అధికారులపై ఫైర్
•మంచిర్యాలలో సమీక్షకు కీలక శాఖల అధికారుల గైర్హాజరు
•అధికారుల తీరును ఎండగట్టిన రాష్ట్ర మంత్రులు
•దళితులకు భూసేకరణలో జాప్యమెందుకని నిలదీత
•వాడీవేడిగా సమస్యలపై చర్చ
సాక్షి, మంచిర్యాల :‘జిల్లాలో తాగునీటి పథకాల నిర్మాణం పూర్తయినా కరెంట్ సదుపాయం లేదని నిరుపయోగంగా వదిలేశారు.. పథకాల నిధులు ఏం చేశారు..? ఇదివరకే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో నిరుపయోగంగా ఉన్న పథకాల జాబితా ఇవ్వమని చెప్పాం.. అయినా ఇంత వరకు ఇవ్వలేదు. ఇప్పుడూసమాచారం లేకుండానే వచ్చారు. కనీస బాధ్యత లేకుం డా ఎలా పని చేస్తున్నారు..? పని తీరు మార్చుకోండి..’ అని జిల్లా అటవీ శాఖ మంత్రి జోగురామన్న ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై మండిపడ్డారు.
శుక్రవారం మం చిర్యాల గార్డెన్స్‌లో గోదావరి పుష్కర ఏర్పాట్లు.. మిషన్ కాకతీయ, దళిత బస్తీ, వాటర్‌గ్రిడ్, ఆహార భద్రత, వై ద్యం, హరితహారం, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమలుపై అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. సమావేశం ప్రారంభంకాగానే ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, దేవాదాయ శాఖ తరఫు నుంచి ఎవరెవరు వచ్చారని మంత్రి ఐకే రెడ్డి ప్రశ్నించ గా.. ఎవరూ రాలేదని సమాధానం రావడంతో పుష్కర ఏర్పాట్ల నిర్వహణలో కీలక శాఖ అధికారులు సమీక్షకు రాక పోవడం ఏంటని ఆర్డీవోను ప్రశ్నించారు. చివరకు ఆర్అండ్బీ అధికారికి ఆర్డీవో ఫోన్ చేసి పిలిపించారు. మిగతా రెండు శాఖల నుంచి ఎవరూ రాలేదు.
సమావేశానికి పలు శాఖల అధికారులు అసంపూర్తి సమాచారం తో రావడంతో మంత్రులు వారిపై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆర్డీవో ఆయేషా మస్రత్ ఖానంపై మంత్రి రామ న్న ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి లేని నిరుపేద దళి తులకు ప్రభుత్వం మూడెకరాల భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని.. అవసరమైన నిధులున్నా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలు పంపడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇప్పటివరకు ఎన్ని మండలాల నుంచి ప్రతిపాదనలు పంపారని ఆర్డీవోను ప్రశ్నించగా.. పలు మండలాల్లో ప్రక్రియ కొనసాగుతోందని ఆమె జవాబిచ్చారు.
సాధ్యమైనంత త్వరలో లబ్ధిదారులు.. భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులైన కొడుకులతో వేరుపడి ఉంటున్న వృద్ధుల కు ఆసరా పెన్షన్లు అందజేయాలని చెప్పినా ఇంకా పలు చోట్ల అధికారులు ఇవ్వడం లేదని మంత్రి రామన్న అన్నారు. అలాంటి వారికి వెంటనే పింఛన్లు ఇవ్వాల న్నారు. అలాగే.. కొందరు సింగరేణి కార్మికులకు రూ. 200 పెన్షన్ అందుతోందని.. వారికి ఆ పింఛన్‌తో పా టు ఆసరా పింఛన్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. క్రమబద్ధీకరణపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న వారు ఆ భూములను క్రమబద్ధీకరించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జెడ్పీ ైవె స్‌చైర్మన్ మూల రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్టర్ చె న్నూరు పెద్ద చెరువు మరమ్మతు పనులు దక్కించుకుని ఏడాదిన్నర క్రితమే పనులు నిలిపేశాడన్నారు. దీంతో ఆ ప్రాంత పరిధిలో వ్యవసాయ పొలాలకు నీరందక పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చే శారు. అలాగే సోమనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయినా.. అటవీశాఖ అనుమతి లేదనే కారణంతో సాగు నీరివ్వడం లేదన్నారు. స్పందించిన మంత్రి ఇరిగేషన్ ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టులు దక్కించుకుని పనులు చేయని గుత్తేదార్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు.
లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి అటవీశాఖ అనుమతి ఇస్తానని హామీ ఇచ్చారు. డివిజన్ పరిధిలో నూరుశాతం కార్డులు ఇచ్చేశామని ఆర్డీవో ఆయేషా మస్రత్‌ఖానం జావాబివ్వడంతో దివాకర్‌రావు పలు ఉదాహరణలు మంత్రుల ముందు ఉంచారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ.. వర్షాలొస్తే లక్సెట్టిపేట మండలం దౌడపల్లి చెరువు ఉప్పొంగి దౌడపల్లితోపాటు వెంకట్రావ్పేట గ్రామాలు మునిగిపోతాయని అయినా.. చెరువు పునరుద్ధరణ జాబితాలో ఆ చెరువు లేకపోవడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ.. తనకు తెలియకుండానే తన పరిధిలోని తాండూరు, భీమిని మండలాల్లో దళితులకు భూపంపిణీ కి సంబంధించి స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపారని అధికారుల తీరుపై మంత్రికి ఫిర్యాదు చేశారు.
ముందుగానే పుష్కరాల ఏర్పాట్లు..
దూర ప్రాంతాల నుంచి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఇప్పట్నుంచే పనులు ప్రారంభించాలని మంత్రి ఐకే రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్యం, రోడ్లు ఇతర సదుపాయాలపై మంత్రి అధికారులతో చర్చించారు. పలువురు అధికారులు మంచిర్యాల డివిజన్ పరిధిలోని గూడెం, లక్ష్మీకాంతాపూర్, ద్వారక (దండేపల్లి), లక్సెట్టిపేట, మంచిర్యాల, ముల్కల్ల, చెన్నూరు, వేలాలా (చెన్నూరు) ప్రాంతాల్లో స్నానఘట్టాలు, రేకుల షెడ్లు, పుష్కరఘాట్లు, రోడ్ల నిర్మాణాలను వివరించారు.
పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిర్మల్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన ఓ యువతి స్వైన్‌ఫ్లూ లక్షణాలతో అక్కడి ఏరియా ఆస్పత్రికి వస్తే.. సిబ్బంది పరీక్షించకుండానే స్వైన్‌ఫ్లూ వచ్చిందని భయపెట్టి వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారని.. తీరా అక్కడ వెళితే స్వైన్‌ఫ్లూ కాదని తేలిందన్నారు. ఇలా రోగులను భయపెడితే సహించేది లేదని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మను మందలించారు.
అప్పుడు నాకే సిగ్గనిపించింది..
- కలెక్టర్ జగన్మోహన్
ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియడం లేదు.. ఇటీవల ఆదిలాబాద్ పక్కనే ఉన్న ఓ గ్రామానికి నేను, మంత్రి జోగు రామన్న వె ళ్లి కల్యాణలక్ష్మీపై ఆ ప్రాంత సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజలను అడిగితే తమకే తెలియదన్నారు. జిల్లా కేంద్రం పక్కనే ఉన్న గ్రామంలో ఉన్న ఈ పరిస్థితిని విని అప్పుడు నాకే సిగ్గనిపించింది. పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఎందుకు వి ఫలమవుతున్నామో బేరీజు చేసుకోవాలి. క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు చెప్పే సమాచారంపై నాకు నమ్మకం లేదు.
తహశీల్దార్లకు ఆర్డీవో క్లాస్..
సమీక్షలో పలు సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంలో మంత్రి జోగు రామన్న ‘మినిట్స్’ రాస్తున్నారా..? అని ఆర్డీవో ఆయేషా మస్రత్ఖానంను ప్రశ్నించారు. ఆర్డీవో రాస్తున్నాం సార్ అని వేదిక ముందే కూర్చొని ఉన్న మంచిర్యాల తహశీల్దార్ కాశబోయిన సురేశ్‌ను చూపిం చారు. దండేపల్లి, చెన్నూర్ తహశీల్దార్లు కుమారస్వా మి, హన్మంతరావు కనిపించకపోవడంతో వారిద్దరినీ వేదికపై పిలిచి..‘ఏం..? తమాషా చేస్తున్నారా..? ఎక్కడికి వెళ్లారు..? ఇక్కడ కూర్చొండి.. మినిట్స్ నోట్ చేయండి.’ అని క్లాస్ తీసుకున్నారు.