రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో ‘అనంత’ బోణీ
అనంతపురం సప్తగిరిసర్కిల్ : విజయనగరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల క్రీడా పోటీల్లో తొలిరోజే (ఆదివారం) అనంత క్రీడాకారుడు బోణీ సాధించాడు. షాట్పుట్ విభాగంలో జిల్లాకు చెందిన పూర్ణచంద్రారెడ్డి రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో నిలిచాడు. పోటీలకు జిల్లా నుంచి 84 మంది క్రీడాకారుల బృందం విజయనగరం వెళ్లింది. ఆదివారం నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయి.