purse theft
-
ఎస్ఐ భార్య పర్సు చోరీ
కర్ణాటక, బనశంకరి: ఆలయ దర్శనానికి వెళ్లిన ఎస్ఐ సతీమణికి చేదు అనుభవం ఎదురైంది. నగరంలో బనశంకరీ దేవి దర్శనానికి వెళ్లిన ఎస్ఐ భార్య పర్సును గుర్తుతెలియని దొంగలు చోరీ చేశారు. ఈ ఘటన కుమారస్వామి లేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు... విశ్వేశ్వరపురం ట్రాఫిక్ ఎస్ఐ డీ.రమేశ్ సతీమణి హెచ్.గీత నలుగురు పోలీస్ అధికారుల భార్యలతో కలిసి సోమవారం సాయంత్రం బనశంకరీదేవీ దేవస్థానానికి వెళ్లారు. అందరూ క్యూలో వెళ్లి దర్శనం చేసుకుని వచ్చారు. ఇంతలో గీతా బ్యాగ్‌లో ఉన్న పర్సు మాయమైంది. అందులో 12 గ్రాముల బంగారు కమ్మలు, 8 గ్రాముల బరువుగల చైన్, బంగారు డాలర్, ఆధార్‌కార్డు, ఓటరు కార్డు తదితర పత్రాలు ఉన్నాయి. ఖాళీ పర్సే దొరికింది కంగుతిన్న బాధితురాలు కుమారస్వామి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బనశంకరీ దేవస్ధానంలో పరిశీలించారు. మహిళా శౌచాలయంలో పనిచేసే మహిళా సిబ్బందికి పర్సు లభించడంతో పోలీసులకు అప్పగించారు. అయితే అది ఖాళీగా ఉంది. దొంగలు మొత్తం ఊడ్చుకుని ఖాళీ పర్సను పడేసి వెళ్లారు. మహిళా దొంగల పనేనా మహిళా దొంగలే చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆలయంలో తరచూ భక్తుల నగలు, పర్సులు చోరీ అవుతున్నాయి. కుమారస్వామి లేఔట్ పోలీస్ స్టేషన్ మహిళా పోలీస్ సిబ్బంది భక్తుల మాదిరిగా దేవస్థానంలో మకాం వేసి భద్రత కల్పిస్తున్నారు. కానీ చోరీలు మాత్రం జరిగిపోతున్నాయని భక్తులు వాపోతున్నారు. దేవస్ధానం వద్ద సీసీ కెమెరాలు లేని స్ధలాల్లో మాత్రమే చోరీలు జరుగుతున్నాయి. భక్తులు ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేస్తున్నారు. -
కడుపునొప్పిగా ఉందంటూ పర్సు చోరీ
టెక్కలి రూరల్ శ్రీకాకుళం : కడుపు నొప్పిగా ఉందని మాయమాటలు చెప్పి పర్సు చోరీ చేసిన ఘటన బుధవారం అక్కవరం జంక్షన్లో చోటుచేసుకుంది. లింగాలవలసకు చెందిన రోణంకి శ్రీరామ్మూర్తి దండుగోపాలపురంలో పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. బుధవారం తన విధులు ముగించుకుని బైకుపై తిరిగి వస్తుండగా అక్కవరం జంక్షన్ సమీపంలో ఓ వ్యక్తి బండి ఆపాడు. ‘సార్.. మీరు డాక్టర్ కదా.. నాకు కడుపులో నొప్పిగా ఉంది.. కొంచెం ట్రీట్మెంట్ చేయండి..’ అని అడిగాడు. అందుకు శ్రీరామ్మూర్తి స్పందిస్తూ తాను పశువైద్యాధికారినని.. టెక్కలి వెళ్లి మంచి వైద్యునికి చూపించు అని సలహాఇచ్చారు. సదరు వ్యక్తి ‘అలాగే సార్.. అని చెబుతూ శ్రీరామ్మూర్తి వద్దకు వెళ్లి తనకు ఎక్కడ నొప్పి వస్తుందో చేతితో తాకుతూ చెప్పి తిరిగి వెళ్లిపోయాడు. శ్రీరామ్మూర్తి ఇంటికి వచ్చి చూసేసరికి పర్సు పోయిందని గ్రహించి, కొద్దిసేపటి కింద తనను కలిసిన వ్యక్తిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పర్సులో రూ.3800 నగదుతో పాటు రూ.2లక్షల 16వేల చెక్, ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తహశీల్దార్ పర్సు చోరీ
నల్లచెరువు : స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ కళావతి పర్సు చోరీకి గురైంది. ఈ మేరకు తహశీల్దార్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి కంప్యూటర్ గదిలోకి వెళ్లి వచ్చానని భోజనం కోసం పర్సు తీసుకోవాలని చూడగా పర్సు కనపడలేదని, అందులో రూ.4వేల నగదు ఉన్నట్లు తెలిపారు.