క్వాలిటీ అధికారులపై విచారణ
నెల్లూరు(అర్బన్) : జిల్లాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, సామాజిక తనిఖీలు తదితర అంశాలకు సంబంధించి డ్వామాలోని జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారులు, విజిలెన్స్ అధికారులపై రాష్ట్ర చీఫ్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ బి.నాగేంద్ర విచారణ జరిపారు. నెల్లూరు దర్గామిట్టలోని డ్వామా కార్యాలయంలో గురువారం ఇంజనీరింగ్ కన్సెల్టెన్సీ అధికారుల, క్వాలిటీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా పీడీ హరిత మాట్లాడుతూ విచారణ చేపట్టాల్సిన క్వాలిటీ అధికారులపైనే ఆరోపణలు రావడం దారుణమన్నారు. నాగేంద్ర రికార్డులు పరిశీలించారు. ఆరోపణలు వచ్చిన వారిని విచారించి వివరణ తీసుకున్నారు. తప్పు చేసినట్లు రుజువైతే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.