
తమన్న సౌందర్య రహస్యం ఏమిటో..?
మనిషికి దేవుడిచ్చిన వరం అందం. అయితే బాహ్య సౌందర్యం కంటే ఆత్మసౌందర్యమే ఉత్తమం అంటారు. ఇప్పుడు మనం ఆ ఫిలాసఫీకి వెళ్లకుండా అందం చూడవయా ఆస్వాదించవయా అన్నట్లు సొగసులు విరజిమ్ముతున్న నటి తమన్న. బాహ్య అందం గురించి తెలుసుకుందాం. ఈ పంజాబీ బ్యూటీ నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నారు. 2005లో బాలీవుడ్ చిత్రం చంద్‌సే రోషన్ చెహ్రా చిత్రం ద్వారా కథా నాయకుకిగా తెరపైకొచ్చారు. అదే ఏడాది టాలీవుడ్‌లో శ్రీ చిత్రంతో శ్రీకారం చుట్టారు.
ఆ తరువాత ఏడాది కేడీ అంటూ కోలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. విశేషం ఏమిటంటే ఈ మూడు భాషల్లోనూ తొలి చిత్రాలు ఆశించిన విజయాలను అందించలేదు. అయినా అవకాశాలను రాబట్టుకున్నారు. రెండున్నర దశాబ్దాల పరువపు ఈ బ్యూటీ ఉత్తరాదిలో కంటే దక్షిణాదిలోనే అధిక చిత్రాలు చేశారు. ఇప్పటికి నటిగా తన సత్తా చాటుకుంటున్న తమన్న బాటియా ఇప్పటికీ తన అందాలతో అభిమానులను అలరిస్తున్నారు. అంతగా ఆకర్షింపబడుతున్న సౌందర్య రహస్యం ఏమిటన్న ప్రశ్నకు ఈ మిల్కీ బ్యూటీ బదులేమో చూద్దాం.
నేను నిత్యం కనీసం ఆరు గంటలు మెదడుకు పని చెప్పకుండా హాయిగా నిద్రపోతాను. పగలు బాటిల్ నీళ్లు తాగేస్తాను. కసరత్తులు చాలా ముఖ్యం. యోగా, ధ్యానం తప్పనిసరి. ఎప్పుడు సంతోషానికి దూరం కాను, ఇదే నా సౌందర్య రహస్యం అంటున్న తమన్న తమిళంలో బెంగళూరు టైగర్‌తో పాటు నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ ఆర్యకు జంటగా వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగా చిత్రంలో నటిస్తున్నారు. బాహుబలిలో అవంతికగా కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.