Putta Mahesh Yadav
-
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్
-
మోదీకి బాబు బెదిరింపు.. జాతీయ స్థాయిలో ఏపీ పరువు తీసిన ఎంపీ పుట్టా మహేష్
-
తప్పు జరిగింది..! టీడీపీ ఎంపీ పుట్టా వీడియో
-
కోడిని కోస్తే జైల్.. కొకైన్ పీలిస్తే బెయిల్
-
ఫామ్‌హౌస్ డ్రగ్స్‌పై సిట్
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్/శంషాబాద్ రూరల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా పలువురు హైప్రొఫైల్ వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంతో ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. 9 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ డీజీపీ బి.శివధర్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్‌బాబు పర్యవేక్షణలో ఈ బృందం పనిచేయనుంది. చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతం నేతృత్వంలో దర్యాప్తు చేయనుంది. మూడు నెలల్లో చార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్ దర్యాప్తు సమయంలో కేసు మూలాలను పరిశీలించడంతోపాటు, నేరం జరగడానికి సంబంధించిన అన్ని అంశాలనూ విచారించాలని డీజీపీ పేర్కొన్నారు. పుట్టా మహేశ్, రోహిత్‌రెడ్డి ఈ పార్టీ ఎందుకు పెట్టారు? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో ఒక భారీ డీల్ గురించే మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఏపీలోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్, వారి మిత్రులు కలిసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దుబాయ్‌లో రియల్ఎస్టేట్ లావాదేవీలపైనా డ్రగ్పార్టీ మీటింగ్‌లో చర్చించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో పలు రాష్ట్రాల వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండటం.. ఏకంగా పోలీసులను బెదిరించేందుకు కాల్పులకు తెగబడటంతో వారంతా ఏదో పెద్ద డీల్ గురించే చర్చలు చేస్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. రియల్ఎస్టేట్, ఆర్థిక లావాదేవీలు వీరి మధ్య ఉన్నాయని, సెటిల్మెంట్లలోనూ కలిసి పనిచేస్తున్నారని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఫామ్‌హౌస్‌లో కొంతకాలంగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై సిట్ దర్యాప్తు చేయనుంది. ప్రధానంగా ఫామ్‌హౌస్ కేంద్రంగా రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న వీకెండ్ పార్టీలు, వాటికి హాజరవుతున్న హైప్రొఫైల్ వ్యక్తులు సహా రోహిత్ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై వివరాలు సేకరించనుంది. కేసు విచారణలో రాబట్టాల్సిన కీలక విషయాలపై సిట్ అధికారులు శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ కేసు మూలాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి.. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చారు.. డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించారు.. పార్టీ తరువాత వీరంతా ఏం చేయాలనుకున్నారు.. వంటి కీలక విషయాలను విచారణలో రాబట్టాలని చర్చించినట్లు తెలిసింది. దీంతోపాటు పోలీసులపై కాల్పులకు దిగిన ఢిల్లీకి చెందిన నమిత్ శర్మపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన చేసే వ్యాపారాలు ఏంటి? రోహిత్ రెడ్డితో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరంతా ఎప్పుడైనా కలిశారా..? వీరి మధ్య ఇప్పటివరకు ఏమైనా రియల్ఎస్టేట్ వ్యాపారం జరిగిందా? ఇలా పలు కోణాల్లో సిట్ వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఫాంహౌస్ సీజ్! పోలీసులు ఇప్పటికే చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ మినహా మిగతా 8 మంది నిందితులను మంగళవారం శంషాబాద్ పోలీస్ స్టేషన్లో విచారించారు. అయితే ఈ విచారణకు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తోపాటు మరో నలుగురు నిందితులు హాజరు కాలేదు. పుట్టా మహేశ్ తరఫున న్యాయవాది విచారణకు హాజరైనట్లు తెలిసింది. నమిత్‌శర్మకు సంబంధించిన వివరాలతోపాటు పార్టీలో డ్రగ్స్ వినియోగం, కాల్పులకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ వివరాలతో సిట్ బృందం బుధవారం నుంచి దర్యాప్తు ప్రారంభించనుంది. ఏపీకి చెందిన పుట్టా మహేశ్, ఢిల్లీకి చెందిన నమిత్‌శర్మ సహా పలు రాష్ట్రాలతో లింకులు ఉండటంతో ఆయా రాష్ట్రాల్లోనూ సిట్ దర్యాప్తు చేయనుంది. కాగా, రోహిత్‌రెడ్డి, రితేష్‌రెడ్డి, నమిత్ శర్మలను ఏడు రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన గన్ లైసెన్స్‌ను రద్దు చేయాలని సిట్ అధికారులు ఫ్యూచర్ సిటీ కమిషనర్ సు«దీర్‌బాబుకు లేఖ రాశారు. మరోవైపు అసైన్డ్ భూమిలో ఉన్న రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌ను సీజ్ చేయాలని సిట్ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. -
డ్రగ్స్ మాఫియా అరాచకం
హైదరాబాద్ శివారులో ఒక పెద్ద ఫాంహౌస్... అక్కడొక ఈత కొలను...దాని పక్కనే ఆశీనులైన బడాబాబులు... ముందున్న టేబుళ్లపై ఖరీదైన మద్యం సీసాలు, మాదక ద్రవ్యాలు... జర్మన్ తయారీ రివాల్వర్‌తో పోలీసులపై కాల్పులు, బెదిరింపులు, వాగ్వాదాలు– క్రైమ్ కథాచిత్రాన్ని తలదన్నే శనివారం నాటి ఈ దృశ్యం మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయంటే కించిత్తు ఆశ్చర్యం కలుగుతుంది. మొన్న జనవరిలో కూటమి ప్రభుత్వ భాగస్వామ్య పక్షమైన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పట్టుబడితే, తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌తోపాటు మరికొందరు దొరికిన వైనం దీన్ని రుజువు చేస్తోంది. వేయి తలల విషనాగు లాంటి మాదక ద్రవ్య మహమ్మారి ఆనుపానులు రాబట్టడానికి, దాన్ని అంతమొందించటానికి పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. కానీ బడి పిల్లలు మొదలుకొని ఆడ మగ తేడా లేకుండా అందరినీ కాటేస్తున్న ఈ విషనాగు వెనక రాజకీయ పలుకుబడి గల కుటుంబాలున్నాయనీ, కనుకనే దాని అదుపు అసాధ్యమవుతున్నదనీ ఈ పరిణామాలు తెలియజెబుతున్నాయి. ఒకరా ఇద్దరా... తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ, ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ వగైరా 11 మంది ఈ డ్రగ్స్ దందాలో దొరికారు. రెండేళ్ల నాడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతల ప్రసంగాలను గుర్తుంచుకుని ఇప్పుడు వెల్లడవుతున్న పరిణామాలతో బేరీజు వేసుకుంటే ఆ నేతల వంచన ఏపాటిదో అర్థమవుతుంది. మాదక ద్రవ్యాలకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందంటూ వారు పెడబొబ్బలు పెట్టారు. ‘మేం వస్తే వంద రోజుల్లో అరికడతామ’ంటూ ప్రగల్భాలు పలికారు. కానీ అధికారంలోకొచ్చాక అంతవరకూ సాధించిన విజయాలను గుల్లచేశారు. అది మళ్లీ తలెత్తి విస్తరించటానికి అవకాశమిచ్చారు. అప్పటి దుష్ప్రచారమంతా గెలుపు కోసం మాత్రమే కాదు... మాదక ద్రవ్యాలను అరికట్టడం వల్ల కలుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం కోసమని ఆ కూటమి పీఠం ఎక్కింది మొదలు జరుగుతున్న ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇసుక మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. ‘గంజాయి వద్దు బ్రో...’ అంటూనే మాదక ద్రవ్యాలకు తలుపులు బార్లా తెరిచారు. ఏపీలో మాదక ద్రవ్య చీడను అంతమొందించటానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో విజయవంతంగా అమలు చేసింది. దానికితోడు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసింది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఉండే 11,500 ఎకరాల్లోని గంజాయి సాగును ధ్వంసం చేయడంతోపాటు, గిరిజనులు ఇతర పంటల వైపు మళ్లేలా రూ. 500 కోట్లతో ప్రోత్సాహకాలందించింది. విస్తృత తనిఖీలు చేపట్టింది. ఈ కృషినంతా కూటమి పాలన నీరుగార్చింది. పర్యవసానంగా విద్యాసంస్థల్లో చిల్లరగా... ఫామ్‌హౌస్ పార్టీలకు టోకుగా గంజాయి, కొకైన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వగైరాలు చేరిపోతున్నాయి. ఏడాదికి రూ.5,000 కోట్లు వెనకేసుకోవడమే లక్ష్యంగా సాగుతున్న ఈ దందాకు మూలవిరాట్టులు చంద్రబాబు చుట్టూ ఉండే సీనియర్ నేతల కుటుంబాలవారు కావటంతో ఏపీ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. మాదక ద్రవ్యాల వ్యాప్తిపై వెల్లడవుతున్న గణాంకాలు విస్తుగొలుపుతున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా భద్రతా విభాగాలకు రూ. 25,330 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. అంతక్రితంతో పోలిస్తే ఇది 55 శాతం కన్నా అధికం. ఏపీలో వీటికి అలవాటుపడిన వారిలో 10–17 ఏళ్ల మధ్య గలవారి సంఖ్య 3.19 లక్షలు ఉన్నట్టు చెబుతున్నారు. వీటి వెనక డబ్బాశ మాత్రమే కాదు, దాని ఆసరాతో రాజకీయాలను శాసించటం అసలు లక్ష్యం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో తెలంగాణ పోలీసులకు అంతో ఇంతో మంచి పేరుంది. కానీ తాజా కేసు తీవ్రత తెలిసి కూడా, నిందితుడిగా ఉండాల్సిన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చి ఆ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చుకున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరిస్తేనే ఉగ్రవాదాన్ని మించిన ఈ మహమ్మారి దుంపనాశనం సాధ్యం. -
లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్
-
టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్ కేసుపై జగన్ రియాక్షన్
-
వాళ్లంతా అడ్డంగా దొరికినా.. బాబు నో యాక్షన్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడ్డాడని.. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ‘పుట్టా’నేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పుట్టా మహేష్‌తో మొదలై... పుట్టా మహేష్‌తో ఆగిపోలేదు.. ఇలాంటి వాటిపట్ల చంద్రబాబు వ్యవరించిన తీరు అత్యంత దారుణం’’ అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.‘‘ఒక పాలకుడిగా ఆయన వ్యవహరించలేదు. తప్పు చేసిన వారిపట్ల తయన చర్యలు తీసుకోలేదు. అందుకనే విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు స్వయంగా మోసం చేశారని ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తే.. దానిపై కమిటీలు అంట.. కోనేటి ఆదిమూలం మహిళ మీద దారుణమైన లైంగిక దాడిచేస్తే పంచాయితీ చేశారు. కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద నో యాక్షన్...మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మీద నో యాక్షన్. చివరకు మంత్రి సంధ్యారాణి పీఏ మీదా నో యాక్షన్. ప్రస్తుత టీటీడీ ఛైర్మన్ మీదా నో యాక్షన్. వీడియో, ఫొటోలతో పట్టుబడ్డా.. నో యాక్షన్. ఆదినారాయణరెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ.. పట్టుబడితే.. నో యాక్షన్. ఇలాంటి వాటికి వత్తాసు పలికే భావన చంద్రబాబుకు ఉంది కాబట్టే.. ఇలాంటివి జరుగుతున్నాయి’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.‘‘తన కొడుకు స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగుతూ, తూలుతూ అమ్మాయిలతో డ్యాన్స్‌లు చూస్తే నో యాక్షన్. తన బావమరిది అమ్మాయిలకు ముద్దైనా పెట్టాలి, కడుపైనా చేయాలని అని బహిరంగంగా మాట్లాడితే నో యాక్షన్. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎలాంటిదో ఇవన్నీ సూచిస్తున్నాయి. వీళ్లకు ప్రజలకు మంచి చేయాలన్న మైండ్ సెట్ లేదు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...
-
మద్యంలో కొకైన్ కలుపుకొని.. రిపోర్టులో కీలక విషయాలు
-
పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో దొరికినవెంటనే.. అనిత ఫోన్ చేసి...
-
బీసీ, ఎస్సీ నేతలపైనే బాబు ప్రతాపం
సాక్షి, అమరావతి: అడ్డగోలు వ్యవహారాలు నడుపుతూ దొరికిపోయిన టీడీపీ నేతలపై చర్యల విషయంలో సీఎం చంద్రబాబు ద్వంద్వ వైఖరి పట్ల ఆపార్టీ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎస్సీ, బీసీ నేతలైతే వెంటనే చర్యలు తీసుకోవడం.. సొంత సామాజికవర్గం నేతల విషయంలో మౌనముద్ర దాల్చడం ఏంటని మండిపడుతున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ హైదరాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ కేసులో చిక్కడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని షోకాజ్ నోటీసు జారీ చేశారు. అదే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలపై ఎంత దుమారం రేగినా కిక్కురుమనకపోవడాన్ని పలువురు యాదవ సామాజిక వర్గ నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతోనే బీఆర్ నాయుడు పవిత్రమైన టీటీడీ చైర్మన్‌గా ఉండి రాసలీలలు నడుపుతున్నా పట్టించుకోకుండా వదిలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజానీకంలోనూ ఇదే చర్చ జరుగుతోంది. కనీసం టీటీడీకి ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని అయినా బీఆర్ నాయుడిపై చర్యలు తీసుకుంటే బాగుండేదని తటస్థులు సైతం పేర్కొంటున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాల్సిందేనని, ఆయన ఒక్క క్షణం టీటీడీ చైర్మన్‌గా కొనసాగినా పదవికి కళంకమేనని సోషల్ మీడియాలో సైతం చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంతో టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లినా చంద్రబాబు నోరు మెదపలేదు. కనీసం ఆయన్ను వివరణ కూడా అడగకుండా.. ఎవరు ఎటు పోయినా.. రాష్ట్రం ఏమైనా.. టీటీడీ భ్రష్టు పట్టిపోయినా ఫర్వాలేదనే రీతిలో బీఆర్ నాయుడిని కొనసాగిస్తున్నారు. బీఆర్ నాయుడు తీరుపై కూటమి నేతల్లోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వల్ల అందరం ఇరుకునపడ్డామని, ఇంకా అందలం ఎక్కించడం ఏమిటనే అసహనం దాదాపు అందరిలోనూ కనిపించింది. అయినా సరే.. సొంత సామాజికవర్గం కావడం, అందులోనూ తనకు డప్పు కొట్టడంలో రికార్డులు బద్దలుకొట్టిన ఒక టీవీ ఛానల్‌కు బీఆర్ నాయుడు యజమాని కావడంతో చంద్రబాబు చేష్టలుడిగిపోయారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పుట్టాకు షోకాజ్ డ్రామా.. డ్రగ్స్ కేసులో దొరికిపోయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తాను సీరియస్ అయినట్లు చంద్రబాబు లీకులు ఇచ్చారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, వెంటనే వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసుల డ్రామాకు తెర తీశారు. వాస్తవానికి పుట్టా మహేష్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉన్నా సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడు, మరో సీనియర్ నేత సుధాకర్ యాదవ్‌కుమారుడు కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి ఊరుకున్నారు. కనీసం నామమాత్రంగా తీసుకున్న ఇలాంటి చర్యలైనా బీఆర్ నాయుడి విషయంలో ఎందుకు తీసుకోలేకపోయారనే ప్రశ్నకు చంద్రబాబు వైపు నుంచి సమాధానం లేకుండా పోయింది. కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ గతేడాది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వీడియో బయటకు రావడంతో ఆయనపై ఆగమేఘాల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ లోనే ఉన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. దళిత నేత కావడంతో ఆయనపై సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టా మహేష్ బీసీ కావడంతో షోకాజ్ నోటీసు ఇచ్చి డ్రామా నడిపారు. కానీ బీఆర్ నాయుడు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో చంద్రబాబు ఆయన్ను కనీసం వివరణ కూడా అడగలేదు. ఎస్సీ నేతలపై ఒంటి కాలిపై లేస్తున్న చంద్రబాబు.. బీసీలైతే ఓ మాదిరిగా స్పందిస్తున్నట్లు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అదే సొంత సామాజికవర్గం నేతలైతే ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం పట్టించుకోనని తేల్చేసినట్లు ఈ మూడు ఉదంతాల ద్వారా తేటతెల్లమైందని పేర్కొంటున్నారు. -
పుట్టాపై సీరియస్... BR నాయుడుపై మాత్రం నో సీరియస్... జడ శ్రవణ్ సెటైర్లు
-
డ్రగ్స్ కేసులో అరెస్ట్.. ఒక్కరోజులో బెయిల్ సామాన్యులకు సాధ్యమేనా!
-
ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి,హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్‌పూల్ దగ్గర డ్రగ్స్‌తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లగానే మొదట బుల్లెట్ సౌండ్ వినపడింది. బుల్లెట్ సౌండ్ విని వెంటనే అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం కాల్చవద్దు.. ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. మేము చెప్తున్నప్పటికీ కూడా.. పట్టించుకోలేదు. మరో రెండుసార్లు బుల్లెట్ సౌండ్ వినపడింది. మరోవైపు మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటా.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఫైరింగ్ సౌండ్ నిలిచిపోయింది. మేమంతా ఒక్కసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్‌హౌస్ సెర్చ్ చేసేందుకు మేము వారెంట్ తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లోకి వెళ్లిన వెంటనే.. సెర్చ్ వారెంట్లను రోహిత్‌రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో.. తుపాకీని మేం స్వాధీనం చేసుకున్నాం.బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరున్నారు. అతనిని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఫామ్‌హౌస్‌లో ఓ మహిళతో పాటు 10మందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం చేసుకున్నాం. 11 మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి శరత్‌కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతనిని చెక్ చేసినప్పుడు 2 గ్రాముల కొకైన్ బయటపడింది. కొకైన్ ఎవరు తెచ్చారనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.పైలెట్ రోహిత్‌రెడ్డి డ్రైవర్‌ను విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయటపడింది. కొకైన్ తానే తెచ్చానని కౌషిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు తానే కొకైన్ తీసుకొని వచ్చానని చెప్పాడు.’అని తెలిపారు. నగరానికి అతి చేరువలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్ గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు ఒప్పందానికి వేదికగా మారింది. పోలీసులు దాడి చేసి ఆ గుట్టును రట్టుచేశారు. తాజాగా శనివారంరాత్రి ఆయన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ టీం పోలీసులు అక్కడికి చేరుకోగా గన్‌తో కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇందులో ఏపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, మరో తొమ్మిది మంది పట్టుబడ్డారు. -
‘బాబూ.. ఎంపీ మహేష్ తాట తీస్తావా?.. కేవలం డైలాగులేనా?’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌పై చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని ప్రశ్నించింది. కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి.. డ్రగ్స్ తీసుకునే వారిని వదిలేస్తారా? అంటూ ఘాటు విమర్శలు చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘కోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే హాట్‌లైన్ రాజకీయాలతో బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత.. మీరు అనుసరించే చట్టం, న్యాయం, ధర్మం ఇదేనా? ఇలా చేసి సమాజానికి, యువతకు తప్పుడు సందేశం ఇస్తున్న మాట వాస్తవం కాదా?. హైదరాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పాల్గొన్నారన్నది వాస్తవం కాదా? ఆధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారన్నది వాస్తవం కాదా? డ్రగ్ నిర్ధారణ పరీక్షలను తారుమారు చేయడానికి యూరిన్ శాంపిల్స్‌లో భాగంగా యూరిన్ బదులు నీరు ఇచ్చారన్న ఆరోపణ కూడా ఉంది. చివరకు కొకైన్ తీసుకున్నట్టుగా రక్త పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. ఇన్ని పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తిని ఎంపీ పదవికి రాజీనామా చేయించాల్సింది పోయి, తేలుకుట్టిన సామెత మాదిరిగా మౌనం దాల్చడం, పైగా పలుకుబడిని ఉపయోగించి, బెయిల్ మీద తీసుకురావడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డ్రగ్స్ వ్యవహారాల్లో, మహిళలపై నేరాల విషయంలో ఎవరైనా తప్పులు చేస్తే తాటతీస్తా అని పదేపదే చెప్తున్న మాటలు కేవలం డైలాగులు మాత్రమేనని, చేతల్లో శూన్యమని, మీ అసలు రంగు ఇదేనని మరోసారి రుజువు అయ్యింది.కూటమికి చెందిన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా మీకే స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో ఇంకా ఇంకా డ్రామా చేస్తూనే ఉన్నారు.టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళమీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే, పంచాయతీ చేశారు తప్ప నో యాక్షన్.KGBV మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌మీద కూడా నో యాక్షన్. మహిళలకు అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద కూడా నో యాక్షన్.మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పీఏ మీద నో యాక్షన్.ఇక ప్రస్తుత టీటీడీ ఛైర్మన్, ఒక మహిళను మోసం చేసి, వీడియో, ఫొటోలతో అడ్డంగా దొరికిపోయినా నో యాక్షన్. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వొద్దని, విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలు నేరుగా మీకే లేఖ రాసినా టీటీడీ చైర్మన్‌లాంటి పోస్టులో పెట్టారు.కమిటీల విచారణ, షోకాజ్ నోటీసుల పేరిట చేస్తున్న డ్రామాలు ఇకనైనా కట్టిపెట్టి, డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎంపీ చేత తక్షణమే రాజీనామా చేయించడంతోపాటు, వీళ్లందరి మీద చర్యలు తీసుకోండి. లేకపోతే మీ పార్టీని ప్రజలు క్షమించరు’ అంటూ ఘాటు విమర్శలు చేసింది. 🚨 #TDPDrugMafiaకోడిని కోస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టి, రాజకీయ కక్షలతో అమయాకులను రోడ్ల మీద పరేడ్ చేయించడమే కాకుండా, జైళ్లకు పంపిన మీరు, మీ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకుని అడ్డంగా దొరికితే, పార్లమెంటు చరిత్రలో ఒక ఎంపీ ఇలా డ్రగ్స్… pic.twitter.com/uzpnXwd562— YSR Congress Party (@YSRCParty) March 16, 2026 -
టీడీపీ ఎంపీ చీకటి బాగోతం.. మౌనంగా చంద్రబాబు, ఎల్లో మీడియా
-
ఏపీ పరువు తీసిన ఏలూరు ఎంపీ.. TDP గుట్టురట్టు..
-
నేను తప్పు చేయలేదు.. అడ్డంగా దొరికి బుకాయింపు
-
తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ గుట్టు రట్టు... డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ
-
ఇది మూడోసారి!
సాక్షి, హైదరాబాద్: ఏలూరు ఎంపీ, తెలుగుదేశం పార్టీ నేత పుట్టా మహేశ్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్న రేవ్ పార్టీతో మెయినాబాద్ అజీజ్‌నగర్‌లో ఉన్న ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గడిచిన ఐదున్నరేళ్ల కాలంలో ఇది వివాదాస్పదం కావడం ఇది మూడోసారి. కాగా పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో తాజాగా రేవ్ పార్టీకి తోడు కాల్పుల కలకలం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. తొలిసారి..: ఈ ఫామ్‌హౌస్ తొలిసారిగా 2022 అక్టోబర్‌లో వార్తల్లోకి ఎక్కింది. ఆ నెల 26 రాత్రి నిఘా విభాగం, సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు చేస్తున్న తిరుపతికి చెందిన సింహయాజులు, ఫరీదాబాద్‌లోని ఓ దేవాలయంలో ఉండే ఢిల్లీకి చెందిన సతీష్ శర్మ అలియాస్ రామచంద్ర భారతి, హైదరాబాద్ వాసి నందకుమార్‌లను పట్టుకున్నారు. అక్కడ మొదలైన ఈ కథ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు, రోహిత్‌రెడ్డి సహా అనేక మంది విచారణ వరకు వెళ్లింది. ఈ ‘ఎర’కు సంబంధించిన ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. మరోవైపు సీబీఐ, సిట్‌ల్లో ఎవరు దర్యాప్తు చేయాలనే అంశంపై ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. మలిసారి..: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) కేంద్రంగా సాగిన ట్యాపింగ్‌పై 2024 మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన సిట్ కొన్ని కీలకాంశాలు గుర్తించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ జరిగిన ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చినట్లు తేల్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారానే ఈ విషయాన్ని నాటి నిఘా వర్గాలు గుర్తించినట్లు సిట్ తేల్చింది. అందుకు అవసరమైన ఉపకరణాలను సైతం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించింది. తాజాగా..: ఈ ఫామ్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం మొదలైన రేవ్ పార్టీ రాత్రి వరకు కొనసాగింది. ఈగల్, ఫ్యూచర్ సిటీ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో రోహిత్‌రెడ్డి, పుట్టా మహేశ్ సహా 11 మంది చిక్కారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. పోలీసుల దాడికి ముందు కాల్పులు సైతం చోటు చేసుకోవడంతో ఈ కేసులో మాదకద్రవ్యాల చట్టంతో పాటు ఆర్మ్స్ యాక్ట్‌ను జోడించారు. పుట్టా మహేశ్, రోహిత్ రెడ్డి సహా ఇతర నిందితులను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. -
‘పచ్చ’ మత్తు.. జనం చిత్తు
సాక్షి, అమరావతి: ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకుని దొరికి పోవడంతో ఆ పార్టీ పరువు బజారున పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్‌గా మారిందని ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్, గంజాయి మాఫియా చెలరేగిపోతోందని, పచ్చ పార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడి బాగోతాన్ని గుర్తు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు అండ్ కో కానీ, ఎల్లో మీడియా కానీ నోరు మెదపడం లేదని ఎత్తి చూపుతున్నారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దందా బయటపడినా వాటి మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నాయి. దేశంలో ఎక్కడ డ్రగ్స్ పార్టీని పోలీసులు ఛేదించినా టీడీపీ కూటమి పెద్దలే చిక్కుతున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులే డ్రగ్స్ మత్తులో జోగుతూ దొరుకుతున్నారు. ఎందుకంటే డ్రగ్స్ దందా సాగిస్తున్నదే టీడీపీ పెద్దలు కావడంతో.. హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో డ్రగ్స్ పార్టీల్లో వాళ్లే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రజా ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు ఉంటే చాలు.. డ్రగ్స్ దర్జాగా ఫాం హౌస్‌లకు నడచి వస్తాయన్నది బహిరంగ రహస్యంగా మారింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కడంతో ఆ విషయం మరోసారి నిరూపితమైంది. టీడీపీ కూటమి పెద్దల కనుసన్నల్లో సాగుతున్న డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని కొల్లగొడుతోంది. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా యావత్ దేశంలో బరితెగించి దందా సాగిస్తోంది. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడతామని 2024 ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కీలక నేతల కుటుంబాలే ప్రాంతాల వారీగా డ్రగ్స్, గంజాయి, కల్తీ మద్యం దందాను పర్యవేక్షిస్తుండటంతో పోలీసు శాఖ చోద్యం చూస్తూండిపోవాల్సి వస్తోంది. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవస్థీకృతమైన డ్రగ్స్, గంజాయి, నకిలీ మద్యం మాఫియా రాష్ట్రాన్ని అమాంతం కబళించేస్తోంది. డ్రగ్స్: డోర్ డెలివరీ ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోంది. ఏకంగా కొరియర్ సర్వీసులతో డోర్ డెలివరీ చేసే డ్రగ్స్ దందా రాష్ట్రంలో వేళ్లూనుకుంటోంది. యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ దందాకు రాష్ట్రం అడ్డాగా మారిపోయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డ్రగ్ డీలర్లు తమ దందాకు ఆంధ్రప్రదేశ్నే ప్రధాన మార్కెట్‌గా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ⇒ కొన్ని నెలల క్రితం ఢిల్లీ నుంచి నూజివీడు మీదుగా విజయవాడకు తరలిస్తున్న ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్రంలో డ్రగ్స్ దందా తీవ్రతకు ఓ నిదర్శనం మాత్రమే. ఆ ఉదంతం రాష్ట్రంలో డ్రగ్స్ దందాలో కేవలం గొరంతేనని.. వాస్తవానికి రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ దందా కొండంత ఉందని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. దేశంలో ప్రధాన నగరాలే కేంద్రంగా విస్తరించిన డ్రగ్స్ మాఫియా, రాష్ట్రంలో మాత్రం ఊరూరా విస్తరిస్తోంది. ఢిల్లీ, ముంబై, అమృత్సర్ తదితర నగరాల్లోని డ్రగ్స్ మాఫియా ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్న డ్రగ్స్‌ను మార్కెట్ చేయడానికి ఏపీనే గమ్యస్థానంగా ఎంచుకుంది. ⇒ వివిధ రూపాల్లోని ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాష్ట్రంలోకి యథేచ్ఛగా తరలిస్తున్నారు. అందుకోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కర్నూలు, కాకినాడ వంటి ప్రధాన నగరాలతోపాటు హిందూపూర్, నంద్యాల, నూజివీడు, ఏలూరు, జగ్గయ్యపేట, భీమవరం, రాజమహేంద్రవరం, విజయనగరం వంటి దాదాపు 50 పట్టణాల్లో కూడా డ్రగ్స్ మాఫియా ఏజెంట్ల వ్యవస్థను నెలకొల్పింది. ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఇందుకోసం కొరియర్ సర్వీసులను వాడుకుంటున్నాయి. ⇒ ఏజెంట్లు అందుకున్న డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి డ్రగ్స్ వెండర్స్ (విక్రేతలు)కు అందిస్తున్నారు. ఆ వెండర్స్ వాటిని గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ యువతను మత్తులో ముంచుతున్నారు. డ్రగ్స్ మాఫియా రాష్ట్రంలోని విద్యా సంస్థలనే తమ దందాకు కేంద్రంగా చేసుకుంది. ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ పొందిన వెండర్స్ విద్యా సంస్థల ప్రాంగణాలకు సమీపంలోనే వాటిని విక్రయిస్తున్నారు. అందుకోసం ఉన్నత విద్యా సంస్థల సమీపంలోనే బడ్డీ కొట్టులు, స్ట్రీట్ వెండర్స్ రూపంలో డ్రగ్స్ విక్రయాలు యథేచ్ఛగా సాగిస్తున్నారు. సిగరెట్లు, చాక్లెట్లు, చూయింగ్ గమ్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారు. విజయవాడలోని ఉన్నత విద్యా సంస్థల ప్రాంగణాల సమీపంలో విక్రయించేందుకే ఢిల్లీ నుంచి కొరియర్ సర్వీసు ద్వారా నూజివీడు మీదుగా డ్రగ్స్ తరలించడమే అందుకు తాజా నిదర్శనం. కేసుల నమోదు గోరంత.. స్మగ్లింగ్ కొండంత ⇒ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి దందా యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు. నామ మాత్రంగా కేసులు నమోదు చేస్తూ కనికట్టు చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్రంలో సాగుతున్న డ్రగ్స్ దందాతో పోలిస్తే నమోదు చేస్తున్న కేసులు 10% మాత్రమేనని పోలీసు వర్గాలే చెబుతుండటం గమనార్హం. ⇒ 2024లో రాష్ట్రంలో 1,600 ఎన్డీపీఎస్ (నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్) కేసులు నమోదయ్యాయి. 2025లో 1,836 కేసులు నమోదు చేసి 46,011 కేజీల గంజాయిని స్వా«దీనం చేసుకున్నారు. వాస్తవానికి రాష్ట్రం మీదుగా సాగుతున్న డ్రగ్స్ దందా.. ఇందుకు పదుల రెట్లు అధికంగా ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మత్తుకు బ్రాండ్ అంబాసిడర్లు పచ్చ బాబులే డ్రగ్స్, గంజాయి దందా సాగించడమే కాదు.. టీడీపీ కూటమి కీలక నేతల కుటుంబ సభ్యులు డ్రగ్స్ మత్తులో మజా చేస్తూ హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకొని అడ్డంగా దొరికారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుదీర్ రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ పోలీసులకు చిక్కారు. గత ఏడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.చోద్యం చూస్తున్న చంద్రబాబు ప్రభుత్వం⇒ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన కార్యాచరణ చేపట్టలేదు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో సమర్థవంతంగా అమలు చేసింది. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేసి పటిష్ట కార్యాచరణ చేపట్టింది. ⇒ రాష్ట్రంలో ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగిస్తున్న గంజాయి సాగును కూకటివేళ్లతో పెకలించింది. ఏకంగా 11,500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. అందుకోసం రూ.500 కోట్లతో ప్రత్యేక పథకాన్ని అమలు చేసింది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి డ్రగ్స్ అక్రమ రవాణాను సమర్థవంతంగా కట్టడి చేసింది. సెబ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి విస్లృతంగా తనిఖీలు చేసి అక్రమ రవాణాను అడ్డుకుంది. ⇒ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు వ్యవస్థ డ్రగ్స్‌పై పట్టు వదిలేసింది. కక్షపూరితంగా సెబ్‌ను రద్దు చేసింది. కొత్తగా ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ ఆ వ్యవస్థకు ఎలాంటి మౌలిక వసతులు సమకూర్చలేదు. విస్తృత అధికారాలు కల్పించలేదు. ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా కేంద్రంగా డ్రగ్స్ దందాకు టీడీపీ సీనియర్ నేత కుటుంబం అండదండలు ఉండటంతో ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఉదాసీనంగా ఉంటోందన్న విషయం స్పష్టమైంది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం కావడంతో పోలీసు శాఖ చోద్యం చూస్తోంది.కబళిస్తున్న నకిలీ మద్యం ⇒ ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దందానే లక్ష్యం ⇒ డ్రగ్స్ దందాతోపాటు టీడీపీ కూటమి పెద్దలు రాష్ట్రంలో నకిలీ, కల్తీ మద్యం రాకెట్‌ను వ్యవస్థీకృతం చేశారు. ఏకంగా కుటీర పరిశ్రమ స్థాయిలో ఊరూవాడా యూనిట్లను ఏర్పాటు చేసి నకిలీ మద్యం ఏరులై పారిస్తున్నారు. తొలి ఏడాదే రూ.5 వేల కోట్ల మేర మద్యం దందాకు పాల్పడ్డారు. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పచ్చ మాఫియా చెలరేగిపోతోంది. ⇒ అన్నమయ్య, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఎన్టీఆర్, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం తయారీ యూనిట్ల నిర్వాహకులు టీడీపీ నేతలే కావడంతో పచ్చ ముఠా బండారం బట్టబయలైంది. ఆ కేసుల్లో పాత్రధారులైన టీడీపీ చోటా నేతలను మాత్రమే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులైన టీడీపీ పెద్దలపై ఈగ వాలనివ్వ లేదు. ⇒ టీడీపీ కీలక నేతలే ప్రాంతాల వారీగా నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు కాబట్టి.. రాష్ట్రంలో నకిలీ/కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల నుంచి రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీల ద్వారా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ⇒ రాష్ట్రంలో ఉన్న 20 మద్యం డిస్టిలరీలు టీడీపీ కీలక నేతల ఆ«దీనంలోనే ఉండటం సిండికేట్ దందాకు కలసివస్తోంది. అలా సేకరించిన స్పిరిట్‌ను అక్రమంగా కల్తీ మద్యం యూనిట్లకు తరలిస్తున్నారు. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు. దాన్ని టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న 4,346 మద్యం దుకాణాలు, దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు, 540 బార్ల ద్వారా దర్జాగా విక్రయిస్తున్నారు. ఏసీ బ్లాక్, ఓల్డ్ అడ్మిరల్, ఎస్పీవై 999 తదితర బ్రాండెడ్ మద్యంగా నమ్మబలుకుతూ కల్తీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. -
‘దేశం’లో కలకలం!
సాక్షి, అమరావతి: హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు రకరకాల గారడీలు చేస్తుంటే పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు డ్రగ్స్ పార్టీలు, రాసలీలల్లో మునిగి తేలుతుండడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో జరిగిన ఒక డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీడీపీ శిబిరం ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతోంది. మహేశ్ డ్రగ్స్ వ్యవహారంతో టీడీపీ పరువు బజారున పడిందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. ఇలాంటి నేతలకు సీట్లు ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు నాలుక కరుచుకుని ఉపయోగం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పుట్టా మహేశ్‌కు రాజకీయ అవగాహన లేకపోయినా, కేవలం డబ్బు ఉందనే కారణంతో కడప జిల్లా నుంచి తీసుకువచ్చి గత ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటు ఇచ్చారు. ఎక్కడి నుంచో వలస వచ్చిన నేతకు ఇక్కడ ఎంపీగా చేయడం ఏమిటని స్థానిక టీడీపీ నేతలంతా వ్యతిరేకించినా చంద్రబాబు ఆయనకే సీటిచ్చారు.ఎంపీగా గెలిచిన తర్వాత మహేష్ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా మాత్రమే వెళుతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పుట్టా మహేష్ టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడికి సొంత అల్లుడు. మరో సీనియర్ నేత, టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు. అందుకే ఆయనకు ఎంపీ సీటు చాలా సులభంగా దక్కిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ నాయుడు రాసలీలలు మరవక ముందే.. ఏడాదిగా కూటమి పార్టీల నేతలు ప్రజలు, పరిపాలనను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటకు రావడంతో దానిపై రాజకీయ దుమారం రేగింది. తన చేష్టలను బీఆర్ నాయుడు నిస్సిగ్గుగా సమర్థించుకున్నా, సోషల్ మీడియా మాత్రం ఆయన నిజ స్వరూపాన్ని కడిగి పారేసింది. కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయానికి చైర్మన్‌గా ఉన్న వ్యక్తి రాసలీలలు బయటకు రావడంతో ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ బలంగా వచ్చింది. అయితే ఆయన ఒక టీవీ ఛానల్‌కు యజమాని కావడంతో ఆయనపై చర్య తీసుకునేందుకు, రాజీనామా చేయించేందుకు చంద్రబాబు వెనుకాడినట్లు ప్రచారం జరిగింది. కానీ నీతి నియమాలు లేని వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడం, ఆయనకు చంద్రబాబు మద్దతు పలకడంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ నాయుడి వ్యవహారం సర్దుమణగక ముందే పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారం గుట్టు రట్టయింది. అదే బాటలో పలువురు క్యూ కొద్దిరోజుల క్రితం జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కొడుకు సైతం హైదరాబాద్‌లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డాడు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఆ నియోజకవర్గానికి చెందిన కేజీబీవీ ప్రిన్సిపాల్ మీడియా ఎదుట చెప్పి బోరున విలపించారు. ఆమెకు న్యాయం చేయకపోగా ఆమెను బెదిరించి నోరు మూయించేందుకు ఎమ్మెల్యే, అధికార పార్టీ నేతలు ప్రయత్నించారు. జనసేనకు చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించినట్లు ఒక మహిళ వీడియోలు విడుదల చేయడం కలకలం రేపింది. ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచడం తప్ప జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఆయనపై చర్య తీసుకోలేదు. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల వ్యవహారం రట్టయింది. ఆయన వేధింపుల వీడియోలు బయటకు వచి్చనా బాధితుల్ని బెదిరించి రాజీ చేశారనే విమర్శలు వచ్చాయి. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ మహిళలను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమిలో ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలకు సంబంధించి తరచూ రాసలీలలు, లైంగిక వేధింపులు, డ్రగ్స్ వ్యవహారాలు బయట పడుతున్నాయి. చంద్రబాబు పైకి నీతి సూత్రాలు చెబుతూ కవర్ చేస్తున్నా, ఆ పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం ఇష్టానుసారం చెలరేగిపోతున్నట్లు ఈ ఘటనల ద్వారా తేటతెల్లమవుతోంది.ఆ ఎంపీకి షోకాజ్‌తో సరిహైదరాబాదులో డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కు కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి సరిపెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ అయినట్లు అనుకూల మీడియాకు టీడీపీ కార్యాలయం ఆదివారం లీకులు ఇచ్చింది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును చంద్రబాబు ఆదేశించినట్లు తెలిపింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు సీరియస్ అయినట్లు, షోకాజ్ నోటీసులు ఇవ్వమన్నట్లు ఇచ్చిన లీకులన్నీ డ్రామాయేననే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మహేశ్‌కు ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని సమాచారం. తీవ్ర స్థాయి ఆరోపణలు వచ్చినా సరే చంద్రబాబు ఆయన్ను వెనకేసుకుని వస్తున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఈపాటికి సస్పెన్షన్ చేసేవారని.. బాబు తీరు చూస్తుంటే అంతా ఉత్తుత్తి హడావుడేనని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. -
టీడీపీ గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్/మొయినాబాద్: హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ వద్ద ఫాంహౌస్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారికి జరిపిన పరీక్షల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్టు ఈగల్ అధికారులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకోలేదని బుకాయిస్తూ టీడీపీ ఎంపీ పుట్టా యూరిన్‌లో నీళ్లు కలిపి తొలుత ఎత్తులు వేసినా తుదకు అవి పారలేదు. ఈగల్ అధికారులు రక్త నమూనా పరీక్షలు చేయించడంతో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. అజీజ్‌నగర్ సమీపంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారంతో ఈగల్ టీం, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సంయుక్తంగా శనివారం రాత్రి సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాలకు సంబంధించి ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్) డైరెక్టర్ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నిబంధనల ప్రకారం డ్రగ్ పాజిటివ్ వచ్చినా, గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మలను మాత్రమే పోలీసులు ఆదివారం రాజేంద్రనగర్ కోర్టు జడ్జి నివాసానికి తీసుకెళ్లి ఆయన ముందు ప్రవేశపెట్టగా, ఆయన వారికి రిమాండ్ విధించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి పోలీసులే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌ను తప్పించేందుకు పోలీసులపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు తెలిసింది. అందుకే డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినా, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్‌లో శనివారం కొందరు పార్టీ చేసుకుంటున్నారని, అందులో డ్రగ్స్ కూడా వాడుతున్నట్టు ఈగల్ టీం అధికారులకు సమాచారం అందింది. వారు ఫ్యూచర్ సిటీ ఎస్ఓటీ, స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి శనివారం రాత్రి 10 గంటకు ఆ ఫాం హౌస్ వద్దకు సోదాల కోసం వెళ్లారు. అదే సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం రావడంతో పోలీసులు హుటాహుటిన లోపలికి వెళ్లి చూశారు. ఫాం హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ సమీపంలో సోఫాల్లో కొంత మంది కూర్చుని మద్యం సేవిస్తుండగా, వాష్‌రూం దగ్గర ఉన్న వ్యక్తి నమిత్ శర్మ చేతిలో 0.32 జర్మన్ డ్ రివాల్వర్, అతడి పక్కన ఉన్న సిల్వరి శరత్‌కుమార్ చేతుల్లో ఖాళీ బుల్లెట్ కేస్లు గుర్తించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఫాంహౌస్‌లో సోదాలు జరపగా మరో తొమ్మిది మంది మద్యం, ఇతర మత్తు పదార్థాలు తీసుకుటున్నట్టు గుర్తించారు. 0.26 గ్రాముల కొకైన్ పట్టుబడింది. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి పీఏ/డ్రైవర్ సిల్వరి శరత్ కుమార్ కొకైన్‌ను అందరికీ పంచి, మిగిలిన రెండు ప్యాకెట్లు తన జేబులో పెట్టుకోవడంతో అది పోలీసులకు దొరికింది. దీన్ని తన యజమాని రోహిత్‌రెడ్డి స్నేహితుడు కౌశిక్ రవి తెచ్చాడని తెలిపాడు. తాను వ్యాపార పర్యటనలో సిమ్లాకు వెళ్లినప్పుడు తెలియని వ్యక్తి నుంచి కొకైన్‌ను కొన్నానని, దానిని ఈ పార్టీకి తీసుకువచ్చినట్టు కౌశిక్ రవి కూడా అంగీకరించాడు. రాత్రి నెగెటివ్.. ఉదయానికి పాజిటివ్ సోదాల అనంతరం పోలీసులు పార్టీలో పాల్గొన్న 11 మందికీ డ్రగ్ టెస్ట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. తొలుత టెస్ట్‌కు శాంపిల్ ఇచ్చేందుకు ఎంపీ మహేశ్‌కుమార్ అంగీకరించలేదని, పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టు తెలిసింది. పోలీసులు, ఈగల్ అధికారులు టెస్ట్ చేయాల్సిందేనని స్పష్టం చేయడంతో వెనక్కి తగ్గిన ఆయన కొత్త ఎత్తులు వేసినట్టు సమాచారం. టెస్ట్ కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని కోరగా, పుట్టా మహేష్ యూరిన్‌కు బదులు వాటర్ ఇవ్వడంతో తాత్కాలికంగా శనివారం రాత్రి చేసిన టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. దీన్ని అదనుగా చూపుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినట్టు సమాచారం. అయితే, నిబంధనల మేరకు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారందరికీ రక్త పరీక్షలు తప్పనిసరి అని చెప్పడంతో ఎర్రగడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో మరోసారి 11 మంది రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించారు. దీంతో ఎంపీ మహేశ్ కుమార్ రక్త నమూనా పరీక్షలో డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పెద్ద ఎత్తున మద్యం సీసాలూ లభ్యం కింగ్ ఫినిష్డ్ ఆల్ట్రా 330 ఎంఎల్ 48 సీసాలు, రెండు డాన్జులియో 700 ఎంఎల్ సీసాలు, రాయల్ సెల్యూట్ 21 ఏళ్ల మద్యం లీటర్ సీసా ఒకటి, చివాస్ 18 ఏళ్ల మద్యం సీసాలు 2, బెలివడెరీ వోడ్కా 700 ఎంఎల్ రెండు సీసాలు పట్టుబడ్డాయి. ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు ఫాంహౌస్ డ్రగ్ పార్టీకి సంబంధించి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ ఎస్సై నయాముద్దీన్ ఫిర్యాదు మేరకు నిందితులపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఆదివారం క్రైం నంబర్ 150/2026 కింద కేసు నమోదైంది. డ్రగ్స్ వినియోగం, మారణాయుధాల వాడకం, నేరానికి ప్రేరేపించారనే కారణంతో ఎన్డీపీఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 8 (సీ), 22(ఏ), 27, 29 ఆరŠమ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25(1–బి)(ఏ), సెక్షన్ 30, తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్‌లోని సెక్షన్ 34 (ఏ), బీఎన్ఎస్ సెక్షన్ 109,131 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీళ్లంతా ఎందుకు కలిశారు? మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్ పార్టీలో పలు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా ఒకచోట చేరడంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. వ్యాపార లావాదేవీలతోపాటు వీరి మధ్య ఆర్థిక సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. ముఖ్యమైన డీల్ విషయమై చర్చించేందుకే వీరంతా స్నేహ పూర్వకంగా శనివారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పట్టుబడిన వారిలో స్థానిక రాజకీయ నాయకుడు రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌లు ఉండడం, వీరితోపాటు బిజినెస్‌లో ఉన్న మోరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయ్ కృష్ణ, అర్జున్‌రెడ్డి, అడ్వొకేట్ రవి ఉన్నారు. ఏ డీల్ కోసం భేటీ అయ్యారన్నది దర్యాప్తులో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్ : ఈగల్ ఎస్పీ గిరిధర్ ‘మొయినాబాద్‌లోని ఒక ఫామ్ హౌజ్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు శనివారం మాకు పక్కా సమాచారం అందింది. మా ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులతో కలిసి ఫామ్‌హౌజ్‌పై రైడ్ చేసేందుకు వెళ్లాం. అక్కడికి వెళ్లిన సమయంలో మాకు అక్కడ గన్ కాల్చినట్టు శబ్దం వినిపించింది. వెంటనే మా అధికారులు, సిబ్బంది పరుగెత్తుకుని ఫాం హౌస్‌లోకి వెళ్లి గన్ పట్టుకున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకున్నాం. అతడు ఆకాశం వైపు గన్ ఎక్కుపెట్టి కాల్చినట్టు నిర్ధారణ అయ్యింది. అతడి పక్కన ఉన్న వ్యక్తి దగ్గర ఉపయోగించిన నాలుగు క్యాట్రిజెస్ స్వాదీనం చేసుకున్నాం. ముందుగా కస్టడీలోకి తీసుకున్న ఇద్దరితోపాటు ఆ ఫాంహౌస్ పార్టీలో పాల్గొన్న ఒక మహిళ సహా తొమ్మిది మందికి వెంటనే డ్రగ్స్ టెస్ట్ చేశాం. అందులో తొలుత ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 4 ప్రకారం.. పట్టుబడిన వారందరికీ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త నమూనాలు తీసుకుని పరీక్ష చేయించగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఎంపీ పట్టా మహేశ్ కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతడి సోదరుడు రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, తిరువీధుల అర్జున్‌రెడ్డి, కౌశిక్ రవి ఉన్నారు. నెగిటివ్ వచ్చిన వారిలో మొరవినేని రమేశ్, వరమచనేని శ్రవణ్‌కుమార్, నల్లపనేని విజయకృష్ణ, సిలివేరి శరత్‌కుమార్, ఆర్.ప్రియాంకరెడ్డి ఉన్నారు. మాకున్న సమాచారం ప్రకారం పార్టీ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. కొందరు కొందరుగా యాడ్ అవుతూ వచ్చారు. ఇలా మొత్తం 11 మంది వచ్చిన సమయంలో మేం అదుపులోకి తీసుకున్నాం. వెపన్ కాల్చిన వ్యక్తిని జైపూర్‌కు చెందిన నమిత్ శర్మగా గుర్తించాం. రితేశ్‌రెడ్డి పేరిట ఆ తుపాకీ లైసెన్స్ ఉన్నట్టు అతను తెలిపాడు. అతడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. అతడు ఎందుకు వచ్చాడన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ పార్టీని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తన ఫాంహౌస్‌లో ఏర్పాటు చేశారు’అని ఆదివారం ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాకు తెలిపారు. రెండు గ్రాముల కొకైన్‌ను పార్టీ కోసం తీసుకురాగా.. ఒక గ్రామ్ వరకు కొకైన్‌ను ఫాం హౌస్‌లో గుర్తించామని, పట్టుబడిన డ్రగ్ కచ్చితంగా ఏంటనేది ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని చెప్పారు. ముగ్గురికి రిమాండ్.. మిగతా వారికి స్టేషన్ బెయిల్ ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని పక్కన పెట్టి.. కేవలం గన్ ఫైరింగ్‌తో సంబంధం ఉన్న తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అతని సోదరుడు రితేష్‌రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్ వ్యాపారి నమిత్ శర్మను మాత్రమే పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుల్లో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్‌తోపాటు మరో ఏడుగురికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కాగా, ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ చేయడంలో పోలీసులు తాత్సారం చేసినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి ఘటన జరిగితే ఆదివారం మధ్యాహ్నం వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. శనివారం రాత్రి పట్టుబడిన 11 మందిని తొలుత శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మొయినాబాద్ పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రిమాండ్ రిపోర్టు తయారు చేసి దాన్ని శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచే ముగ్గురిని రిమాండ్‌కు తరలించి, మిగిలిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. నిందితులు మీడియా కంట పడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. -
డ్రగ్స్ కేసు వివాదం: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ బుకాయింపు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎంపీ మహేష్ యాదవ్ ఖండిస్తూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన తర్వాత స్టేషన్ బెయిల్ పై విడుదలైన మహేష్, వీడియోలో తన నిర్దోషిత్వాన్ని వాదించుకోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. తెలంగాణ పోలీసులు మాత్రం స్పష్టంగా మహేష్ డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. సోషల్ మీడియాలో ఆయన వీడియోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. -
పుట్టా మహేష్ ఇష్యూ: షోకాజ్ నోటీసుతో సరిపెట్టిన చంద్రబాబు
సాక్షి, విజయవాడ: టీడీపీలో డ్రగ్స్ కలకలం చెలరేగుతోంది. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయినప్పటికీ, షోకాజ్ నోటీసుతో సరిపెట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పుట్టా మహేష్‌ను టీడీపీ ఆదేశించింది. డ్రగ్స్ ఘటనపై పుట్టా మహేష్ వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవాలని కోరారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. పుట్టా మహేష్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి, ఎంపీ పదవికి రాజీనామా చేయించాలని సర్వత్రా డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ డ్యామేజ్ కంట్రోల్ కోసం షోకాజ్ నోటీసులతో సరిపెట్టారు చంద్రబాబు. అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం తరహాలోనే నోటీసుల డ్రామా వేస్తున్నారు. గలీజ్ కూటమి ఎమ్మెల్యేలపై ఇప్పటికీ చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోలేదు. దేశంలోనే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డ ఏకైక ఎంపీ పుట్టా మహేష్. ఇవీ చదవండి: పుట్టా మహేష్, ప్రియాంక రెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు -
పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
-
పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఈగిల్ ఫోర్స్ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. పుట్టా మహేష్, ప్రియాంకరెడ్డికి నోటీసులు ఇచ్చి పోలీసులు వదిలేశారు. పెద్దల ఒత్తిళ్లతోనే వదిలేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్‌రెడ్డి, నితిన్ శర్మను పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. కాగా, ఫాంహౌస్‌లో దొరికిన 11 మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రైడ్స్ సమయంలో కాల్పులు జరిపిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. -
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. కేటీఆర్ ఏమన్నారంటే?
సాక్షి,హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో తన పేరును లాగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు డ్రగ్స్ టెస్టులు చేయించుకునేందుకు తాను రెడీగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.‘మాదకద్రవ్యాలు మనుషులుని రాక్షసులుగా మారుస్తాయి. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు కూడా డ్రగ్స్ వాడటం దురదృష్టకరం. డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు నేను పూర్తిగా వ్యతిరేకం. రాజకీయంగా ఎంతటి వారైనా మాదక ద్రవ్యాల్ని వినియోగించినా, అక్రమంగా విక్రయించినా, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి. అయితే డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ పార్టీని లాగడాన్ని ఖండిస్తున్నాను. డ్రగ్స్ కేసును బీఆర్ఎస్పై రాజకీయ ప్రతీకారంగా వాడుకోవడం మీ రాజకీయాల ప్రతిబింబం. నేను ఇప్పటికే పలుమార్లు చెప్పినట్లుగా ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్ష చేయాలని మహేష్ కుమార్ గౌడ్ సూచనను స్వాగతిస్తున్నాను. అలాగే, ప్రతి డ్రగ్స్ కేసులో నా పేరును అనవసరంగా లాగితే చట్టపరమైన నోటీసులు ఇస్తాం’అని హెచ్చరించారు. Drugs create monsters out of human beings. It is unfortunate that even people in responsible positions are resorting to drug usageI personally am strictly against drugs and usage of illicit substances. My party BRS condemns usage of drugs and any illegal activities. Any one…— KTR (@KTRBRS) March 15, 2026హైదరాబాద్ శివారు ప్రాంతమైన ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో వీకెండ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుని ఏపీ ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌తో పాటు పలువురు పట్టుబడ్డారు. ఈ ఘటనపై అధికార, ప్రతిపక్ష నేతలు పరస్పరం తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫాం హౌస్ జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. -
‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’
తిరుపతి: డ్రగ్స్ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తిరుపతి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్‌రెడ్డి. టీడీపీ అంటే క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా? అని నిలదీశారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. ‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయిటిటిడి చైర్మన్‌గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడటం హేయమైన చర్యవిజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్‌తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి ఈ తరహా పనులు చేయడమేంటి?, భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం. కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది. టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి. టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. -
‘పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు’
హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడం కలకలం రేపుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసుల ప్రకటించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ పుట్టా మహేష్ తీరుపై మండిపడ్డారు.‘చంద్రబాబు బ్రాండ్.. డ్రగ్స్ బ్రాండ్. డ్రగ్స్ మాఫియాను చంద్రబాబు పెంచి పోషిస్తున్నారు. సామాన్యుడికి ఒక రూల్.. ఎంపీకి మరో రూల్ ఉండకూడదు. పుట్టా మహేష్‌ను రక్షించడానికి చంద్రబాబు రంగంలోకి దిగారు. పుట్టా మహేష్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదు’ అని కాకాణి అన్నారు. కాగా, వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యం కావడంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఫాంహౌస్‌లో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. -
‘ఇంత జరుగుతున్నా.. చంద్రబాబు నోరు విప్పరేం?’
సాక్షి, కాకినాడ జిల్లా: టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీలా మారిందన్న అనుమానం ప్రజలకు వచ్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో దొరికారు. ఇప్పటి వరకు దీనిపై చంద్రబాబు కానీ.. టీడీపీ నేతలు కానీ నోరెత్తలేదు. తెల్లవారు లేస్తే ప్రవచనాలు చెప్పే చంద్రబాబు.. డ్రగ్స్ తీసుకుని దొరికిన ఎంపీపై ఏం చెబుతారు అని మేము అడుగుతున్నాం’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘డ్రగ్స్ రహిత సమాజం సృష్టించాలని.. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మంత్రి లోకేష్ ఉద్యమంలా ప్రచారం చేశారు. డ్రగ్స్ వద్దని ప్రజలకు చెబుతారు కానీ.. మీ పార్టీలో వారు మాత్రం సేవిస్తూ ఉంటారు. ఎదుట వారికి చెప్పడానికే నీతులు.. మేము మాత్రం అన్ని పనులు చేస్తాం అన్నట్లు ఉంది టీడీపీ పరిస్థితి. ఒకాయన మహిళలతో రాసలీలలు.. మరోకరు డ్రగ్స్‌తో దొరికిన ప్రభుత్వ పరంగా ఏలాంటి చర్యలు ఉండవు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హోమంత్రి అనిత ప్రకటించిన పది రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సొంత జిల్లాలో గంజాయి పట్టుబడింది...పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు.. తప్పుడు కేసులు కట్టడంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. టీడీపీ ఎంపీ డ్రగ్స్ కేసులో దొరికితే పార్టీ స్పందన ఏంటీ?. అంతకు ముందు కూటమి ఎమ్మెల్యేల బాగోతం.. తరువాత టీవీ 5 చైర్మన్ బాగోతం.. ఇప్పుడు ఏలూరు ఎంపీ బాగోతం చూస్తున్నాం’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు. -
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ.. పోలీసులపై ఒత్తిడి మొదలైందా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో భారీగా డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించారు. వీఐపీలతో పాటు ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. అయితే, పుట్టా మహేష్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్‌ను తప్పించడానికి పెద్ద తలకాయలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ‘‘హైదరాబాద్ పోలీసులపై అప్పడే ఒత్తిడి మొదలైందా?. పుట్టా మహేష్‌ను తప్పించడానికి రాజకీయ, ఆర్థిక బలాలు ఉపయోగిస్తున్నారా?. పుట్టా మహేష్‌ను కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారా?. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆరుగురిపై పోలీసుల నెక్ట్స్ ఎలా ఉండబోతుంది’’ అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ పాజిటివ్‌గా తేలిందని ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిన్న రాత్రి 7.30 సమయంలో మాకు సమాచారం అందింది. డ్రగ్స్ పార్టీ సమాచారం తెలుసుకునే అక్కడికి వెళ్లాం. 11మందికి టెస్టులు చేశాం.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. మేం లోపలికి వెళ్లేటప్పుడే గన్ ఫైర్ సౌండ్స్ వచ్చాయి. సిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు గుర్తించాం. ఎంపీ అయినా.. ఎమ్మెల్యే అయినా డ్రగ్స్ తీసుకుంటే చర్యలు తప్పవు’’ అని ఎస్పీ స్పష్టం చేశారు. -
టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్
సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్సీపీ నేత టీజేఆర్ సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్‌సభకు పంపారు. పార్లమెంట్లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్‌కు లేదు’’ అంటూ టీజేఆర్ మండిపడ్డారు.‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్‌ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు...తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్‌గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు...ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్ సంబంధం ఉంది. కాబట్టి రేవంత్‌తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్ సుధాకర్‌బాబు మండిపడ్డారు. -
ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ పాజిటివ్
సాక్షి,హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేసిన వీకెండ్ పార్టీలో డ్రగ్స్ లభ్యమయ్యాయి. ఈ వీకెండ్ పార్టీలో ఏపీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏలూరు టీడీపీ ఎంపీ మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగిల్) ఫోర్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అతని సోదరుడు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్ల నిర్ధారించారు. వారందరికి ప్రస్తుతం డ్రగ్స్ టెస్టులు జరుగుతున్నాయన్న పోలీసులు.. వాళ్లు తీసుకున్నది ఎలాంటి డ్రగ్స్ అనేది పూర్తిస్థాయిలో టెస్టులు ఫలితాల తరువాతే తెలుస్తాయని చెప్పారు. డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలుఅయితే మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యూరిన్ టెస్ట్ విషయంలో ఎంపీ పుట్టా మహేష్ నాటకం ఆడినట్లు తేలింది. యూరిన్ శాంపిల్ బదులు వాటర్ ఇచ్చారు. అనుమానం రావడంతో శాంపిల్ బాటిళ్లను టెస్టు చేయగా..శాంపిల్ బాటిల్లో ఉంది యూరిన్ కాదని నీళ్లని గుర్తించారు. దీంతో ఎంపీ పుట్టాపై పోలీసులు సీరియస్ అయ్యారు. టెస్టులు కోసం యూరిన్ శాంపిల్ ఇవ్వాలని.. నీళ్లు కాదని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. అనంతరం పుట్టా మహేష్ నుంచి యూరిన్ సేకరించి టెస్టులు చేశారు. ఆ టెస్టుల్లో ఎంపీ పుట్టా మహేష్ బ్లడ్ టెస్టులో పాజిటీవ్‌గా నిర్ధారణైంది.డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్..డగ్స్ పార్టీపై ఈగల్ ఎస్పీ గిరిధర్ మీడియాతో మాట్లాడారు. శనివారం అర్ధరాత్రి 3గంటల నుంచి ఫాం హౌస్‌లో పార్టీ జరుగుతోంది. రాత్రి 7.30 సమయంలో ఎంపీ పుట్టా మహేష్ ఫాం హౌస్‌కు వచ్చారు. సోదాల సమయంలో కాల్పులు జరిపారు. గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం.డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 11మందిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించాం’అని పేర్కొన్నారు.


