రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనల వెల్లువ
గోల్డ్ కోస్ట్ (ఆస్ట్రేలియా) : కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణం అందించిన తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిస్బేన్‌లో వెంకట్ రాహుల్‌ను క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సన్మానించింది. ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2018 వెయిట్ లిఫ్టింగ్ 85 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన విషయం తెలిసిందే.
తెలుగు క్రీడాకారులను ఆదరించి మరింత ప్రోత్సహిస్తే, భవిష్యత్తులో వారు మరిన్నివిజయాలను సాధించటానికి ప్రేరణగా ఉంటుంది అని క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. క్వీన్స్‌ల్యాండ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు నవనీత తాటిమకుల, రవి కాంత్ గుండేపల్లి, కృష్ణ రావిపాటి, ఉమా గూడూరు, రత్న బుద్ధవరపు తదితరులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.