breaking news
Raaka Movie
-
బన్నీ-రష్మిక మరోసారి.. యాక్షన్ తో షురూ!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ అండ్ యాక్షన్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె, మలయాళ నటి ఫెమినాజార్జ్ ఈ మూవీలో భాగమయ్యారు. జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ‘రాకా’లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముంబైలో జూలైలో ప్రారంభం కాబోయే కొత్త షూటింగ్ షెడ్యూల్లో రష్మిక మందన్నా జాయిన్ అవుతారని, ఆమె పాత్రకు సంబంధించి తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు.. రష్మిక క్యారెక్టరైజేషన్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సరికొత్త గెటప్‌లో ఆమె కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మైసా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రష్మిక. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘రణబాలి’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ. . బన్నీతో మరోసారి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మరోసారి వెండితెరపై జోడీగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే పుష్ప, పుష్ప 2లో చిత్రాల్లో జోడీగా నటించి మెప్పించిన ఈ జంట.. ఇప్పుడు ‘రాకా’ కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. త్వరలోనే ముంబైలో జరగబోయే కొత్త షెడ్యూల్లో రష్మిక పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో రష్మికతో పాటు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొంది. కొత్త షెడ్యూల్లో రష్మికతో పాటు మృణాల్, జాన్వీలకు సంబంధించిన కీలక సీన్లను కూడా షూట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా కీలక పాత్ర చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ నిర్వహించి, షారుక్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తారట.ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ రూ. 700 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ పూర్తి చేసుకొని.. వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. -
సరికొత్తగా...!
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రాకా’. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ శాతం ముంబైలో జరుగుతోంది. తాజాగా ఈ షూట్‌కి చిన్న బ్రేక్ వచ్చిందట. దీంతో అల్లు అర్జున్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా తన తర్వాతి సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను ముంబై పిలిపించి, ఆ సినిమా గురించి చర్చలు జరపనున్నారట. అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 23వ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కొన్ని రోజులుగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ గెటప్ సరికొత్తగా ఉంటుందని, ఇందుకోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా మేకోవర్ కావాల్సి ఉంటుందని తెలిసింది. తాజాగా అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన కొన్ని లుక్స్‌ను ఫైనలైజ్ చేసే పనిలో లోకేష్ ఉన్నారట. ఈ వారంలోనే లుక్ టెస్ట్‌ను కూడా ప్లాన్ చేశారని, ముంబైలో లుక్ టెస్ట్ జరుగుతుందని టాక్. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభించనున్నట్లుగా ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో చిత్రబృందం పేర్కొన్న సంగతి గుర్తుండే ఉంటుంది. -
కల నిజం అయింది
‘రాకా’ సినిమాలో భాగం అయ్యారు మలయాళ నటి ఫెమినా జార్జ్. హీరో అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్లు జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యారని టాక్. తాజాగా తానూ ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఫెమినా జార్జ్ తెలి పారు.‘‘హ్యాపీ’ సినిమా చూసినప్పటి నుంచి అల్లు అర్జున్ గారికి పెద్ద అభిమానిని. ఆయన హీరోగా చేస్తున్న ‘రాకా’ చిత్రంలో నేను భాగం అవుతానని అస్సలు ఊహించలేదు. నా కల నిజం అయినట్లుగా ఉంది. నా కెరీర్లో ఇప్పటి వరకు నేను చేసిన భారీ సినిమా ఇదే. ఈ చిత్రంలో నా పాత్ర నిడివి తక్కువే కావొచ్చు.. కానీ, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఫెమినా జార్జ్. మలమాళ హిట్ ఫిల్మ్ ‘మిన్నల్ మురళి’తో ఇండస్ట్రీకి వచ్చిన ఫెమినా ఆ తర్వాత ‘తీ΄్పోరి బెన్నీ’, ‘కరక్కం’ వంటి సినిమాల్లో నటించారు. -
అల్లు అర్జున్ రాకా.. మలయాళ బ్యూటీకి జాక్‌పాట్...!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న యాక్షన్ మూవీ రాకా. ఇప్పటికే రిలీజైన రాకా ఫస్ట్ లుక్ పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బన్నీ నెగెటివ్ రోల్ కూడా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తాజాగా మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఇందులో మలయాళ నటి ఫెమినా జార్జ్ నటిస్తున్నారు. ఇటీవల ఓ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫెమినా.. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. అసలు ‘రాకా’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో భాగమవుతానని ఊహించలేదని అన్నారు. నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన వాటిల్లో ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదేనని సంతోషం వ్యక్తం చేశారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. ఆయన నటించిన హ్యాపి నేను చూసిన మొదటి చిత్రమని వెల్లడించారు. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం కల నిజమైనట్లుగా ఉందని పేర్కొన్నారు, ఇటీవల డిస్కో సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే రాకా టీమ్ నుంచే ఫోన్ వచ్చిందని పంచుకున్నన్నారు. కాగా.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఫెమినా 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం మిన్నల్ మురళితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. -
విలన్ రోల్‌కి సై అంటున్న స్టార్ హీరోలు!
సిల్వర్ స్క్రీన్‌పై హీరో అంటే ప్రేక్షకుల ఊహల్లో మంచివాడు... నిజాయతీపరుడు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కథల్లోనూ, హీరోల క్యారెక్టరైజేషన్స్లోనూ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే హీరో క్యారెక్టరైజేషన్లో గ్రే షేడ్స్ ఉన్నా, ఆడియన్స్ ఓకే చెప్పి, థియేటర్స్‌లో విజిల్స్ వేస్తున్నారు. మెల్లగా విలనిజమ్కు క్రేజ్ పెరిగింది. అందుకే కొందరు హీరోలు, తమ స్టార్ హీరో ఇమేజ్ను సైతం పక్కన పెట్టి విలన్ రోల్స్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరికొంతమంది హీరోలైతే తాము హీరోగా నటిస్తున్న సినిమాలోనే విలన్ రోల్లోనూ నటిస్తూ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విలన్ క్యారెక్టర్స్‌కు సైతం స్వాగ్, స్టైల్‌ను జోడిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్ ప్రజెంట్ టాలీవుడ్లో ఊపందుకుంది. ఇలా కథానాయకుడే.. ఖల్ నాయకుడయ్యాడు... అదేనండీ.... ‘ఖల్ నాయక్’ సినిమాలో సంజయ్ దత్ రోల్ గుర్తు చేసుకోండి... విలనిజమ్ మామూలుగా ఉండదు. అలా ఖల్ నాయక్ స్థాయి విలనిజమ్ని చూపించనున్న హీరోలపై ఓ లుక్ వేయండి.లూగర్ఎన్టీఆర్ హీరోగా సూపర్‌హిట్. విలన్‌గానూ సూపర్‌హిట్. ‘జైలవకుశ, వార్ 2, టెంపర్’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఆడియన్స్‌ను మెప్పించింది. తాజాగా మరోసారి విలన్ రోల్ చేసేందుకు రెడీ అయ్యారు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ దేశభక్తి చిత్రం ‘డ్రాగన్’. డ్రగ్స్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, దేశభక్తి వంటి అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ముంబై కేంద్రంగా పనిచేసే ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, కలకత్తా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీల మధ్య జరిగే వార్స్ నేపథ్యంతో ‘డ్రాగన్’ సినిమా ప్రధాన కథాంశం సాగుతుందని, ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ స్పష్టం చేస్తోంది. ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ చీఫ్ లూగర్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ‘‘భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విలన్‌గా లూగర్ కనిపిస్తారు’’ అని ఇటీవల ప్రశాంత్ నీల్ ఓ సందర్భంగా చెప్పారు. ఇలా ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ విలన్ రోల్ చేస్తున్న విషయం ఖరారైపోయింది. అయితే ఈ చిత్రం నుంచి రెండు డిఫరెంట్ లుక్స్‌లో ఎన్టీఆర్ కనిపిస్తున్న ఫోటోలు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘డ్రాగన్’ సినిమాలో ఎన్టీఆర్ ఏమైనా ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ‘ఆప్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’లో లూగర్ ఉన్నట్లే, గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీలోనూ ఓ పవర్ఫుల్ వ్యక్తి ఉంటారని, అతని పేరే డ్రాగన్ అని, ఈ రోల్‌ను కూడా ఎన్టీఆర్‌నే చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. పైగా ఈ ‘డ్రాగన్’ సినిమా 1947, 1967 కాలమానాల్లో కథ జరుగుతుందని ప్రశాంత్ నీల్ చెప్పడం, ఎన్టీఆర్ ద్వి΄ాత్రాభినయం చేస్తున్నారన్న వార్తలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డ్రాగన్’ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, అనిల్ కపూర్, సిద్ధార్థ్ గు΄్తా, గురుసోమసుందరం, అశుతోష్ రానా, ఖుష్భూ, రాజీవ్ కనకాల, శత్రు, బీజు మీనన్, అలెగ్జాండర్ మిజేవ్, భీమల్ జీత్ ఓబెరాయ్, ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్‌రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.పునర్జన్మల నేపథ్యంతో ‘రాకా’‘ఆర్య 2’ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఇందులో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్లో చిన్న΄ాటి నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. అయితే తొలిసారిగా అల్లు అర్జున్ పూర్తిస్థాయిలో విలన్ రోల్ చేయనున్నారని తెలిసింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న సోషియో ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని, తండ్రి–ఇద్దరు కొడుకులు ΄ాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ మూడు రోల్స్‌లో ఒకటి విలన్ రోల్ అట. ఇంకా ఈ ‘రాకా’ చిత్రం పునర్జన్మల నేపథ్యంతో సాగుతుందని, ఓ కొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను అట్లీ తీసుకువెళ్తున్నారని టాక్. ఈ ‘రాకా’ చిత్రంలో దీపికా పదుకొనె ఓ ప్రధాన ΄ాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్స్‌గా జాన్వీకపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ నటిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. అలాగే, ఇదే చిత్రంలోని ఓ పవర్ఫుల్ ΄ాత్రలో రమ్యకృష్ణ యాక్ట్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కావొచ్చు.తండ్రీకొడుకుల కథయశ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’. తండ్రీకొడుకుల అనుబంధం, పగ నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుందని, ఇటీవల ఓ సందర్భంగా యశ్ పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు రాయ, టికెట్.. అంటూ రెండు విభిన్నమైన ఫస్ట్‌లుక్స్ బయటకు వచ్చాయి. ఈ రెండూ ΄ాత్రల్లోనూ యశ్‌నే కనిపించారు. దీంతో ‘టాక్సిక్’ సినిమాలో రాయ, టికెట్లు తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని, ఈ యశ్ డ్యూయోల్ రోల్ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ రెండు ΄ాత్రల్లో ఒక ΄ాత్ర విలన్ రోల్ అట. అది రాయనా? లేక టికెట్నా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అన్నమాట. ఇక ‘టాక్సిక్’ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రధాన కథాంశం 1940–1970 నేపథ్యంతో సాగుతుందని తెలిసింది. గోవా నేపథ్యంతో కథ సాగుతుందట. గోవా ΄ోర్టు కేంద్రంగా జరిగే డ్రగ్స్– ఆయుధాల అక్రమరవాణా, ఈ క్రమంలో గ్యాంగ్స్టర్స్ మధ్య గొడవలు, అధిపత్య పోరు..వంటి అంశాల నేపథ్యంతో ‘టాక్సిక్’ సినిమా కథ సాగుతుంది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమాఖురేషీ,తారా సుతారియా, రుక్మిణీ వసంత్, అక్షయ్ ఓబెరాయ్, సుదేవ్ నాయర్ ఈ సినిమాలోని ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ్ర΄÷డక్షన్స్, మాన్స్టర్మైండ్ క్రియేషన్స్ పతాకంపై యశ్, వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ ద్విభాషా (కన్నడ, ఇంగ్లీష్) చిత్రం ఈ జూన్ 4న రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని ‘టాక్సిక్’ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలిసింది.ఫుల్ ఫామ్యాక్టర్గా మంచు మనోజ్ ఫుల్ ఫామ్‌లోకి వచ్చారు. ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గానూ సినిమాలు చేస్తున్నారు. చె΄్పాలంటే..మంచు మనోజ్ విలన్‌గా హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’, తేజా సజ్జా ‘మిరాయ్’ చిత్రాల్లో మంచు మనోజ్ చేసిన నెగటివ్ షేడ్ రోల్స్ ఆడియన్స్‌ను అలరించాయి. దీంతో మరో విలన్ రోల్‌కు మంచు మనోజ్ సై అన్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ముంబై నేపథ్యంతో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారని తెలిసింది. ఈ చిత్రంలోనే మంచు మనోజ్ ఓ పవర్ఫుల్ క్యారెక్టర్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే మంచు మనోజ్ చేయనున్నది ఈ సినిమాలోని విలన్ రోల్ అని తెలిసింది. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇక మంచు మనోజ్ హీరోగా నటించిన ‘డేవిడ్ రెడ్డి’ సినిమా ఈ దసరా రిలీజ్‌కు సిద్ధమైంది. ఆయన హీరోగా ‘వడ్డీకాసులవాడ, రక్షక్’ సినిమాల ప్రకటనలు వచ్చాయి.కుంభ!అతని కల ఒక ప్రళయం. అతను ఎవరంటే..కుంభ. ఇతని అడ్రస్ ‘వారణాసి’ సినిమా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄÷ందుతున్న భారీ సినిమా ‘వారణాసి’. ఈ చిత్రంలో రుద్రగా, రాముడిగా కనిపించనున్నారు మహేశ్‌బాబు. మందాకినిగా ప్రియాంకా చో్ర΄ా, రణ కుంభ ΄ాత్రలో మలయాళ నటుడు, దర్శక – నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ‘వారణాసి’లో కుంభ విలన్ రోల్. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన విలన్‌గా కుంభ ΄ాత్ర అని, ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి చె΄్పారు. మరి..రణ కుంభ వెండితెరపై ఏ స్థాయి విలనిజం చూపిస్తారనేది వచ్చే ఏడాది ఏప్రిల్ 7న తెలిసి΄ోతుంది. ఎందుకంటే..‘వారణాసి’ సినిమా ఆ రోజే విడుదల కానుంది. అలాగే ప్రభాస్ సలార్ సినిమాలోని వరద అనే ఓ పవర్ఫుల్ ΄ాత్రలో పృథ్వీరాజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సలార్ 2’లో ఈ వరద క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. ‘సలార్’ సినిమాకు ప్రశాంత్‌నీల్ దర్శకుడు. 2027 చివర్లో ‘సలార్ 2’ సినిమా చిత్రీకరణ ్ర΄ారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.బాలీవుడ్ హీరోలూ విలన్లుగా...బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా సినిమా ‘కింగ్’. ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్‌తో షారుక్ ఖాన్ చేస్తున్న సినిమా ఇది. ఇందులో షారుక్ ఖాన్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ రోల్‌ను అభిషేక్ బచ్చన్ చేస్తున్నారు. పూర్తి స్థాయి విలన్ పాత్రలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్న తొలి సినిమా ఇదే అని బాలీవుడ్ సమాచారం. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్, దీపికా పదుకోన్ ఇతర ప్రధాన ΄ాత్రల్లో నటిస్తున్న ‘కింగ్’ సినిమా ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ కానుంది. అలాగే మరో సూపర్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం విలన్స్ లిస్ట్‌లో చేరారు. సైఫ్అలీఖాన్ హీరోగా చేసిన తాజా హిందీ చిత్రం ‘హైవాన్’లో అక్షయ్ కుమార్ విలన్ రోల్ చేశారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మలయాళ హిట్ మూవీ ‘ఒప్పం’కు హిందీ రీమేక్‌గా రూపొందిందని తెలిసింది. ఈ చిత్రం షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. ఇంకా మరో సీనియర్ హీరో సంజయ్ దత్ సౌత్‌లో విలన్‌గా బిజీ అయి΄ోయారు. ఇప్పటికే యశ్ ‘కేజీఎఫ్’, ప్రభాస్ ‘ది రాజాసాబ్’ చిత్రాల్లో విలన్‌గా చేసిన సంజయ్ ప్రస్తుతంæ తెలుగు హీరో సాయిదుర్గా తేజ్ చేసిన ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలోనూ విలన్‌గా చేస్తున్నారని తెలిసింది. మరోవైపు బాలీవుడ్ యువ హీరోలు సైతం విలన్‌గా మారేందుకు సిద్ధం అవుతున్నారు. ‘యానిమల్’ సినిమాలో రణ్‌బీర్ కపూర్ ఎలాంటి హీరోయిక్ పెర్ఫార్మెన్స్ చేశారో అందరికీ తెలిసిందే. అయితే ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్: ది ΄ార్క్’ చిత్రంలో విలన్‌గానూ రణ్‌బీర్ కపూర్ కనిపిస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయాన్ని స్వయంగా రణ్‌బీర్ కన్ఫార్మ్ చేశారు. ‘యానిమల్: ది ΄ార్క్’ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్తుందని తెలిసింది. అలాగే రామ్‌చరణ్ హీరోగా నటించిన పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ విలేజ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ సినిమాలో బాలీవుడ్ యువ నటుడు దివ్యేందు శర్మ విలన్ రోల్ చేశారు. నాగచైతన్య హీరోగా నటించిన ‘వృషకర్మ’ చిత్రంలో స్పర్శ్ శ్రీవాస్తవది విలన్ రోల్. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇలా విలన్ రోల్ వైపు మక్కువ చూపిస్తున్న బాలీవుడ్ హీరోలు మరికొంతమంది ఉన్నారు.సీనియర్ ప్రతినాయకులు సుప్రీమ్ యాక్సిన్‘అభయ్, సిగప్పు రోజక్కల్, వాయనాడ్ తంబన్’ వంటి చిత్రాల్లో విలన్‌గా వెండితెరపై నెక్ట్స్ లెవల్ యాక్టింగ్ చేశారు కమల్‌హాసన్. కానీ ఆ తర్వాత ఎందుకో కానీ చాలా కాలం కమల్‌హాసన్ విలన్ రోల్ చేయలేదు. అయితే ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ కోసం విలన్ రోల్ చేసేందుకు కమల్ హాసన్‌ను ఒప్పించారు దర్శకుడు నాగ్అశ్విన్. ప్రభాస్ హీరోగా చేస్తున్న ‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’ నుంచి ఆల్రెడీ ‘కల్కి2898 ఏడీ’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో భైరవ‡ అండ్ కర్ణగా వెండితెరపై కనిపించారు ప్రభాస్. ఈ చిత్రంలోనే సుప్రీమ్ యాక్సిన్ అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘కల్కి 2’ సినిమా చిత్రీకరణలో కమల్‌హాసన్ ΄ాల్గొంటున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ‘కల్కి 2’ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల అయ్యే చాన్సెస్ ఉన్నాయి.శికంజా మాలిక్వెండితెరపై మోహన్‌బాబు విలన్ రోల్లోనూ ఎంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేస్తారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. అయితే కొంతగ్యాప్ తర్వాత మోహన్‌బాబు మళ్లీ విలన్ గెటప్స్‌లోకి వచ్చారు. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ΄÷ందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ది ΄్యారడైజ్’. ఈ చిత్రంలో జడల్ అనే ΄ాత్రలో నాని నటిస్తుండగా, విలన్ శికంజా మాలిక్‌గా మోహన్‌బాబు నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ‘ది ప్యారడైజ్’ సినిమా ఈ ఏడాది ఆగస్టు 21న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. అలాగే ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో వెంకటప్పయ్య నాయుడు అనే పవర్ఫుల్ విలన్ రోల్ చేస్తున్నారు మోహన్‌బాబు. ‘ఆర్ఎక్స్ 100, మంగళవారం’ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తీసిన అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న విలేజ్ యాక్షన్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఈ ‘శ్రీనివాసా మంగాపురం’ చిత్రంలో తెలుగులో జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, రాషా తడానీ హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ఇందులో శ్రీనుగా జయకృష్ణ, మంగగా రాషా నటిస్తారు. మంగ తండ్రి వెంకటప్పయ్యగా మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.చేతబడిసీనియర్ నటుడు జేడీ చక్రవర్తి గురించి తెలిసిందే. హీరోగా, విలన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. కొంతకాలం వెండితెర విలనిజంకు దూరంగా ఉన్న జేడీ చక్రవర్తి, ‘గాయపడ్డ సింహం’తో వెండి తెరపై విలన్‌గా నటించారు. తరుణ్‌భాస్కర్, శ్రీవిష్ణు లీడ్ రోల్స్‌లో యాక్ట్ చేసిన సినిమా ఇది. ఇటీవలే ఈ సినిమా విడుదలైంది. ఇందులో ధర్మ అనే ΄ాత్రలో నటించారు జేడీ చక్రవర్తి. అలాగే ఆయన ‘చేతబడి’ అనే ఓ సినిమాకు కమిటయ్యారు. ఇందులో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తియే నటిస్తారు. ఈ సినిమాను గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. సూర్యాస్ కథ అందిస్తున్న ఈ సినిమాను, మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించనున్నారు. -
అల్లు అర్జున్ రాకా.. నార్త్‌లోనూ కేక..!
పుష్ప తర్వాత అల్లు అర్జున్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆయన మార్కెట్ కేవలం దక్షిణాదిలోనే కాదు..నార్త్‌లోనూ ఫుల్ క్రేజ్ ఉంది. పుష్ప-2 రిలీజ్ టైమ్‌లో బీహార్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. పుష్ప 2 నార్త్‌లో కేవలం హిందీలోనే రూ. 812 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. దీంతో బన్నీకి ఉత్తారాదిలోనూ భారీస్థాయిలో మార్కెట్ ఏర్పడింది.ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెరకెక్కుతోన్న రాకా మూవీపై నార్త్ ఆడియన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కుల కోసం బిహార్‌లో తీవ్రమైన పోటీ ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఈ సినిమా హక్కుల కోసం ఇప్పటికే 'రాకా' చిత్ర నిర్మాతలను సంప్రదించారని తెలిపింది.ఈ మూవీ రైట్స్ కోసం భారీ ధర చెల్లించేందుకు డిస్ట్రిబ్యూటర్స్ రెడీగా ఉన్నారట. ఇదంతా చూస్తుంటే బిహార్‌లో బన్నీకి ఎంత క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. కాగా.. పుష్ప 2: ది రూల్ మూవీ బీహార్‌తో పాటు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు రాకా సినిమాకు సైతం ఇలాంటి స్పందనే వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూవీ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది.కాగా.. ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. -
దీపికా ప్రెగ్నెన్సీ.. రాకా యాక్షన్ సీన్స్‌పై క్లారిటీ..!
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న బిగ్ ప్రాజెక్ట్ రాకా. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో తోడేలును తలపించేలా బన్నీ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ లుక్ చూస్తే బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని అర్థమవుతోంది. ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది.దీపికా పదుకొణె ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీ ప్రకటించింది. ఇప్పటికీ ఆమెకు ఓ కూతురు ఉండగా.. మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో రాకా షూటింగ్ గురించి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలోనే రాకా సంబంధించి ఓ టాక్ నెట్టింట వైరల్‌గా మారింది. దీపికా పాత్ర కోసం రాకా మార్పులు చేస్తారా? అన్న సందేహం ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంచుతోంది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో యాక్షన్ సీన్స్‌ను డూప్‌తో చేయిస్తారని బాలీవుడ్లో చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాకా స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పు చేయడం లేదని తెలుస్తోంది. దీపికా పదుకొణెకు అద్భుతమైన ఎంట్రీతో పాటు.. అల్లు అర్జున్‌తో ఒక బిగ్ యాక్షన్ సన్నివేశం కూడా ఉందని టాక్. అయితే ఈ యాక్షన్ సీన్స్‌లో మాత్రం దీపికా డూప్‌తో చేయించనున్నారు. మిగిలిన సన్నివేశాల్లో దీపికానే షూటింగ్లో కొనసాగించనున్నారు. ఆమె ప్రెగ్నెంట్ కారణంగా రాకా కథలో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు. దీంతో అభిమానుల అనుమానాలకు ఇక తెరపడినట్లే. కాగా.. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. -
టాలీవుడ్ అప్డేట్స్.. ఏ హీరో ఎక్కడున్నాడో తెలుసా?
