Purulia
-
‘శభాష్’.. సాహసవీరుడు బబ్లూ
కదులుతున్న రైలు నుంచి ఇద్దరు మహిళలు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకారు. అందులో ఒకరు వేగంగా నడుస్తున్న రైలు కింద పడుతున్న సమయంలో అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ చిరుతలా వేగంగా వచ్చి ఆమెను పక్కకు లాగాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. వివరాలు.. సంత్రాగచ్చి-ఆనంద్ విహార్ ఎక్స్‌ప్రెస్ పురులియా స్టేషన్ గుండా వెళ్తున్న క్రమంలో ఓ పురుషుడు, తర్వాత ఇద్దరు మహిళలు ప్లాట్‌ఫామ్‌పై దూకేశారు. దీంతో ఓ మహిళ రైలు కిందపడే సమయంలో.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ బబ్లూ కుమార్ పరుగుత్తుకుంటూ వచ్చి ఆమెను కాపాడాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో RPF Adra Division ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాహసం చేసి మహిళను కాపాడిన సబ్ ఇన్స్పెక్టర్ బబ్లూ కుమార్‌పై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. #Lifesavingact On 29.11.21 SI/Bablu Kumar of RPF Post Purulia saved the life of a lady passenger while she was trying to de-board & almost come in the gap between train & platform in running train no 22857 at Purulia station.@RPF_INDIA @sanjay_chander @zscrrpfser@ADRARAIL pic.twitter.com/qC5eHeDu45 — RPF Adra Division (@rpfserada) November 30, 2021 -
‘టిక్‌టాక్’పై కఠిన చర్యలు ఉంటాయా?
సాక్షి, న్యూఢిల్లీ : అనతి కాలంలోనే కుర్రకారును విశేషంగా ఆకట్టుకుంటున్న మినీ వీడియో యాప్ ‘టిక్‌టాక్’ కోసం పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాలో గత వారం నూర్ అన్సారీ, అతని మిత్రులు వీడియో క్లిప్‌ను తీయడంలో నిమగ్నమయ్యారు. తమ మీదకు రైలు దూసుకొస్తోందన్న విషయాన్ని కూడా వారు గమనించలేక పోయారు. పాపం! ఆ ప్రమాదంలో అన్సారీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన ఆయన మిత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇలా అనవసరమైన రిస్క్‌లకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. బెంగళూరుకు సమీపంలోకి ఓ గ్రామానికి చెందిన 22 ఏళ్ల కుమార్ అనే యువకుడు వీడియో కోసం జూన్ 15వ తేదీన వెనక్కి పల్టీ కొడితే వెన్నుపూస విరిగి పోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రాణమే పోయింది. రాజస్థాన్‌లోని కోటా సిటీలో ఆరవ తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల బాలుడు ‘టిక్‌టాక్’ కోసం బాత్రూమ్ డోర్ మీదున్న నెక్లస్ తీసుకొని మెడలో వేసుకోగా, నెక్లస్ కొన బాత్రూమ్ డోర్‌కు ఇరుక్కు పోవడంతో నెక్లస్ మెడకు బిగుసుకొని ఊపరాడక చనిపోయారు. న్యూఢిల్లీలో ఏప్రిల్ 14వ తేదీన ఓ యువకుడు టిక్‌టాక్ వీడియో కోసం తన మిత్రుడి ముఖం మీద ప్రమాదవశాత్తు కాల్చడంతో 19 ఏళ్ల సల్మాన్ జకీర్ మరణించారు. తమిళనాడులోని తంజావూర్లో ఫిబ్రవరి 23వ తేదీన ముగ్గురు విద్యార్థులు టిక్‌టాక్ వీడియో కోసం బైక్ నడపుతుండగా ఓ బస్సు వచ్చి ఢీకొనడంతో అందులో ఒక విద్యార్థి మరణించగా, ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. ఇలా టిక్‌టాక్ వీడియోలు తీస్తూ దేశంలో ఇప్పటి వరకు ఎంత మంది చనిపోయారో కచ్చితంగా లెక్కించలేం. ఓ యాభై మంది వరకు మరణించి ఉండవచ్చునేమో! సెల్ఫీలు దిగుతూ మరణించిన వారి సంఖ్య ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే ఎక్కువ. 2011 నుంచి 2017 మధ్య కాలంలోనే 159 మంది అలా మరణించినట్లు ఓ అధ్యయనంలో తేల్చారు. ‘బైట్‌డాన్స్’ అనే చైనా కంపెనీకి చెందినది ‘టిక్‌టాక్’. దీనికి భారత్‌లో 12 కోట్ల మంది చురుకైన యూజర్లు ఉన్నారు. డౌన్లోడ్లకు సంబంధించి కూడా భారత్‌లో ఇది టాప్ యాప్. 50 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగారులున్న భారత్‌లో ‘టిక్‌టాక్’కు ఎక్కువ మార్కెట్ ఇక్కడే జరుగుతోంది. ‘హెలో’ యాప్ ద్వారా కూడా (భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లు) భారతీయులను విశేషంగా ఆకర్షిస్తోన్న బైట్‌డాన్స్ కంపెనీ త్వరలోనే భారత్‌లో అంతర్జాతీయ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోంది. భారతీయుల డేటాకు గ్యారంటీ ఏమిటంటూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆ కంపెనీని నిలదీయడంతో చైనా కంపెనీ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ అమెరికా, సింగపూర్ సర్వర్లలో డేటాను నిక్షిప్తం చేస్తోంది. ప్రాచుర్యం పొందిన సినిమా పాఠాలకు, సన్నివేశాలకు లిప్ మూవ్‌మెంట్‌ను అందిస్తూ, డ్యాన్సులు చేస్తూ తమ దైన శైలిలో ఈ టిక్‌టాక్ ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అనవసరంగా కొందరు యూజర్లు సాహసాలకు, విన్యాసాలకు పోయి విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పోర్నో వీడియోల షేరింగ్ ద్వారా ఈ యాప్ పిల్లలను చెడగొడుతోందని ఆగ్రహించిన మద్రాస్ హైకోర్టు దీనిపై ఇటీవల నిషేధం కూడా విధించింది. దీనివల్ల పోతున్న ప్రాణాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే టిక్‌టాక్‌పై మరిన్ని కఠిన చర్యలు తప్పకపోవచ్చు. -
అమిత్ షా ‘టార్గెట్ బెంగాల్’
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో పట్టు కోసం బీజేపీ పావులు కదుపుతోంది. బెంగాల్లో ప్రాబల్యం పెంచుకునేందుకు ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ప్రచార ర్యాలీలతో హోరెత్తించేందుకు సిద్దమయ్యారు. పురూలియా ర్యాలీతో తమ ప్రచార వ్యూహం ఎలా ఉండబోతోందో ఆయన చాటిచెప్పారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ హింసను ప్రేరేపిస్తోందని షా ఆరోపించారు. హింస ద్వారానే బెంగాల్లో అధికారంలో కొనసాగాలని తృణమూల్ భావిస్తే తమ కార్యకర్తల త్యాగాలు వృధా కాబోవని, వారి సర్కార్ ఎక్కువ కాలం మనుగడ సాధించలేదని ఆయన సవాల్ విసిరారు. పురూలియాలో గురువారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ తృణమూల్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రుని బోధనలతో పునీతమైన బెంగాల్ ఇప్పుడు బాంబుల మోతతో దద్దరిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ ఠాగూర్, బంకించంద్ర ఛటోపాధ్యాయ వంటి ఎందరో మహానుభావుల పురిటిగడ్డ అయిన బెంగాల్లో మమతా బెనర్జీ ఏం చేస్తున్నారో అందరూ చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో మార్పునకు నాందిపలుకుతాయని, బెంగాల్‌లోని 22 లోక్‌సభ స్ధానాల్లో బీజేపీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టు కోల్పోయిన మమతా బెనర్జీ మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా మహాకూటమికి ప్రయత్నిస్తోందని అన్నారు. కేంద్రం నుంచి అధిక నిధులు అందుతున్నా కేంద్ర పథకాలను మమతా సర్కార్ అమలు చేయడం లేదని ఆరోపించారు. -
పోలింగ్ కు 300 గ్రామాలు దూరం
పురులియా: పశ్చిమ బెంగాల్ లోని పురులియా ప్రాంతంలో 300లకు పైగా గ్రామాలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాయి. ఇప్పటికీ తమ గ్రామాలకు విద్యుత్, తాగునీరు ఇవ్వనందుకు నిరసనగా ఓటర్లు ఎన్నికల పోలింగ్ కు దూరంగా ఉన్నారు. తమకు పాలకులు ఇచ్చిన హామీలు నిలుపుకోలేదని ఈ గ్రామాలకు చెందిన ప్రజలు తెలిపారు. ఇప్పటికీ తమ ఊళ్లలో కరెంట్ లేదని, తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఎవరూ తమను పట్టించుకోవడం లేదని, తామెందుకు ఓటు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది.