పుట్టపర్తి రైల్వే స్టేషన్లో గంజాయి స్వాధీనం
అనంతపురం: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి రైల్వే స్టేషన్లో 25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేసి పట్టుకున్నారు. ఓ వ్యక్తి సహా నలుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.