పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్హైవే మూసివేత
హైదరాబాద్ : పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవేను గురు, శుక్రవారాల్లో కొన్ని గంటలపాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైవేపై సెంట్రల్ లైన్ రోడ్డు మార్కింగ్, రెయిలింగ్తోపాటు క్రాష్ బారియర్లకు రంగులు వేసే పనులు చేపడుతున్న కారణంగా 9, 10వ తేదీల్లో రాత్రి 11 గంటల నుంచి మరునాడు ఉదయం 5 గంటల వరకు ఎక్స్ప్రెస్ హైవేపై రాకపోకలను రద్దు చేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని వాహనదారులు గమనించి, సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు.