పీవీసీ ఓటరు గుర్తింపు కార్డులు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఇకపై ఓటర్లందరికీ పాలీ వినైల్ క్లోరైడ్(పీవీసీ) ఓటరు గు ర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. జనవరి 31న ఓటర్ల తు ది జాబితా ప్రకటిం చిన అనంతరం దా ని ఆధారంగా జిల్లాలో ఉన్న ఓటర్లకు ఈ కార్డులు జారీ చేయాలని అధికారులు నిర్ణరుుంచారు. ఫిబ్రవరి ఆఖరు నుంచి పీవీసీ కార్డుల జారీ ప్రక్రియ జిల్లాలో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
ప్రస్తుతం పాన్‌కార్డు, ఏటీఎం కార్డు, డ్రైవింగ్ లెసెన్స్‌లు పీవీసీతో తయారు చేసినవే వస్తున్నాయి. ఓటరు గుర్తింపుకార్డు మాత్రం కాగితంపై ప్రింట్‌తీసి లామినేషన్ చేయించేవారు. ఇది కొద్దిరోజులకే పాడవుతున్నందున పీవీసీ కార్డులు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం తొలిసారి ఓటర్లందరికీ పీవీసీ కార్డును ఉచితంగా ఇస్తారు. తరువాత కార్డులు రెండవసారి పొందాలంటే ఎంత ధర అన్న విషయం ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
కార్డుపై సూచనలు..
ప్రస్తుతం జారీ చేయనున్న పీవీసీ కార్డుల వెనుక వైపు ఎన్నికల సంఘం రెండు సూచలను చేస్తోంది. దీంట్లో ఒకటి ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన జాబితాలో మీపేరున్నట్లు కాదు. ఎన్నికల ముందు జాబితాలో పేరు ఉందో.. లేదో సరిచూసుకోవాల్సిన బాధ్యత ఓటరుదేనని, కార్డుపై ఉన్న జన్మదిన తేదీ, వయస్సును ఇతర అవసరాల కోసం రుజువుగా చూపెట్టడానికి ప్రమాణికంగా పరిగణించడం కుదరదని స్పష్టంచేశారు. ఈ నిబంధనల వల్ల చిరునామా గుర్తింపునకు, వ్యక్తి గుర్తింపునకు.. ఓటరు గుర్తింపుకార్డును ప్రమాణికంగా తీసుకున్నవారు ఇకపై తిరస్కరించే అవకాశాలు ఉంటాయని ఓటర్లు అంటున్నారు.