్థితి ఎదురైందన్నారు. కుటుంబ సభ్యులంతా తీవ్ర మనోవేదనకు గురయ్యారని నటి నికిత్ ధిల్లాన్ వివరించింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌లో.. 'మా ప్రియమైన కుమార్తె నికిత్ ధిల్లాన్ అకాల మరణాన్ని ప్రకటించడం చాలా బాధగా ఉంది. మా కుటుంబానికి గోప్యతను అనుమతించమని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం అని రాసి ఉంది. ' హ్యాకర్ పోస్ట్ చేశారు. నికిత్ ధిల్లాన్ మాట్లాడుతూ.. 'మా అమ్మమ్మ భటిండాలో నివసిస్తోంది. ఎవరో ఫోన్ చేసి నేను చనిపోయారని చెప్పారని తెలిసింది. వెంటనే ఆమె మా అమ్మని పిలిచి తీవ్రంగా ఏడ్చింది. ఆమె మానసికంగా కుంగిపోయింది. మేమంతా ఏం జరిగిన విషయం ఆమె వివరించినా ఓదార్చలేకపోయాం. హ్యాకింగ్, సోషల్ మీడియా గురించి ఆమెకు అర్థం కాలేదు. ఆమె వయసు రీత్యా మేం దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అనుకుంది. ఈ వార్త ఆమెను తీవ్రంగా ప్రభావితం చేసింది. మరుసటి రోజు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమె ఏడుస్తూనే ఉంది'అంటూ ధిల్లాన్ భయానక పరిస్థితిని వివరించారు. ఆమె మాట్లాడుతూ.. 'నా కలలో కూడా ఇంత దూరం వెళతారని నేను ఊహించలేదు. ఇలాంటి పరిస్థితికి ఎలా స్పందించాలో నాకు తెలియలేదు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది భావించి ఉంటారు. కానీ నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఎంత షాక్‌కు గురయ్యారో నాకు మాత్రమే తెలుసు.'అని వాపోయింది పంజాబీ నటి. దాదాపు రెండున్నర ఏళ్ల క్రితం నా ఫేస్బుక్ ఖాతా హ్యాకింగ్‌కు గురైనప్పుడు మొహాలీ సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశా. అప్పుడు వారు నాకు ఎలాంటి సాయం చేయలేదు. కాల్ స్క్రీన్ షాట్ కూడా సైబర్ సెల్‌కు సమర్పించినా ఇప్పటికీ పట్టించుకోలేదని వాపోయింది నటి. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ గురి కావడంతో ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ' అని వాపోయింది. View this post on Instagram A post shared by Nikeet Dhillon (@nikeetdhillon) -
తండ్రి లాంటి ఆయనతో డ్యూయెట్లా?
‘రజినీకాంత్ తండ్రి లాంటివారు. ఆయనతో డ్యూయెట్లు పాడడమా’ అంటోంది నటి మండీ టక్కర్. ఎవరామే అని అనుకుంటున్నారా? టక్కున ఆమె మీ ఆలోచనల్లోకి రాకపోవచ్చు. కారణం ఈ పంజాబీ బ్యూటీ నటించింది ఒక్క తమిళ చిత్రమే. అదీ కీలక పాత్రనే. బిరియానీ చిత్రం చూసినవారికి మండీ టక్కర్ గుర్తుండవచ్చు. ఆ చిత్రంలో తన అందాలతో నటుడు కార్తీకే మైకం కమ్మించిన భామ. పంజాబ్‌లో పెరిగిన ఈ బ్రిటీష్ ఇండియన్ బ్యూటీ పంజాబీలో మంచి పేరున్న కథానాయిక అన్నది గమనార్హం. అలాగే బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాలు చేసిన మండీ టక్కర్ ఒక భేటీలో పేర్కొంటూ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుందని తెలిపింది. అలాగే అలాంటి అవకాశం కోసం తానూ ఎదురు చూస్తున్నానంది. అయితే ఆయనతో డ్యూయెట్లు పాడాలనుకోవడం లేదని అంది. రజినీ, అమితాబ్ తదితరులను తన తండ్రిలాంటి వారిగా భావిస్తానంది. అందువల్ల వారితో యుగళ గీతాలు పాడడం సమంజసంగా కాదంది. ఈ 28 ఏళ్ల ప్రౌఢ పేర్కొంది. విశేషం ఏమిటంటే లింగా చిత్ర షూటింగ్ సమయంలో రజినీ తన స్నేహితుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా తో నటిస్తున్నప్పుడు ఒక రకమైన బిడియం కలిగిందని పేర్కొనడం గమనార్హం. తనకు జ్ఞాపక శక్తి అధికం అనీ తమిళం, తెలుగు భాషల్లో నటించేటప్పుడూ సంభాషణలు బట్టీ పట్టి చేప్పేస్తాననీ నటి మండీ టక్కర్ తెలిపింది. మొత్తం మీద మళ్లీ కోలీవుడ్‌పై కన్నేసినట్లుందీ పంజాబీ భామ. -
తమన్న సౌందర్య రహస్యం ఏమిటో..?
మనిషికి దేవుడిచ్చిన వరం అందం. అయితే బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే ఉత్తమం అంటారు. ఇప్పుడు మనం ఆ ఫిలాసఫీకి వెళ్లకుండా అందం చూడవయా ఆస్వాదించవయా అన్నట్లు సొగసులు విరజిమ్ముతున్న నటి తమన్న. బాహ్య అందం గురించి తెలుసుకుందాం. ఈ పంజాబీ బ్యూటీ నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నారు. 2005లో బాలీవుడ్ చిత్రం చంద్సే రోషన్ చెహ్రా చిత్రం ద్వారా కథా నాయకుకిగా తెరపైకొచ్చారు. అదే ఏడాది టాలీవుడ్లో శ్రీ చిత్రంతో శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ఏడాది కేడీ అంటూ కోలీవుడ్లోకి అడుగుపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు ఆశించిన విజయాలను అందించలేదు. అయినా అవకాశాలను రాబట్టుకున్నారు. రెండున్నర దశాబ్దాల పరువపు ఈ బ్యూటీ ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే అధిక చిత్రాలు చేశారు. ఇప్పటికి నటిగా తన సత్తా చాటుకుంటున్న తమన్న బాటియా ఇప్పటికీ తన అందాలతో అభిమానులను అలరిస్తున్నారు. అంతగా ఆకర్షింపబడుతున్న సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు ఈ మిల్కీ బ్యూటీ బదులేమో చూద్దాం. నేను నిత్యం కనీసం ఆరు గంటలు మెదడుకు పని చెప్పకుండా హాయిగా నిద్రపోతాను. పగలు బాటిల్ నీళ్లు తాగేస్తాను. కసరత్తులు చాలా ముఖ్యం. యోగా, ధ్యానం తప్పనిసరి. ఎప్పుడు సంతోషానికి దూరం కాను, ఇదే నా సౌందర్య రహస్యం అంటున్న తమన్న తమిళంలో బెంగళూరు టైగర్‌తో పాటు నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ ఆర్యకు జంటగా వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగా చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలిలో అవంతికగా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.