Quality Council of India
-
ఫార్మా సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టాలి
ముంబై: అంతర్జాతీయంగా ఫార్మా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లే విషయంలో నియంత్రలే పెద్ద అడ్డంకిగా ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ పేర్కొన్నారు. దీంతో దేశీ ఫార్మా సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎనిమిదో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ నాణ్యతా సదస్సును ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయంగా ఫార్మా పరిశ్రమ అధిక నియంత్రణల మధ్య ఉంది. మార్కెట్ ప్రవేశానికి నియంత్రణలే పెద్ద అడ్డంకి. భారత తయారీ రంగంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని రకాల శ్రేణుల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఈ రంగంలో భారత్లో ఎన్నో చిన్న, మధ్యస్థాయి సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా జనరిక్ మార్కెట్ మనది. మారుతున్న వ్యాధులకు అనుగుణంగా ఆవిష్కరణలపైనా దృష్టిపెట్టాలి’’అని అపర్ణ సూచించారు. భారత ఫార్మా సంస్థలకు గణనీయమైన సామర్థ్యం, నాణ్యత, వ్యయపరమైన అనుకూలతలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటున్నాయన్నారు. -
2047 నాటికి సంపన్న దేశంగా భారత్,‘బ్రాండ్ ఇండియా’నే లక్క్ష్యంగా
న్యూఢిల్లీ: అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదిగేలా ’బ్రాండ్ ఇండియా’ను నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వివిధ నియంత్రణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, మరింత మంది మహిళలు చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్ను ఎంచుకోవాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ సూచించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడేలా భారతీయ సీఏ సంస్థలను తీర్చిదిద్దేందుకు ఐసీఏఐ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. -
ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చేతిలో మోసపోయిన ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. ఫ్లిప్ కార్ట్ ఎప్పుడు ఉద్యోగాల్లో చేర్పించుకుంటుందో అని కాలం వెల్లబుచ్చుకోకుండా ఐఐటీ గ్రాడ్యుయేట్లు మధ్యంతర కాలంగా తమ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావచ్చని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) పేర్కొంది. వారికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని క్యూసీఐ చెప్పింది. ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఆరు నెలల నుంచి ఏడాది వరకు తమతో కలిసి పనిచేయొచ్చని క్యూసీఐ చైర్మన్ ఆదిల్ జైనుల్ భాయ్ తెలిపారు. ఐఐఎమ్, ఐఐటీల ప్రాంగణ నియామకాల్లో సెలక్ట్ చేసుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్లకు, ఫ్లిప్ కార్ట్ జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో పునర్వ్ వ్యవస్థీకరణ నేపథ్యంలోనే జాయినింగ్ తేదీలు ఇవ్వలేకపోతున్నామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. క్యూసీఐ అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కింద పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రతి ఏడాది చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్లను ఇంటర్న్ లుగా తీసుకుని, విశ్లేషణ, పరిశోధన, ఫీల్డ్ వర్క్ ల్లో జాబ్స్ కల్పిస్తుంటోంది. ఇటీవలే పారిశుద్ధ్యం, ఆహార పరిస్థితుల గురించి పరిశీలించడానికి 'స్వచ్చ్ సుర్వేక్షణ' ప్రొగ్రామ్ ను 73 నగరాల్లో క్యూసీఐ చేపట్టింది. గ్రాడ్యుయేట్లు ఆశించిన రీతిలో తాము వేతనాలు చెల్లించలేకపోయిన, దేశానికి అర్ధవంతమైన సహకారం అందించాలనుకున్న వారికి క్యూసీఐ ఆహ్వానం పలుకుతుందని జైనుల్ భాయ్ తెలిపారు. క్యూసీఐలో చేరిన గ్రాడ్యుయేట్లు స్వచ్చ్ భారత్, స్వచ్చ్ సుర్వేక్షణ వంటి పబ్లిక్ ప్రాజెక్టులో తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్యూసీఐ చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ఐఐఎమ్స్, ఐఐటీల నుంచి కొంతమంది యువతను సెలక్ట్ చేసుకుంటుంటారు. 40 నుంచి 50 మంది గ్రాడ్యుయేట్లకు వారి ప్రాజెక్టుల కోసం పనిచేయడానికి అవకాశం ఇస్తుంటారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను క్యూసీఐ చేపడుతుంటోంది.