నిర్మాణంలో నాణ్యతనిర్వహణలో నిశ్చింత!
‘‘ప్రాజెక్ట్‌ను నిర్మించి.. విక్రరుుంచడంతోనే నిర్మాణ సంస్థ పనైపోరుునట్టు కాదు. సంబంధిత ప్రాజెక్ట్‌లోని ఫ్లాట్ మళ్లీ అమ్మకానికి పెట్టినా నేడక్కడ కొత్తగా నిర్మించే ఫ్లాట్ ధరతో పోటీ పడేలా ఉండాలి. అద్దె విలువలోనూ ఏమాత్రం తగ్గొద్దు’’
... స్థిరాస్తి కొనుగోలుదారులెవరైనా కోరుకునేదిదే. మరీ, కస్టమర్ల కోరిక తీరాలంటే నిర్మాణంలో నాణ్యత.. నిర్వహణ సరిగ్గా ఉంటేనే సాధ్యమవుతుంది! సరిగ్గా ఇవే మా ప్రాజెక్ట్‌ల ప్రత్యేకత అంటోంది ప్రణీత్ గ్రూప్. ఏడాదిలో ఆంటిలియా ప్రాజెక్ట్‌లో ప్రాపర్టీ విలువ 25 శాతం పెరగడమే ఇందుకు ఉదాహరణగా చెబుతోంది. కస్టమర్ల పెట్టుబడికి రెండింతల లాభాన్ని చూపించాలనేది మా లక్ష్యమంటోంది!!
సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత.. గడువులోగా ఫ్లాట్ల అప్పగింత.. అందుబాటు ధరల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు.. ఇదీ క్లుప్లంగా చెప్పాలంటే ప్రణీత్ గ్రూప్ విజయ రహస్యం! అందుకే ఎనిమిదేళ్లలో బాచుపల్లి, మల్లంపేట, బీరంగూడలో 14 ప్రాజెక్ట్‌ల్లో.. 2,000లకు పైగా కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయగలిగామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు చెప్పారు. ఇప్పుడిదే లక్ష్యంతో తొలిసారిగా బాచుపల్లిలో 3.5 ఎకరాల్లో జెనిత్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టాం. ఆదివారం ప్రారంభించనున్న ప్రాజెక్ట్ వివరాలివే..
⇔ ఇప్పటివరకు బాచుపల్లి ప్రాంతంలో 6 విల్లాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. వీటిలో దాదాపు 500లకు పైగా కుటుంబాలు ఆనంద జీవనం గడుపుతున్నారు. అరుుతే విల్లాలో పొందే సౌకర్యాలు అపార్ట్మెంట్లోనూ అందించాలనే లక్ష్యంతో.. అది కూడా తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో జెనిత్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం.
⇔ 3.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో 5 టవర్లుంటారుు. ప్రతి టవర్‌లో ఐదంతస్తులుంటారుు. మొత్తం 275 ఫ్లాట్లొస్తారుు. 2 బీహెచ్‌కే 165, మిగిలినవి 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటారుు. 830-1,400 చ.అ.ల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలుంటారుు. ధర చ.అ.కు రూ.2,900. డిసెంబర్ ముగింపు నాటికి చ.అ.కు రూ.150 తగ్గింపు ఉంటుంది.
⇔ 8,500 చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, ల్యాండ్ స్కేపింగ్, పైప్ గ్యాస్ లైన్, పవర్ బ్యాకప్ వంటి అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నాం. 18 నెలల నుంచి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ఇప్పటికే 60 ఫ్లాట్లు అమ్ముడుపోయారుు కూడా.
⇔ బాచుపల్లిలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ఆంటిలియా విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 120-300 గజాల విస్తీర్ణాలుంటే మొత్తం 600 డూప్లె, ట్రిప్లెక్స్ విల్లాలుంటారుు. ధర రూ.60 లక్షల నుంచి ప్రారంభం. 80 శాతం విక్రయాలు పూర్తయ్యారుు. డిసెంబర్ ముగింపు నుంచి 100 విల్లాలను కస్టమర్లకు అందిస్తాం. 2017 ముగింపు నాటికి ప్రాజెక్ట్ మొత్తాన్ని పూర్తి చేస్తాం.
ఇక్కడే ఎందుకు కొనాలంటే..
సొంతిల్లు కొనేముందు ఎవరైనా సరే చూసేది.. స్కూలు, ఆసుపత్రి, షాపింగ్ మాల్, ఆఫీసుకు దగ్గరుందా అని! అరుుతే ఈ విషయంలో మాత్రం బాచుపల్లి ముందుందనే చెప్పాలి. ఎందుకంటే బాచుపల్లి చుట్టూ 5-10 కి.మీ. పరిధిలో కేజీ నుంచి పీజీ వరకు అన్ని వర్గాల వారికి అనువైన విద్యా సంస్థలున్నారుు. ఓక్రిడ్‌జ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, గీతాంజలి, శ్రీ చైతన్య, గాయత్రి, అభ్యాస్, భాష్యం, నారాయణ, గోకరాజు రంగరాజు, వీఎన్ఆర్, బీవీఆర్ఐటీ వంటి అన్ని రకాల విద్యా సంస్థలున్నారుుక్కడ. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్శిటీకి బాచుపల్లిలో 100 ఎకరాల స్థలాన్ని కేటారుుంచారు కూడా. ఔటర్ రింగ్ రోడ్డును ఆధారంగా చేసుకొని మరిన్ని విద్యా, వైద్యం, వినోద సంస్థలూ రానున్నారుు.
⇔ బాచుపల్లి నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న నిజాంపేట్, మియాపూర్‌లోని కార్పొరేట్, మల్టీనేషనల్ ఆసుపత్రులున్నాయి. అరుుతే బాచుపల్లి నుంచి నిజాంపేట్‌కు వెళ్లే రోడ్లో 27 ఎకరాల్లో కత్రియా ఆసుపత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సుమారు 1,000 పడకలు అందుబాటులో ఉంటాయని సమాచారం.
⇔ దేశంలోనే అతిపెద్ద బస్ టెర్మినల్ బాచుపల్లికి 3 కి.మీ. దూరంలోనే ఉంటుంది. మియాపూర్‌లో 55 ఎకరాల్లో ఇంటర్ సిటీ బస్ టెర్మినల్ (ఐసీబీటీ) ఉంది. ఇందులో 200 డిస్ట్రిక్, 30 సిటీ బస్ బేలుంటారుు. బాచుపల్లి నుంచి 10 కి.మీ. దూరం లో హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఉంటుంది. మియాపూర్ మెట్రో స్టేషన్ పూర్తయ్యాక.. దాన్ని బాచుపల్లి వరకూ విస్తరణ చేయాలనేది ప్రభుత్వ యోచ న. ప్రస్తుతం బాచుపల్లిలో మంజీరా మంచినీరు సరఫరా అవుతోంది. గోదావరి జలాలు కుత్బుల్లాపూర్ వరకొచ్చారుు. 2-3 ఏళ్లలో బాచుపల్లి కూడా వస్తాయనేది అధికారుల మాట.
కస్టమర్ల మధ్య ఐక్యత కోసం 10 నుంచి పీపీఎల్ సీజన్-2
ప్రణీత్ గ్రూప్‌కు చెందిన అన్ని ప్రాజెక్ట్‌ల్లోని కస్టమర్ల మధ్య సత్సంబంధాలు, ఐక్యత కోసం క్రీడలకు శ్రీకారం చుట్టింది సంస్థ. గతేడాదిలాగే ఈసారి కూడా ప్రణీత్ ప్రీమియర్ లీగ్ పేరిట క్రికెట్ పోటీలను నిర్వహిస్తోంది. జనవరి 10న ప్రారంభంకానున్న పీపీఎల్ సీజన్-2లో అవెంజర్స్, బ్లాస్టర్స్, కమాండోస్, గ్లాడియేటర్స్, గెలాక్సియన్స, హరికేన్స, మావిరిక్స్, పాంథర్స్, విక్కింగ్స, జోల్టెన్స పేర్లతో 10 బృందాలు పోటీపడనున్నారుు. 40 రోజుల పాటు 24 మ్యాచ్‌లు జరుగుతారుు. విజేతకు లక్షన్నర, రన్నర్‌కు రూ.75 వేలు, మూడో స్థానానికి రూ.50 వేలు నగదు బహుమతిగా అందిస్తారు.