Quality drugs
-
జనఔషధితో రూ.వెయ్యి కోట్లు ఆదా!
న్యూఢిల్లీ/లక్నో: కేంద్రం ప్రవేశపెట్టిన జన ఔషధి పథకం ద్వారా సామాన్య ప్రజలకు దాదాపు రూ.వెయ్యికోట్లు ఆదా అయినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ పథకం కింద నాణ్యమైన మందులు సరసమైన ధరలకే సామాన్యులకు అందజేస్తున్నట్లు చెప్పారు. 850 రకాల అత్యవసర మందుల ధరలను నియంత్రించామని, గుండె శస్త్రచికిత్సకు సంబంధించిన స్టెంట్లు, మోకాలు సర్జరీ పరికరాల ధరలు తగ్గించామని తెలిపారు. దేశవ్యాప్తంగా తాము ఏర్పాటు చేసిన జన ఔషధి కేంద్రాల ద్వారా పేద ప్రజలే కాకుండా మధ్యతరగతి వారు కూడా లబ్ధి పొందారన్నారు. ఎలాంటి ప్రకటనలు చేయకుండానే కేవలం జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలు రూ.వెయ్యి కోట్లు ఆదా చేసుకున్నారని, ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పథకం లబ్ధిదారులు, మందుల దుకాణాల యజమానులతో గురువారం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మార్కెట్ ధరలతో పోలిస్తే జన ఔషధి కేంద్రాల్లో మందులు దాదాపు 50 నుంచి 90 శాతం తక్కువకే దొరుకుతున్నాయని పేర్కొన్నారు.. మోదీని ప్రధాని చేసిన కుర్చీ లక్నో: మోదీ కాన్పూర్ పర్యటన నేపథ్యంలో స్థానిక బీజేపీ శాఖ ఓ ‘అదృష్ట కుర్చీ’ని ముస్తాబు చేసింది. ఈ చెక్క కుర్చీని పవిత్రమైనదిగా కాన్పూర్ బీజేపీ కార్యకర్తలు భావిస్తుంటారు. మోదీ మళ్లీ ప్రధాని అయ్యేందుకు ఆ కుర్చీ దోహదం చేస్తుందని నమ్ముతున్నారు. శుక్రవారం మోదీ కాన్పూర్ పర్యటనలో ‘అదృష్ట కుర్చీ’పై కూర్చోవాల్సిందిగా కోరుతూ స్థానిక బీజేపీ కార్యకర్తలు ప్రధానికి లేఖ రాశారు. 2014 లోక్‌సభ ఎన్నికలు, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాన్పూర్ వచ్చినప్పుడు మోదీ ఈ కుర్చీలో కూర్చోవడంతోనే ఆ రెండు ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించిందని కాన్పూర్ బీజేపీ అధ్యక్షుడు సురేంద్ర మైథనీ వివరించారు. తొలుత మోదీ 2013 అక్టోబర్ 19న ఈ కుర్చీని మోదీ వినియోగించారు. -
చౌక ధరల్లో ఔషధాలు అందించాలి..
రసాయనాల శాఖ మంత్రి అనంత కుమార్ న్యూఢిల్లీ: ప్రజలకు నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరల్లో అందించాలని భారత ఫార్మా కంపెనీలకు రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి అనంత కుమార్ సూచించారు. ఫార్మా రంగంలో విధానాలను, నిబంధనాలను మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడి రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. బల్క్‌డ్రగ్‌ల దిగుమతులపై చైనాపై అధికంగా ఆధారపడుతున్నామని, ప్రభుత్వం దీనికి పరిష్కారం అన్వేషిస్తుందని పేర్కొన్నారు. దేశీయంగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తిని చేపట్టే చర్యలు తీసుకోవాలన్నారు. కాగా బల్క్‌డ్రగ్‌ల ఉత్పత్తికి అనువైన వాతావరణాన్ని భారత్ సృష్టించుకోవలసిన అవసరం ఉందని ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీ వి.కె. సుబ్బురాజ్ చెప్పారు.ఆర్ఐఎస్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. మన దేశంలో ఫార్మా రంగం మంచి వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. కానీ బల్క్‌డ్రగ్స్, మెడికల్ పరికరాల కోసం దిగుమతులపైననే అధికంగా ఆధారపడుతున్నామని చెప్పారు. బల్క్‌డ్రగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ సెంటర్‌గా హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) కార్యకలాపాలు నిర్వహిస్తోందని వివరించారు. -
మందులోడా.. ఓరి మాయలోడా!