టాలీవుడ్ నుంచి ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలంతా ఇప్పుడు షూటింగ్లో బిజీ అయిపోయారు. వీరితో పాటు సీనియర్ హీరోలు నాగార్జున, బాలకృష్ణ, వెంకటెశ్ కూడా సమ్మర్‌లోనూ సెట్స్‌లోనే ఉంటున్నారు. మరి ఏ హీరో ఎక్కడ ఉన్నాడు? కొత్త సినిమాల షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఓ లుక్కేయండి.🎥 ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది🎥 అల్లు అర్జున్ అట్లీ కాంబోలో తెరకెక్కుతున్న రాకా మూవీ షూటింగ్ ముంబై లో జరుగుతుంది. ప్రస్తుతం బన్నీ ముంబైలోనే ఉన్నాడు.🎥 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. అక్కడ వేసిన ఓ సెట్లో కీలకమైన సన్నివేశలు షూట్ చేస్తున్నారు.🎥 రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా షూటింగ్ వన్ స్టూడియో శంకరపల్లి లో జరుగుతోంది. అక్కడే ఓ సెట్లో ఐటమ్ సాంగ్ షూట్ చేస్తున్నారు.🎥 నందమూరి బాలకృష్ణ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ జన్వాడ గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది.🎥 కార్తీక్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా కెక్కుతున్న సినిమా షూటింగ్ ఎల్బీ నగర్ లో జరుగుతుంది. నాగార్జున కెరీర్లో 100వ సినిమా ఇది.🎥 వెంకటేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతోంది.🎥 నాని శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతుంది.🎥 విజయ్ దేవరకొండ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ గండిపేట సెట్ లో జరుగుతుంది.🎥 రవితేజ శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.🎥 శర్వానంద్ సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న భోగి సినిమా షూటింగ్ ముచ్చింతల్ లో జరుగుతోంది.🎥 రష్మిక , రవీంద్ర పుల్లే డైరెక్షన్ లో నటిస్తున్న మైసా సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతోంది.🎥 శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ శంకర పల్లి లో జరుగుతుంది.🎥 గోపీచంద్ సంకల్ప్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతున్న భరతవర్ష సినిమా షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. -
2027 వార్..! ఈ పోరులో గెలిచేదెవరు
-
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపికా పదుకొణె.. టీమ్ క్లారిటీ
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపికపై రకరకాల రూమర్స్ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు ఇప్పటికే ఆమె ఒప్పుకున్న ‘రాకా’ మూవీ నుంచి కూడా తప్పుకున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై ‘రాకా’ టీమ్ స్పందించింది. దీపికను తొలగించారనే వార్తల్లో నిజం లేదని టీమ్ స్పష్టం చేసింది. అంతేకాదు ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన తర్వాత ఆమె పాత్ర నిడివిని తగ్గించారనే ప్రచారాన్ని కూడా టీమ్ ఖండించింది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం అని.. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో దీపిక కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేసేందుకు దీపిక ఒప్పుకుందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో దీపికతో పాటు రష్మిక, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు సమాచారం.బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇప్పటికే విలన్ లుక్ రిలీజ్ అయింది. త్వరలోనే హీరో పాత్రకు సంబంధించిన లుక్ కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హీరో పాత్రలో బన్నీ స్టైలీష్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అల్లు అర్జున్ ముంబై హౌస్.. నెలకు ఏకంగా అన్ని లక్షలా?
తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్.. ముంబైకి షిఫ్ట్ కాబోతున్నాడనే రూమర్స్ తెగ వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన తండ్రి అల్లు అరవింద్.. షూటింగ్ కోసం ముంబైలో ఎక్కువగా ఉంటున్నందున అలా అనిపించి ఉండొచ్చని, అతడికి ఇక్కడే సొంతిల్లు ఉంది. పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. స్నేహితులందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైకి ఎందుకు వెళ్తాడు? అక్కడ స్థిరపడాలనే ఆలోచన లేదు అని స్పష్టం చేశారు.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు బోల్డ్ కామెడీ సినిమా)అయితే ముంబైకి బన్నీ పూర్తిగా షిఫ్ట్ కాకపోయినప్పటికీ కొన్నాళ్ల పాటు అయితే అక్కడ ఉండబోతున్నాడు. ఈ విషయం మాత్రం నిజమే. ఎందుకంటే రీసెంట్‌గానే ముంబైలోని జుహూ ప్రాంతంలో తార రోడ్లో ఐదు బెడ్ రూమ్‌ల(5 BHK) లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని బన్నీ అద్దెకు తీసుకున్నాడు. ఏడాది క్రితమే ఈ డీల్ ఫిక్సయినప్పటికీ తమ అభిరుచికి తగ్గట్లు బన్నీ-స్నేహ దాని ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారట.సముద్రానికి ఎదురుగా ఉండే ఈ అపార్ట్మెంట్కి నెలవారీ అద్దె ఏకంగా రూ.16 లక్షలు అని, ఇందులో రాబోయే మూడేళ్ల పాటు అల్లు అర్జున్ ఉండబోతున్నాడని సమాచారం. స్కూల్ సెలవులు ఇచ్చిన టైంలో భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అయాన్, అర్హ అక్కడికి వెళ్తారు. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి.అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం అట్లీ తీస్తున్న 'రాకా' మూవీ ఉంది. దీని షూటింగ్ చాలావరకు ముంబైలోనే ఉండనుంది. దీని తర్వాత లోకేశ్ కనగరాజ్‌తో చేయబోయే సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో రాబోయే మూడేళ్ల పాటు బన్నీ ముంబైలో ఉండబోతున్నాడట.(ఇదీ చదవండి: ఇప్పటికీ మా కుటుంబాన్ని గుడిలోకి రానివ్వరు: నటుడు వినోద్) -
ముంబైకి మకాం మార్చనున్న బన్నీ
-
ముంబైకి అల్లు అర్జున్… పుకార్ల వెనుక నిజం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబయిలో సెటిల్ అవుతున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ విషయంపై గత రెండు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. దీనికి కారణం, బన్నీ నిజంగానే ముంబయికి షిఫ్ట్ అవ్వడమే. కానీ ఇందులో సగం మాత్రమే నిజం అని తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీతో చేస్తున్న ‘రాకా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రధాన షూటింగ్ మొత్తం ముంబయిలోని ఓ స్టూడియోలో జరుగుతోంది. కీలకమైన ఈ షెడ్యూల్ కారణంగా హైదరాబాద్, ముంబయి మధ్య ప్రయాణం కష్టంగా ఉండటంతో, తాత్కాలికంగా ముంబయిలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇదే సమయంలో బన్నీ ముంబయిలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడని, అక్కడే శాశ్వతంగా సెటిల్ అవ్వబోతున్నాడని పుకార్లు చెలరేగాయి. కానీ నిజానికి బన్నీ ముంబయిలో ఫ్లాట్ కొనలేదు. కేవలం కొన్ని రోజుల పాటు ఉండటానికి లీజు కింద తీసుకున్నాడని సమాచారం. ఈ విషయాన్ని బన్నీ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పష్టం చేశారు. ‘రాకా’ షూటింగ్ పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ తిరిగి హైదరాబాద్‌కి వస్తాడు. ఇక బన్నీ, అట్లీతో 'రాకా' సినిమా తర్వాత లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అనిరుధ్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కూడా ఒక సినిమా చేయనున్నాడనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బన్నీ ముంబయిలో ఉన్నది నిజమే కానీ అక్కడే శాశ్వతంగా సెటిల్ మాత్రం అవ్వడం లేదు. -
ఆరో క్లాస్ నుంచి చేస్తున్నా.. నా దగ్గర 1000 పాటలున్నాయి
సాయి అభ్యంకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా కాస్త సుపరిచతమే. ఎందుకంటే రీసెంట్ టైంలో తన పాటలతో సంచలనం సృష్టిస్తున్నాడు. గతేడాది రిలీజైన 'డ్యూడ్' మూవీ సాంగ్స్ కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే. ప్రస్తుతం అల్లు అర్జున్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఇతడు.. అందరూ అవాక్కయ్యే విషయాన్ని బయటపెట్టాడు. తన దగ్గర ప్రస్తుతం వెయ్యకి పైగానే పాటలు సిద్ధంగా ఉన్నాయని షాకిచ్చాడు.(ఇదీ చదవండి: 'రాకా' మ్యూజిక్ ఇంటర్నేషనల్.. సాయి వ్యాఖ్యలు వైరల్)'నేను ఆరో తరగతిలో ఉన్నప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా. పాటల్ని కంపోజ్ చేస్తున్నా. ఇప్పటికే నా దగ్గర 1000కి పైగా పాటలు రెడీగా ఉన్నాయి. కాకపోతే వాటిని ఇప్పుడు ఉపయోగించను. నాకు 60 ఏళ్లు దాటిన తర్వాత ఆ పాటల్ని బయటకు తీస్తా. ఇప్పుడు నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను. కాబట్టి వాటిపై ఆధారపడటం కంటే కొత్తగా పాటలు కంపోజ్ చేయాలి' అని సాయి అభ్యంకర్ చెప్పుకొచ్చాడు.ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సింగర్స్ టిప్పు-హరిణిల కొడుకే ఈ సాయి అభ్యంకర్. సొంతంగా ఆల్బమ్ సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. తమిళంలో అయితే అనిరుధ్‌కి సాయి పోటీ వచ్చాడని మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇతడి మ్యూజిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు) -
రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్.. డైరెక్టర్ వ్యాఖ్యలు వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - దర్శకుడు అట్లీ సినిమా రాకా.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి బన్నీ ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చిత్ర సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో సంగీతం ఎలా ఉండబోతుందో ఆయన పేర్కొన్నారు. రాకా సినిమా కోసం మొదటిసారి దర్శకుడు అట్లీని కలిసినప్పుడు జరిగిన సంఘటనను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.రాకా సినిమా సంగీతం విషయంలో దర్శకుడు అట్లీకి క్లియర్ విజన్ ఉందని సాయి అభ్యంకార్ ఇలా చెప్పారు. 'రాకా కోసం సౌండ్ ట్రాక్ ఎలా ఉండాలని అట్లీ ముందే చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇప్పటికే మేము చాలా పాటలను క్రియేట్ చేశాం. అవన్నీ కూడా బాగానే వచ్చాయి. అల్లు అర్జున్ సార్‌కు సంగీతం అంటే చాలా ఇష్టం. రాకా పాటలు, సంగీతం అంతర్జాతీయ స్థాయిలో మెప్పించాలని అందుకు తగ్గట్టుగానే అంతర్జాతీయ గాయకులు, గీత రచయితలతో కలిసి పనిచేయాలని కోరుకున్నాము. ప్రతి ట్రాక్‌లో మ్యూజిక్ బలంగా ఉండాలని ప్లాన్ చేశాం. అట్లీ అన్న కథ చెప్పిన తర్వాత, ఈ ఆల్బమ్‌ను ఎలా తీసుకురావాలనే దానిపై నాకు చాలా క్లారిటీ లభించింది.వెయ్యికి పైగా పాటలు తన వద్ద ఉన్నాయని సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ తెలిపారు. ప్రముఖ గాయకులు టిప్పు- హరిణి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన సాయి.. డ్యూడ్ మూవీతో తెలుగు వారిని మెప్పించాడు. రాకాతో పాటు సూర్య కరుప్పు, బెంజ్, మార్షల్, డీ 55 వంటి ప్రాజెక్ట్‌లకు ఆయన పనిచేస్తున్నాడు. Sai Abhyankar says #Raaka’s music could go international, featuring multiple international collaborations 🎶pic.twitter.com/hZZFtT466B— Mohammed Ihsan (@ihsan21792) April 20, 2026 -
బన్నీ పారితోషికం.. రూపాయిలో 30 పైసలు మాత్రమే!
అల్లు అర్జున్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. ఆ ఇమేజ్‌ని దాటి సొంతంగా తనకంటూ ఓ గుర్తింపుని సంపాదించుకున్నాడు. కలెక్షన్స్ పరంగా చూస్తే.. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అని చెప్పొచ్చు. బన్నీ నటించిన గత మూడు సినిమాలు(అల వైకుంఠపురుములో, పుష్ప, పుష్ప 2) కలిపి రూ. 2,361 కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. ఇదంతా గత ఐదేళ్లలోనే జరిగింది. భారీ కలెక్షన్స్ మాత్రమే కాదు..జాతీయ అవార్డును అందుకున్న తొలి హీరో కూడా బన్నీనే. అంతేకాదు ఇండియాలో అత్యధిక పారితోషికం(Allu Arjun Remuneration) అందుకుంటున్న నటుల్లో ఆయన ఒకరు. అయితే అందరి హీరోల్లా అల్లు అర్జున్(Allu Arjun) ఒక ఫిక్స్డ్ అమౌంట్‌కి సినిమా ఒప్పుకోడు అట. ఒక నిర్మాత కొడుకుగా తనతో సినిమా చేసే నిర్మాతలపై భారం పడకుండా పారితోషికం తీసుకుంటాడట. అలా అని తక్కువేం తీసుకోడు. ఇంకా చెప్పాలంటే..తోటి హీరోల కంటే కాస్త ఎక్కువే తీసుకుంటాడు. దాని కోసం అల్లు అర్జున్ ఓ స్పెషల్ రూట్ ఎంచుకున్నాడు.లాభాల్లో వాటా.. అర్జున్ పారితోషికం తీసుకునే విధానం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నిర్మాత, కాలమిస్ట్ జి. ధనంజయన్ ఇలా వెల్లడించారు. ‘అల్లు అర్జున్ సినిమాకు ఇంత అని పారితోషికం తీసుకోరు. లాభాల్లో వాటాను మాత్రమే అడుగుతాడు. రూపాయిలో కేవలం 30 పైసలు ఆయన పారితోషికం కింద తీసుకుంటారు. ఊదహారణకు ఆయన నటించిన ఒక్క సినిమా రూ. 1000 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఆయన పారితోషికంగా రూ. 300 కోట్లు తీసుకుంటారు. మరో సినిమా రూ. 500 కోట్లు వసూలు చేస్తే..కేవలం రూ. 150 కోట్లు మాత్రమే తీసుకుంటారు. ఆయన పారితోషికం గురించి అస్సలు మాట్లాడరు. మంచి సినిమా చేయాలనే ప్రయత్నిస్తాడు’ అని ధనంజయన్ చెప్పుకొచ్చాడు.నిర్మాతకు భారం తగ్గుతుంది.. బన్నీ ఫాలో అవుతున్న విధానం వల్ల బడ్జెట్ తగ్గడమే కాదు.. నిర్మాత ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఒక సినిమాను రూ. 75 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాలనుకుంటే.. లాభాల పంపిణీ విధానం వల్ల అందులో రూ. 25 కోట్లను తగ్గించొచ్చు. అలా చేయడం వల్ల నిర్మాత తీసుకోవలసిన రుణం తగ్గుతుంది, దాని ఫలితంగా వడ్డీ రేటు కూడా తగ్గుతుంది. ఇది సినిమా త్వరగా బ్రేక్-ఈవెన్ స్థాయికి చేరుకుని, ఆపై లాభాలను ఆర్జించడానికి సహాయపడుతుంది’ అని ధనంజయన్ అన్నారు.పుష్ప 2కి ఎంత తీసుకున్నాడు?ధనంజయన్ మాటలను బట్టి చూస్తే.. పుష్ప, పుష్ప 2 చిత్రాలకు బన్నీ భారీగానే తీసుకున్నట్లు అర్థమవుతుంది. పుష్ప 2 మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,742.10 కోట్లు వసూలు చేసింది. అందులో 30 శాతం అంటే..సుమారుగా రూ. 522 కోట్లు సంపాదించి ఉండాలి. పుష్ప ప్రపంచవ్యాప్తంగా రూ. 350.10 కోట్లు వసూలు చేసింది. దీని కోసం సుమారు రూ. 105 కోట్లు అందుకుని ఉండాలి. ప్రస్తుతం బన్నీ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చిత్రం చేస్తున్నాడు. రూ.800 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరి ఈ చిత్రం బన్నీకి ఎన్ని కోట్లను తీసుకొచ్చి పెడుతుందో చూడాలి. -
మరోసారి తల్లి కాబోతున్న దీపిక.. ‘రాకా’ కోసం కీలక నిర్ణయం!
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ శుభవార్తని ఆదివారం అభిమానులతో పంచుకుంది దీపిక. దీంతో అందరూ రణ్వీర్, దీపిక దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. అదే సమయంలో ఆమె కొత్త సినిమాలపై రకరకాల పుకార్లను కూడా పుట్టించారు. దీపిక ఇక ఏ సినిమా షూటింగ్లో పాల్గొనదని.. పూర్తిగా రెస్ట్ తీసుకుంటుందనే వార్తలు వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేనట్లు తెలుస్తోంది. ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాతే ఆమె విశ్రాంతి తీసుకోనున్నారట.రాకా కోసం యాక్షన్దీపికా ఒప్పుకున్న సినిమా రాకా ఒక్కటి. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. సన్ పిక్చర్స్ ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తికాలేదు. ఇందులో దీపికా పదుకొనే కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్రకు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. గర్భం దాల్చినప్పటికీ.. యాక్షన్ సీన్స్ చేయడానికి దీపికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఈ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయం తీసుకుందట. ఈ విషయం దర్శకుడు అట్లీకి కూడా చెప్పడంతో.. వీలైనంత తొందరగా దీపికకు సంబంధించిన సన్నివేశాల షూటింగ్‌ని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నాడట. ‘కింగ్’కోసం కూడా.. దీపికా ఒప్పుకున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘కింగ్’. షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఇందులో కూడా దీపిక పదుకొణె పాత్రకు యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. వాటిని కూడా ఆమె ప్రెగ్నెంట్ గా ఉంటూనే పూర్తి చేయాల్సి ఉంది. తనవల్ల షూటింగ్‌కి అంతరాయం కావొద్దనే దీపికా ఈ నిర్ణయం తీసుకుందట. ‘పఠాన్’లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత షారుక్‌ఖాన్ - సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
నేను అడిగాను.. కానీ వాళ్లు ఛాన్స్ ఇవ్వలేదు
రీసెంట్ టైంలో తమిళ హీరో ఆర్య షాకిచ్చే కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచారు. కాశీలో ఉన్న సాధువుల్లో 40 శాతానికి పైగా దొంగలే అని, వాళ్లంతా హత్యల్లాంటివి చేసి వాటి నుంచి తప్పించుకునేందుకు ఈ వేషం వేసుకున్నారని చెప్పాడు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. వీటిని పక్కనబెడితే ఇప్పుడు అల్లు అర్జున్ 'రాకా' మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అడిగినా సరే తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న మాజీ సీఎం మనవరాలు)ఆర్య హీరోగా నటించిన 'మిస్టర్ ఎక్స్' సినిమా గత వీకెండ్ తెలుగులోనూ రిలీజైంది. కాకపోతే ఇక్కడెవరూ పట్టించుకోలేదు. దీని ప్రమోషన్లలో భాగంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడాడు. 2013లో 'రాజారాణి' సినిమా విడుదలైనప్పుడు దర్శకుడు అట్లీని మెచ్చుకున్నాడని, ఇప్పుడు వాళ్లిద్దరూ కలిసి 'రాకా' చేస్తుండటం సంతోషంగా ఉందని అన్నాడు. మరి ఆ మూవీలో రోల్ ఏమైనా అడిగారా అని యాంకర్ ప్రశ్నించగా.. నేను అడిగాను కానీ వాళ్లు ఇవ్వలేదని ఆర్య నవ్వేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.'పుష్ప' సినిమాల తర్వాత బన్నీ ఎవరితో పనిచేస్తాడా అని అంతా అనుకుంటున్న టైంలో తమిళ దర్శకుడు అట్లీకి అవకాశమిచ్చాడు. చాన్నాళ్లుగా షూటింగ్ జరుగుతోంది. పదిరోజుల క్రితం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మైండ్ బ్లోయింగ్ లుక్ రిలీజ్ చేయడంతో పాటు 'రాకా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా గ్లోబల్ ఆడియెన్స్ టార్గెట్ పెట్టుకుని భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు. ఈ ఏడాది సంగతి పక్కనబెడితే వచ్చే ఏడాది కూడా రిలీజ్ కాకపోవచ్చనే రూమర్స్ వినిపిస్తున్నాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 మూవీస్.. ఆ మూడు డోంట్ మిస్)Allu Arjun and atlee met each other in 2014 itself 😳😳😳🔥🔥Visionary bhAAi 🥵🖤Actor Arya said -@alluarjun - @Atlee_dir and him met during #RajaRani promotions in Hyderabad.Allu Arjun liked that movie and appreciated Atlee’s work Now they’re working on a movie together… pic.twitter.com/VIDXpgQst6— virat_raisAAr🗡️🦖 (@virAAt_kohli18) April 20, 2026 -
హైదరాబాద్‌కు గుడ్‌బై.. షిఫ్ట్ అవుతున్న అల్లు అర్జున్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబంతో పాటు ముంబైలో తాత్కాలికంగా స్థిరపడనున్నారని తెలుస్తోంది. తను నటిస్తున్న కొత్త సినిమా రాకా షూటింగ్ ఎక్కువగా ముంబైలోనే జరుగుతుండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, సినిమా కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌ను నిర్వహించడానికి అవకాశం దొరుకుతుంది. ఆపై రెండు నగరాల మధ్య నిరంతర ప్రయాణాన్ని తగ్గించుకోని సినిమా కోసం మరింత సమయం కేటాయించవచ్చని బన్నీ ఆలోచిస్తున్నాడట.బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం అల్లు అర్జున్ తన తదుపరి చిత్రానికి పూర్తిగా అంకితమవ్వడానికి రాబోయే రెండు, మూడు సంవత్సరాల పాటు ముంబైలోనే ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. తరచూ ప్రయాణాల వల్ల కలిగే అలసట లేకుండా ఉండాలని అనుకున్నారట. ఈ సమయం షూటింగ్‌పై దృష్టి పెట్టడానికి తనకు సహాయపడుతుందని ఆయన భావిస్తున్నారని సమాచారం. రాకా మూవీలోని పాత్ర కోసం ఆయన శారీరకంగా పెద్ద మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రాకాలో తన పాత్ర కోసం ప్రతిరోజూ దాదాపు నాలుగు గంటల పాటు ప్రాస్థెటిక్ మేకప్‌పై గడుపుతున్నారని, ఆ తర్వాత దానిని తొలగించడానికి మరో రెండు గంటలు వెచ్చిస్తున్నారని సమాచారం. అందుకే ముంబైలోనే ఉంటే సమయం కాస్త కలిసొస్తుందని బన్నీ ఉన్నారట.అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ కొద్దిరోజుల క్రితం విడుదలై అందరి దృష్టినీ ఆకర్షించింది. అల్లు అర్జున్ సరికొత్త అవతారంలో కనిపించి సినిమాపైన బారీ బజ్‌ను క్రియేట్ చేశారు. ముంబైలోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం ఉంది. ఈ మూవీ ఆలస్యం అవుతుందనే వదంతులు ఉన్నప్పటికీ, సినిమా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేస్తారని భావిస్తున్నారు. ఈ చిత్రానికి విస్తృతమైన పోస్ట్-ప్రొడక్షన్ , విఎఫ్ఎక్స్ పనులు జరుగుతుండగా, చిత్ర బృందం 2027 ద్వితీయార్థంలో థియేటర్లలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. -
అల్లు- అట్లీ రాకా.. ఆ స్టార్ హీరో ఓకే చెప్పారా?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ రాకా. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో ఐకాన్ స్టార్ తోడేలు లాంటి లుక్‌లో కనిపించారు. ఈ పోస్టర్ చూస్తుంటే విలన్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.900 కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్గా కనిపించనుంది. అంతేకాకుండా రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కూడా ఉన్నారని టాక్ వినిపిస్తోంది.ఇదిలా ఉండగా.. రాకాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్‌గా మారింది. అట్లీతో జతకట్టి సూపర్ హిట్ కొట్టిన షారూఖ్ ఖాన్ ఈ మూవీలో కనిపించనున్నారని లేటేస్ట్ టాక్. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పాత్ర చేయడానికి బాలీవుడ్ బాద్షా ఇప్పటికే అంగీకరించారని సమాచారం. అట్లీతో షారూక్‌కు ఉన్న అనుబంధం వల్లే రాకా మూవీకి ఓకే చెప్పారని ఓ నివేదికలో వెల్లడైంది. అట్లీ తెరకెక్కించిన జవాన్‌లో షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన సంగతి తెలిసిందే.అందువల్లే ఈ మూవీలో నటించడానికి షారూక్ ఖాన్ దాదాపు ఓకే చెప్పారని టాక్. ఇదే నిజమైతే జవాన్ తర్వాత మరోసారి అట్లీతో కలిసి పని చేయనున్నారు. ఈ విషయంపై షారుక్ టీమ్ కొందరు సంప్రదించగా.. వారి నుంచి మాత్రం ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే గతంలో అల్లు అర్జున్ 'జవాన్' చిత్రంలో ఒక అతిథి పాత్రలో నటించాల్సి ఉండగా.. పుష్ప: ది రూల్ సినిమా షెడ్యూల్ వల్ల కుదరలేదు. దీంతో 'రాకా' మూవీతోనైనా వీరిద్దరిని స్క్రీన్‌పై చూసే అవకాశం ఆడియన్స్‌కు దక్కనుంది. షారుక్ ఖాన్ రాకాలో అతిథి పాత్రలో కనిపిస్తే ఈ ప్రాజెక్ట్ క్రేజ్ మరింత పెరగనుంది. -
రాకా.. బన్ని కెరీర్లోనే తొలిసారి!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయనకు తెలుగులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. వారందరిని మెప్పించే కథలపైనే బన్నీ ఫోకస్ పెట్టాడు. అందులో ఒకటి రాకా. అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో రూపుదిద్దుకొంటున్న తొలి సినిమా ఇది. రూ. 900 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక బన్నీ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. ఇందులో బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పుడు బయటకు వచ్చిన లుక్ విలన్‌ది. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్‌గా ఉంటుందట. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలు మొత్తం నలుగురు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే ఒక హీరోయిన్గా దీపికా పదుకొణె పేరు బయటకు వచ్చింది. మరో ముగ్గురు హీరోయిన్లలో రష్మిక, మృణాల్, జాన్నీ కపూర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో రష్మిక అల్రేడీ బన్నీతో కలిసి పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో నటించింది. మృణాల్, జాన్వీలు తొలిసారి బన్నీతో స్క్రీన్ చేసుకుంటున్నారు. ఇలా ఒకే సినిమాలో నలుగురు హీరోయిన్లతో కలిసి నటించడం బన్నీ కెరీర్లోనే తొలిసారి. కథ డిమాండ్ మేరకే నలుగురిని తీసుకున్నారట. అంతేకాదు ఈ నలుగురి పాత్రలు కూడా సినిమాలో కీలకం అట. ఒకవైపు కావాల్సినంత గ్లామర్‌ని చూపిస్తూనే.. మరోవైపు కథలో కీలకంగా వ్యవహరించేలా వీరి పాత్రలను తీర్చిదిద్దినట్లు సమాచారం. ఈ నలుగురూ బన్నీతో ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. -
అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..
