4 వారాల్లో ఖాళీ చేస్తా : సీఎస్
హైకోర్టుకు పి.వి.రమేశ్ హామీ
సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్‌కు చెందిన క్వార్టర్‌ను 4 వారాల్లో ఖాళీ చేస్తానని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేశ్ సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని నమోదు చేసుకున్న హైకోర్టు ఆయన దాఖలు చేసిన అప్పీల్‌ను పరిష్కరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.