ప్రజలకు నాసిరకం మందులు అందిస్తున్న ఏపీఎంఎస్ఐడీసీ ఏడాదిలో నాసిరకం అని తేల్చిన మందులు 23 రకాలు ఆర్టీఐ దరఖాస్తుతో అవినీతి బట్టబయలు హైదరాబాద్: రోగులకు నాణ్యమైన మందులను సరఫరా చేయాల్సిన సర్కారే నాసిరకం మందులు మింగిస్తూ వారి ప్రాణాలతో ఆడుకుంటోంది. మందుల సరఫరాదార్లతో కుమ్మక్కైన అధికారులు నాసిరకం మందులను ఇష్టారాజ్యంగా ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నారు. అవి నాసిరకమని పరీక్షల్లో తేలినా వెనక్కు తెప్పించలేదు, ఒక్క కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదు. పైగా ఆ మందులు మంచివని డ్రగ్ ఇన్స్పెక్టర్లతో సర్టిఫికెట్లు ఇప్పించి మరీ ప్రజలతో మింగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీ) సీలో జరిగిన ఈ భారీ అవినీతి ‘సాక్షి ప్రతినిధి’ సమాచారం హక్కు చట్టం (ఆర్టీఐ)ద్వారా సేకరించిన సమాచారంతో బట్టబయలైంది. ఏపీఎంఎస్ఐడీసీ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 2014లో సరఫరా చేసిన మందుల్లో 23 రకాల మందులు నాసిరకం అని తేలాయి. ఇందులో రోజూ లక్షలాది మంది బీపీకి వాడే అటెన్‌లాల్ ఐపీ 50 ఎంజీ, కడుపునొప్పి నియంత్రణకు వాడే డైసైక్లోమైన్ 10 ఎంజీ తదితర మందులను ఎలాంటి పరీక్షలు లేకుండానే జనంలోకి పంపుతున్నారు. ఇవి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, తూర్పు గోదావరి, మెదక్ జిల్లాల్లో ఎక్కువ వినియోగమైనట్టు తేలింది. అవినీతి బట్టబయలు సమాచార హక్కు చట్టం ద్వారా కొన్ని వివరాలు సేకరించగా, అధికారులు, కాంట్రాక్టర్ల బండారం బయటపడింది. ఇలాంటివి కొన్ని పరిశీలిస్తే.... ►రక్తపోటు నియంత్రణకు ఉపయోగించే అటెన్‌లాల్ 50 ఎంజీ ట్యాబ్లెట్ (గ్రీన్‌ల్యాండ్ ఆర్గానిక్స్) బీటీహెచ్ అనే లేబరేటరీకి పరీక్షలకు పంపిస్తే 2013 ఫిబ్రవరి 4న నాసిరకం అని తేలింది. అయితే అదేనెల 18వ తేదీన ఓ డ్రగ్ ఇన్స్పెక్టర్తో నాణ్యమైనవని చెప్పించుకుని మందుల సరఫరా కొనసాగించారు. ► కడుపునొప్పి నియంత్రణకు ఉపయోగించే డైసైక్లోమైన్ 10 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పంపించగా 2013 జులై 15న నాసిరకం అని తేలింది. ఆ తర్వాత దీన్ని కోల్‌కతాలోని సీడీఎల్‌కు లేబరేటరీకి పంపించి మంచివని తేల్చారు. ►మానసిక రోగులకు ఇచ్చే కార్బమొజెపైన్100 ఎంజీ మాత్రలు డీసీఎల్ లేబరేటరీకి పరిశీలనకు పంపిస్తే 2013 జులై 25న నాసికరం అని తేల్చా రు. కానీ ఈ కంపెనీని ఎందుకు బ్లాక్‌లిస్టులో పెట్టలేదని ఆర్టీఐ కింద అడిగితే.. 14 నెలలుగా ఫైలు సర్క్యులేషన్లో ఉందని సమాధానమిచ్చారు. ► పెయిన్ కిల్లర్‌గా వాడే డైక్లొఫినాక్ సోడియం 50 ఎంజీ మాత్రలు నాసిరకమని 2013జులై 25న డీసీఎల్ లేబరేటరీ తేల్చింది. ఈ కంపెనీని కూడా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టే విషయంలో 14 నెలలుగా ఫైలు ప్రాసెస్‌లో ఉందని చెబుతున్నారు. ►పైన పేర్కొన్న అన్ని మాత్రలు నాసిరకం అని తేలాక కూడా ఆ బ్యాచ్‌లకు సంబంధించిన ఒక్క మాత్రను వెనక్కు తెప్పించకపోగా, అన్నిటినీ రోగులకు ఇచ్చారు.