ఆమీర్ ఖాన్ 'పీకే' పోస్టర్ కాపీనా?
ఆమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' చిత్రం పోస్టర్ వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. అయితే పీకే పోస్టర్ తాజగా మరో వివాదానికి తెర తీసింది. నగ్నంగా అమీర్ ఖాన్ ఓ టేప్ రికార్డర్ ను పట్టుకుని రైలు పట్టాలపై నిలుచున్న పోస్టర్ మరో పోస్టర్ నుంచి కాపీ కొట్టాడనే అంశం నేషనల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
1973 సంవత్సరంలో తన ఆల్బమ్ ప్రమోషన్ కోసం పోర్చుగీస్ సంగీత కారుడు క్విమ్ బారీయోరోస్ రూపొందించిన పోస్టర్ ను పోలీవుందని ఇంటర్నెట్ లో కథనాలు వెలువడ్డాయి. క్విమ్ పోస్టర్ ను స్పూర్తిగా తీసుకుని పీకే పోస్టర్ రూపొందించి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. గతంలో 'డార్క్ నైట్' చిత్రం పోస్టర్ ను కాపీ చేసి 'ధూమ్3' పోస్టర్ ను రూపొందించారనే వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.