నేడు జేడీతో 'ఫోన్ ఇన్'
అనంతపురం అగ్రికల్చర్: వేరుశనగ, కంది, ఆముదం, పత్తి, పెసర ఖరీఫ్ పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణకు పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు, అలాగే ప్రత్యామ్నాయ పంటల సాగు ఏవైనా సమస్యలుంటే గురువారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య 08554–246847 నెంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు పొందాలని వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి రైతులకు సూచించారు.
ఫోన్‌ఇన్ కార్యక్రమం ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల వాడకం, భూసార పరీక్షల ఫలితాల పత్రాలు, వర్షాల స్థితిగతులు, పంటలకు వ్యాపించిన తెగుళ్లు, నివారణ పద్ధతుల గురించి సరైన సలహాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి గురువారం రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.