IITians
-
లక్షలు కాదు.. లైఫ్ ఉండాలె
సాక్షి, హైదరాబాద్: ఐఐటీయన్లు సరికొత్త పంథాను ఎంచుకుంటున్నారు. దేశంలోని పేరొందిన సాంకేతిక విద్యాసంస్థల నుంచి ఉన్నత చదువులు చదివిన ఎంతో మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ సంస్థల్లో, బహుళ జాతి కంపెనీల్లో ఆఫర్లను వదులుకొని అధ్యాపక వృత్తిని ఎంపిక చేసుకుంటున్నారు. ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటీలో చదువుకున్న వారికి క్యాంపస్‌లోనే అద్భుత ప్యాకేజీలతో దేశ విదేశాల ఆఫర్లు వస్తాయి. అయితే ఈ ప్యాకేజీలు, ఆఫర్లు వారికి సంతృప్తినివ్వడం లేదు. రూ.లక్షల్లో జీతం వస్తున్నా తమ అభిరుచికి అనుగుణంగా టీచింగ్ ప్రొఫెషన్లోకి ప్రవేశిస్తున్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఇప్పుడు ఐఐటీ కోచింగ్ సెంటర్లకు హబ్‌గా మారింది. అశోక్‌నగర్, ఇందిరాపార్కు సివిల్స్ కోచింగ్ అడ్డా కాగా.. విద్యానగర్, నల్లకుంట ప్రాంతాలు ఐఐటీ కోచింగ్‌కు కేంద్రంగా మారాయి. ఐఐటీ కోచింగ్‌లో రాజస్థాన్‌లోని కోట తరువాత హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఐఐటీ ఇప్పుడు అన్ని వర్గాల్లో ఒక క్రేజ్‌గా మారింది. పది, ఇంటర్ నుంచే ఐఐటీ కోసం శిక్షణ ఇప్పిస్తున్నారు. ఆడుతూ, పాడుతూ ఐఐటీ శిక్షణ పొందాలనే లక్ష్యంతో శిక్షణనిస్తున్నారు కొందరు ఐఐటీయన్లు. అధ్యాపకుల్లా కాకుండా స్నేహితుల్లా పాఠాలు బోధిస్తున్నారు. 24 గంటల పాటు చదువే కాదు.. సినిమాలు, షికార్లు, సరదా కబుర్లు కూడా జీవితంలో భాగం కావాలని వీరు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా శిక్షణలో వైవిధ్యం, వినూత్నం కనబరుస్తూ బోధన చేస్తున్నారు. నగరానికి చెందిన భరత్ ఖరగ్‌పూర్ ఐఐటీలో 2010లో ఎంటెక్ పూర్తి చేశారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ను వదులుకొని టీచింగ్ ప్రొఫెషన్‌ను ఎంపిక చేసుకున్నారు. బహుళ జాతి సాఫ్ట్వేర్ సంస్థల్లో పని చేస్తే బోలెడంత జీతం ఇస్తారు. కానీ ఎలాంటి సంతృప్తి ఉండదు. జీవితం చాలా యాంత్రికంగా గడిచిపోతుంది. అలా రొటీన్‌గా గడపడం నాకు ఇష్టం లేదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని, కొత్త విషయాలను బోధించడం వల్ల ఇప్పుడు టీచర్‌గా ఎంతో సంతోషంగా ఉన్నా. ఒక సాఫ్ట్వేర్ నిపుణుడితో పోల్చుకుంటే నా జీతం చాలా తక్కువే. కానీ ఈ జాబ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. – భరత్ జస్వంత్ది వైజాగ్. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. నగరంలోని ఒక కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ బోధిస్తున్నారు. ఒక టీచర్‌గా పాఠం చెప్పి వెళ్లడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. వాళ్లలో ఒక స్టూడెంట్‌గా కలిసిపోయి చర్చించడం వల్ల బోధన సృజనాత్మకంగా ఉండటమే కాకుండా ఆ చర్చలో ప్రతి స్టూడెంట్ భాగస్వామి అవుతాడు. లక్ష్యాన్ని నిర్దేశించుకుంటాడు. క్యాంపస్ ప్లేస్మెంట్ కాదనుకొని ఈ వృత్తికి వచ్చా. ఇది నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. – జస్వంత్ విక్రమ్ దాచేపల్లిది సూర్యాపేట జిల్లాలోని లింగాల గ్రామం. వెల్లూరు వీఐటీలో చేరి 2010లో బీటెక్ పూర్తి చేశారు. ఆ మరుసటి సంవత్సరమే ఒక బహుళ జాతి సంస్థలో ఉద్యోగం లభించింది. నెలకు రూ.1.5 లక్షల జీతం. అయితే విక్రమ్‌కు ఆ ఉద్యోగం సంతృప్తినివ్వలేదు. ఒక సాఫ్ట్వేర్ సంస్థలో నాలుగు గోడల మధ్య పని చేయడం నచ్చలేదు, నాకు మొదటి నుంచి టీచింగ్ అంటే ఎంతో ఇష్టం. పైగా ఐఐటీ కోచింగ్‌లో తీవ్రమైన ఒత్తిడికి భిన్నంగా సృజనాత్మకమైన పద్ధతిలో శిక్షణనిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అనిపించింది. అందుకే 2012లో ఐఐటీ అకాడమీని ఏర్పాటు చేశాం. – విక్రమ్ -
విలాసవంతమైన ఉద్యోగాలను వదిలి మరీ..
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీల్లో చదివి, ఆరంకెల జీతం అందుకుంటూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినా వారికి అవి తృణప్రాయంగా తోచాయి. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వారు ఖరీదైన ఉద్యోగాలను వదిలివేసి బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరిట రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 50 మంది ఐఐటియన్లు వైట్‌కాలర్ ఉద్యోగాలను వదిలి రాజకీయ వేదికగా ఏర్పాటు చేసిన బీఏపీ ప్రస్తుతం ఈసీ అనుమతి కోసం వేచిచూస్తోంది. సమాజంలో అట్టడుగు వర్గంగా అణిచివేయబడ్డ దళితుల ప్రయోజనాలను కాపాడేందుకే తమ పార్టీ ఉనికిలోకి వచ్చిందని బీఏపీ నేతలు చెబుతున్నారు. బ్రాహ్మణులను ఆర్థిక బహిష్కరణకు గురిచేయాలని ఓ బీఏపీ నేత పిలుపు ఇవ్వడం చర్చకు తావిచ్చింది. ఇక బీఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోదని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఐఐటియన్లు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం, ఆయా పార్టీల్లో కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గోవా సీఎం మనోహర్ పరికర్ వంటి నేతలు ఐఐటీల్లో చదివినవారే. -
ఫ్లిప్ కార్ట్ బాధిత ఐఐటీలకు ఉద్యోగాలు
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ చేతిలో మోసపోయిన ఐఐఎమ్ అహ్మదాబాద్, ఐఐటీ గ్రాడ్యుయేట్లకు శుభవార్త. ఫ్లిప్ కార్ట్ ఎప్పుడు ఉద్యోగాల్లో చేర్పించుకుంటుందో అని కాలం వెల్లబుచ్చుకోకుండా ఐఐటీ గ్రాడ్యుయేట్లు మధ్యంతర కాలంగా తమ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావచ్చని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(క్యూసీఐ) పేర్కొంది. వారికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని క్యూసీఐ చెప్పింది. ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఆరు నెలల నుంచి ఏడాది వరకు తమతో కలిసి పనిచేయొచ్చని క్యూసీఐ చైర్మన్ ఆదిల్ జైనుల్ భాయ్ తెలిపారు. ఐఐఎమ్, ఐఐటీల ప్రాంగణ నియామకాల్లో సెలక్ట్ చేసుకున్న ఐఐటీ గ్రాడ్యుయేట్లకు, ఫ్లిప్ కార్ట్ జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీలో పునర్వ్ వ్యవస్థీకరణ నేపథ్యంలోనే జాయినింగ్ తేదీలు ఇవ్వలేకపోతున్నామని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. క్యూసీఐ అనేది డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) కింద పనిచేసే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రతి ఏడాది చాలామంది యంగ్ గ్రాడ్యుయేట్లను ఇంటర్న్ లుగా తీసుకుని, విశ్లేషణ, పరిశోధన, ఫీల్డ్ వర్క్ ల్లో జాబ్స్ కల్పిస్తుంటోంది. ఇటీవలే పారిశుద్ధ్యం, ఆహార పరిస్థితుల గురించి పరిశీలించడానికి 'స్వచ్చ్ సుర్వేక్షణ' ప్రొగ్రామ్ ను 73 నగరాల్లో క్యూసీఐ చేపట్టింది. గ్రాడ్యుయేట్లు ఆశించిన రీతిలో తాము వేతనాలు చెల్లించలేకపోయిన, దేశానికి అర్ధవంతమైన సహకారం అందించాలనుకున్న వారికి క్యూసీఐ ఆహ్వానం పలుకుతుందని జైనుల్ భాయ్ తెలిపారు. క్యూసీఐలో చేరిన గ్రాడ్యుయేట్లు స్వచ్చ్ భారత్, స్వచ్చ్ సుర్వేక్షణ వంటి పబ్లిక్ ప్రాజెక్టులో తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్యూసీఐ చేపట్టే వివిధ ప్రాజెక్టుల కోసం ఐఐఎమ్స్, ఐఐటీల నుంచి కొంతమంది యువతను సెలక్ట్ చేసుకుంటుంటారు. 40 నుంచి 50 మంది గ్రాడ్యుయేట్లకు వారి ప్రాజెక్టుల కోసం పనిచేయడానికి అవకాశం ఇస్తుంటారు. అన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ప్రాజెక్టులను క్యూసీఐ చేపడుతుంటోంది. -
లాలూ కుమార్తె ప్రచారానికి ఐఐటీ ప్రోఫెషనల్స్ సపోర్ట్!
పాట్నా: ఓటర్లను ఆకట్టుకునేందుకు సాగించే ఎన్నికల్లో ప్రచారానికి పలు రకాలైన పద్దతులను రాజకీయ నాయకులు చేపడుతారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తే మిసా భారతి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తన ఎన్నికల ప్రచారానికి ఐఐటీ నిపుణులు, వైద్యులను మీసా భారతీ ఉపయోగించుకుంటున్నారు. ఈ ప్రచారానికి మీసా భారదీ భర్త శైలేష్ కుమార్ అండదండలు అందిస్తున్నారు. డాక్టర్ గా సేవలందిస్తున్న మీసా పాటలీ పుత్ర నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. తన ప్రచార మేనేజ్ మెంట్ కు ఇద్దరు ఐఐటీ ప్రొఫెషనల్స్ పంకజ్ సూడన్, పెర్ వీన్ త్యాగిలను నియమించారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ వర్గాలను కలిసేందుకు, వారితో వ్యవహరించేందుకు తగిన సలహాలను, సూచనలను అందిస్తున్నారు. సూడన్ గుర్గావ్ లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, త్యాగి స్వంతంగా ఓ ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. వారు రూపొందించిన ఫేస్ బుక్ పేజ్ కు పాట్నా ప్రజల నుంచి ఆమోఘ స్పందన రావడంతో మీసా ఆనందంతో తబ్బిబ్బువుతున్నారు.