ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు | Quality Council of India Offers Jobs To IIM-A, IITians On Flipkart's Refusal | Sakshi
Sakshi News home page

ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు

Published Sat, Jun 11 2016 11:32 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు - Sakshi

ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు

న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చేతిలో మోసపోయిన ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త.  ఫ్లిప్ కార్ట్ ఎప్పుడు ఉద్యోగాల్లో చేర్పించుకుంటుందో అని కాలం వెల్లబుచ్చుకోకుండా ఐఐటీ గ్రాడ్యుయేట్లు మధ్యంతర కాలంగా తమ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావచ్చని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) పేర్కొంది. వారికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని క్యూసీఐ చెప్పింది.

ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఆరు నెలల నుంచి ఏడాది వరకు తమతో కలిసి పనిచేయొచ్చని క్యూసీఐ చైర్మన్ ఆదిల్ జైనుల్ భాయ్ తెలిపారు. ఐఐఎమ్, ఐఐటీల ప్రాంగణ నియామకాల్లో సెలక్ట్ చేసుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్లకు, ఫ్లిప్ కార్ట్ జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో పునర్వ్ వ్యవస్థీకరణ నేపథ్యంలోనే జాయినింగ్ తేదీలు ఇవ్వలేకపోతున్నామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.

క్యూసీఐ అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కింద పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రతి ఏడాది చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్లను ఇంటర్న్ లుగా తీసుకుని, విశ్లేషణ, పరిశోధన, ఫీల్డ్ వర్క్ ల్లో జాబ్స్ కల్పిస్తుంటోంది. ఇటీవలే పారిశుద్ధ్యం, ఆహార పరిస్థితుల గురించి పరిశీలించడానికి 'స్వచ్చ్ సుర్వేక్షణ' ప్రొగ్రామ్ ను 73 నగరాల్లో క్యూసీఐ చేపట్టింది.

గ్రాడ్యుయేట్లు ఆశించిన రీతిలో తాము వేతనాలు చెల్లించలేకపోయిన, దేశానికి అర్ధవంతమైన సహకారం అందించాలనుకున్న వారికి క్యూసీఐ ఆహ్వానం పలుకుతుందని జైనుల్ భాయ్ తెలిపారు. క్యూసీఐలో చేరిన గ్రాడ్యుయేట్లు స్వచ్చ్ భారత్, స్వచ్చ్ సుర్వేక్షణ వంటి పబ్లిక్ ప్రాజెక్టులో తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్యూసీఐ చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ఐఐఎమ్స్, ఐఐటీల నుంచి కొంతమంది యువతను సెలక్ట్ చేసుకుంటుంటారు.  40 నుంచి 50 మంది గ్రాడ్యుయేట్లకు వారి ప్రాజెక్టుల కోసం పనిచేయడానికి అవకాశం ఇస్తుంటారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను క్యూసీఐ చేపడుతుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement