నిరాశపర్చిన టాటాపవర్
ముంబై: ముంబైకి చెందిన ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ మంగళవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభాల్లో 76 శాతం, ఆదాయంలో 5శాతం క్షీణతను నమోదు చేసింది. ఇది గత ఏడాది రూ.303కోట్ల తోపోలిస్తే నికర లాభాలో భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 72.5 కోట్లను ప్రకటించింది. ఆదాయం కూడా రూ. 7184 కోట్ల నుంచి రూ. 6838 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1636 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 54 శాతం తగ్గి రూ.112 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 312 కోట్లమేర వన్‌టైమ్ నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది.
ఈ నిరుత్సాహకర ఫలితాలతో టాటా పర్ షేరు దాదాపు 3శాతానికిపైగా క్షీణించింది. అయితే నికర లాభాలు రూ.335 కోట్లు, ఆదాయాన్ని రూ.9,270కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేశారు