రాజకీయ పార్టీ కోసం ఉద్యోగాలు విడిచిపెట్టిన ఐఐటియన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఐఐటీల్లో చదివి, ఆరంకెల జీతం అందుకుంటూ సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడించినా వారికి అవి తృణప్రాయంగా తోచాయి. ఎస్‌సీ, ఎస్‌టీలు, ఇతర వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం వారు ఖరీదైన ఉద్యోగాలను వదిలివేసి బహుజన్ ఆజాద్ పార్టీ (బీఏపీ) పేరిట రాజకీయ వేదికను ఏర్పాటు చేశారు. దాదాపు 50 మంది ఐఐటియన్లు వైట్‌కాలర్ ఉద్యోగాలను వదిలి రాజకీయ వేదికగా ఏర్పాటు చేసిన బీఏపీ ప్రస్తుతం ఈసీ అనుమతి కోసం వేచిచూస్తోంది.
సమాజంలో అట్టడుగు వర్గంగా అణిచివేయబడ్డ దళితుల ప్రయోజనాలను కాపాడేందుకే తమ పార్టీ ఉనికిలోకి వచ్చిందని బీఏపీ నేతలు చెబుతున్నారు. బ్రాహ్మణులను ఆర్థిక బహిష్కరణకు గురిచేయాలని ఓ బీఏపీ నేత పిలుపు ఇవ్వడం చర్చకు తావిచ్చింది. ఇక బీఏపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోదని, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడుతుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, ఐఐటియన్లు రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం, ఆయా పార్టీల్లో కీలక పాత్ర పోషించడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, గోవా సీఎం మనోహర్ పరికర్ వంటి నేతలు ఐఐటీల్లో చదివినవారే.
Comments
Please login to add a commentAdd a comment