-
నెంబర్‌వన్.. అల్లు అర్జున్ ఆలోచన అదేనా?
స్టార్స్ జీవితంలో ఒక భారీ విజయం దక్కడం సులభమే కావచ్చు... కానీ దానిని నిలబెట్టుకోవడం కొనసాగించడం మాత్రం అంత సులభం కాదు. టాలీవుడ్లో ప్రస్తుతం స్టార్ డమ్ అనేది చాలా అస్థిమితంగా మారింది. ఖచ్చితంగా నెంబర్ వన్ హీరో ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రేక్షకులు ఒక్కో ఏడాది ఒక్కో హీరో చిత్రానికి పట్టం కడుతుండడంతో నెంబర్లాట దోబూచులాటగా మారుతోంది.ఈ పరిస్థితిలో ప్రస్తుతానికి మాత్రం ఇటు కలెక్షన్స్ పరంగా చూసినా అటు రెమ్యునరేషన్ పరంగా చూసినా, అల్లు అర్జున్ నెం1గా నిలుస్తున్నాడనేది నిర్వివాదం. తాజాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన చిత్రం ’రాకా’ కోసం ఏకంగా రూ.300 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుని సమకాలీన హీరోల్లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బన్నీ. ఎవరూ ఊహించని విధంగా అప్పటి వరకూ 5, 6 స్థానంలో ఉన్న స్టైలిష్ స్టార్ కాస్తా ఒక్క ఉదుటున నెం1 ఐకాన్ స్టార్‌గా చేసింది పుష్పరాజ్ పాత్ర. ప్రస్తుతం అల్లు అర్జున్ హవా నడుస్తున్నప్పటికీ ఇది వన్ సినిమా వండర్ అనీ త్వరలోనే మరో టాప్ హీరో నెం1 ఛెయిర్‌ని ఆక్రమిస్తాడని సినీ పండితుల్లో పలువురు భావిస్తున్నారు. మరోవైపు బన్నీ మాత్రం ఈ ఊహాగానాలను పటాపంచలు చేయాలని, తన స్టార్ డమ్‌ని మరింత పెంచే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. కనీసం 2030 వరకూ తన ప్లేస్‌ని శాశ్వతం చేసుకునేలా తదుపరి ప్రాజెక్టులను ఆయన జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు.పుష్ప తర్వాత అల్లు అర్జున్ ఎంపికలు చూస్తే ఆ విషయం సులభంగా అర్ధమవుతుంది. జవాన్ లాంటి భారీ హిట్ ఇచ్చిన అట్లీని తన తదుపరి సినిమాకు ఎంపిక చేసుకోవడం ద్వారా తన భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పాడు. ఆ తర్వాత దక్షిణాదిలో భారీ హిట్స్‌కి కేరాఫ్‌గా నిలిచిన లోకేష్ కనగరాజ్, అదే విధంగా మళయాళ పరిశ్రమకు చెందిన బాసిల్ జోసెఫ్‌లను ఐకాన్ స్టార్ జోడీ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంతేకాకుండా అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులతో సైతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం, అతని రాబోయే ప్రాజెక్ట్‌లతో ముడిపడి ఉన్న ఇతర పేర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే విభిన్నమైన జానర్ల మిశ్రమాన్ని అందించడం ద్వారా భారతీయ చిత్రసీమలో తనదైన హవాను ఆయన కొనసాగించాలని ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతుంది.ఉత్కంఠభరితమైన కథనాలకు చిరునామా లాంటి సందీప్ రెడ్డి వంగా , విభిన్న తరహా యాక్షన్ విన్యాసాలకు కేరాఫ్ లాంటి ప్రశాంత్ నీల్ , జనరంజక చిత్రాలకు పేరొందిన త్రివిక్రమ్ శ్రీనివాస్ విలక్షణమైన శైలికి మరోపేరు లాంటి బాసిల్ జోసెఫ్, వైవిధ్యభరిత హీరోచిత కధలను తెరకెక్కించే లోకేష్ కనగరాజ్ ల వరకు ఆయన ఎంపిక వెనుక ఆలోచనల గాఢతను మనకు తెలియజెబుతాయి. ఈ దర్శకుల చిత్రాలు కమర్షియల్ సక్సెస్‌కు గ్యారెంటీతో పాటు అవకాశాన్ని బట్టి సెన్సేషన్‌ను కూడా సృష్టించగలవు. అయితే రానున్న రోజుల్లో ఇప్పటికే నెం1 కుర్చీకి అత్యంత సమీపంలో ఉంటూ, స్పిరిట్ వంటి సినిమాలతో దూసుకొస్తున్న ప్రభాస్ , రాజమౌళి సినిమా ద్వారా మహేష్ బాబు...లతో పాటు పలువురు టాప్ హీరోలు బన్నీ దక్కించుకున్న స్థానానికి గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. వీటిని తిప్పికొట్టేలా బన్నీ ఎంపికలు ఉంటాయా లేదా అనేది త్వరలోనే తేలుతుంది. -
Allu Arjun : 175 కోట్లు రెమ్యూనరేషన్..?
-
రాకా మూవీ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే?
అల్లు అర్జున్- అట్లీ కాంబోలో తొలిసారి వస్తోన్న మూవీ రాకా. బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ రివీల్ చేశారు. రాకా పేరుతో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. తోడేలు లుక్‌లో ఉన్న అల్లు అర్జున్ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఐకాన్ స్టార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా టైటిల్ రివీల్ వేళ టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఈ మూవీలో బన్నీ పారితోషికంపై తెగ చర్చ జరుగుతోంది. ఈ భారీ బడ్జెట్ మూవీకి ఐకాన్ స్టార్ ఎంత ఛార్జ్ చేస్తున్నారనే దానిపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం ఈ సినిమాకు అల్లు అర్జున్‌కు దాదాపు రూ.175 కోట్ల పారితోషికం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా చేస్తోన్న బాలీవుడ్ భామ దీపికా పదుకొణెకు రూ.25 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీలో మరో హీరోయిన్గా రష్మిక కనిపించనున్నారని టాక్. నేషనల్ క్రష్‌కు దాదాపు రూ. 5-7 కోట్లు చెల్లించనున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.పుష్ప-2 తర్వాత బన్నీ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుఖ్ ఖాన్‌తో 'జవాన్' తర్వాత అట్లీ డైరెక్ట్ చేస్తోన్న మూవీ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దాదాపు రూ. 700 కోట్లతో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బన్నీ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా దీపిక పదుకొణె, రష్మికలతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. -
అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ కు టెర్రిఫిక్ రెస్పాన్స్
-
అల్లు అర్జున్ రాకా.. అసలు ఆ టైటిల్ అర్థమేంటో తెలుసా?
టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన టైటిల్ వచ్చేసింది. అట్లీ- అల్లు అర్జున్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాకు ఫుల్ మాస్ టైటిల్ ఖరారు చేశారు. ఇవాళ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై రాకా అనే పేరుతో తెరకెక్కించునున్నారు. టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ టైటిల్ గురించి టాలీవుడ్లో నెట్టింట చర్చ మొదలైంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మనిషి, మృగం కలగలిపిన పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో పాటు బన్నీ నెగెటివ్ రోల్ చేయనున్నారని టాక్. అది చెప్పేందుకే రాకా పేరును ఎంచుకున్నారేమోనని కొందరు అంటున్నారు.మరికొందరేమో రాకా అంటే.. ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని కూడా అలానే పిలుస్తారని అంటున్నారు. ఎందుకంటే చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు అభిమానులు భావిస్తున్నారు. పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్‌పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు వెతుక్కుంటున్నారు. మరి అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ తెలిసేలా కనిపిచడం లేదు.The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
కేవలం సినిమా మాత్రమే కాదు.. అంతకు మించి: రాకాపై అట్లీ ట్వీట్
ఐకాన్ స్టార్ అభిమానులకు ఈ రోజు పండగే. బన్నీ బర్త్ డే సందర్భంగా అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు డైరెక్టర్ అట్లీ. ఎక్కడా లీక్ కాకుండా అల్లు అర్జున్- అట్లీ కాంబోలో వస్తోన్న మూవీ టైటిల్ రివీల్ చేశారు. బన్నీ పుట్టినరోజున మూవీ టైటిల్ ప్రకటించారు. అంతేకాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తొలిసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న మూవీకి రాకా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు.ఈ సందర్భంగా డైరెక్టర్ అట్లీ.. హీరో అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్ అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. రాకా కేవలం సినిమా మాత్రమే కాదన్నారు. కొన్నేళ్లుగా నా వెంట మోసుకొస్తున్న భాగమన్నారు. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఆలోచనతో ఉన్నా.. అది ఎప్పటికీ మసకబారకుండా చూసుకున్నానని అట్లీ ట్వీట్ చేశారు. అది నన్ను పరీక్షించడమే కాకుండా తీర్చిదిద్దేలా చేసిందన్నారు. ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచిందని రాసుకొచ్చారు. నిజం చెప్పాలంటే... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అట్లీ పోస్ట్ చేశారు. #Raaka isn’t just a film… it’s a part of me I’ve carried for years. For 18 years, I held on to one idea, never letting it fade.It tested me, shaped me, and stayed with me through everything. And honestly… this is just the beginning#HappyBirthdayAlluArjun sir@alluarjun… pic.twitter.com/UuKdpJRChs— atlee (@Atlee_dir) April 8, 2026 -
అందుకే బన్నీ గ్రేట్ అంటున్న టాలీవుడ్
-
రాజమౌళి చేయలేనిది.. ‘రాకా’ టీమ్ చేసింది!
సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. టైటిల్ ముందుగానే లీకవుతుంది. ఇలా షూటింగ్ మొదలవ్వగానే అలా లుక్ బయటకు వస్తుంది. చిత్ర యూనిట్ ఎంత గోప్యంగా ఉంచినా సరే.. ఏదో ఒక రకంగా లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లు అర్జున్-అట్లీ సినిమా విషయంలో ఇది జరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఒక్క లీకేజీ కూడా బయటకు రాలేదు. సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ముందే లీక్ చేసే మీడియా కూడా ఈ సినిమా టైటిల్ ని పసి గట్టలేకపోయింది. లెగసీ, వైల్డ్ ఫైర్, అయాన్, స్పార్క్..ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రానికి ‘రాకా’(Raaka) అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం అధికారికంగా ప్రకటించేవరకు ఎక్కడ బయటకు రాలేదు.ఎంతో గోప్యంగా షూటింగ్ మొదలుపెట్టే రాజమౌళి సైతం ఈ లీకేజీ భారీ నుంచి తప్పించుకోలేకపోయాడు. మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైటిల్..అధికారిక ప్రకటనకు ముందే బటయకు వచ్చేసింది. అలాగే మహేశ్ లుక్‌తో పాటు కొన్ని స్టిల్స్ కూడా ముందే నెట్టింట దర్శనమిచ్చాయి. అలాగే ‘ఫౌజీ’లోని ప్రభాస్ లుక్ కూడా ముందే లీకైపోయింది. ఈ లీకేజీని అరికట్టడంలో ‘రాకా’టీమ్ సక్సెస్ అయింది. (చదవండి: 'రాకా' పోస్టర్ రిలీజ్.. ఊహించని లుక్‌లో బన్నీ..)టైటిల్ విషయం చిత్ర యూనిట్‌కి కూడా ముందుగా చెప్పలేదట. నిర్మాతలతో పాటు అల్లు అర్జున్-అట్లీకి తప్పా..మిగతావారెవరికీ ఈ సినిమా టైటిల్ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మనిషి, మృగం కలగలిపిన బన్నీ లుక్‌కి సంబంధించిన సన్నీవేశాలను చాలా గోప్యంగా చీత్రీకరించారట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క లీకేజీ కూడా రాలేదు. ఈ విషయంలో ‘రాకా’ టీమ్ నుంచి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి. వాళ్లు తీసుకున్న జాగ్రత్తలను ఫాలో అయితే.. లీకేజీల బాధ నుంచి బయటపడతారు. రాకా విషయానికొస్తే.. ఈ చిత్రంలో బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రిలీజ్ చేసింది విలన్ లుక్. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్‌గా ఉంటుందని టాక్. మరి ఆ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో దీపికా పదుకొణె పేరు అధికారికంగా ప్రకటించారు. మరో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. The wait is over.Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026 -
అల్లు అర్జున్- అట్లీ మూవీ టైటిల్ ఇదే.. రాక్షసుడిగా బన్నీ లుక్!
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. అప్పటివరకు సౌత్‌లో ఫాలోయింగ్ తెచ్చుకున్న అతడు పుష్ప తర్వాత పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. నేషనల్ లెవల్లోనే కాదు ఇంటర్నేషనల్ లెవల్లోనూ గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ సినీ మ్యాగజైన్ ది హాలీవుడ్ రిపోర్టర్ కవర్ పైజీపైనా స్థానం సంపాదించుకున్నాడు. సినిమా కోసం ఎంతదూరమైనా వెళ్లే బన్నీ.. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.రాకాఈ మూవీకి లెగసీ, అయాన్, స్పార్క్.. ఇలా రకరకాల టైటిల్స్ పరిశీలించగా చివరాఖరకు ఓ మంచి టైటిల్‌ను ఫైనల్ చేశారు. నేడు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రానికి "రాకా" టైటిల్‌ను ప్రకటించారు. అలాగే పోస్టర్ కూడా వదిలారు. ఇందులో బన్నీ అరగుండుతో, తోడేలు వంటి చేయితో నెగెటివ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు పోస్టర్ చాలా వైవిధ్యంగా ఉందని, బన్నీ లుక్‌తో తమ కడుపు నింపేశారని చిత్రయూనిట్‌ను కొనియాడుతున్నారు.సినిమారాకా సినిమా విషయానికి వస్తే.. ఇది పునర్జన్మల కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమని సమాచారం. ఇందులో బన్నీ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ముందునుంచి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేడు రాక్షసుడిగా బన్నీ లుక్‌ను వదిలినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. #AA22xA6 is now #Raaka ⚔️Prepare yourself for a vision beyond limits ✨@alluarjun @Atlee_dir @deepikapadukone⁰#राका | #రాకా | #ರಾಕಾ | #ராக்கா | #രാക്ക | #রাকা | راکا# pic.twitter.com/ymTBHoOfpI— Sun Pictures (@sunpictures) April 8, 2026 చదవండి: నయన్ సడన్ సర్ప్రైజ్.. స్టేజ్‌పై భర్త ఎమోషనల్


