'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం'
తండ్రి పాత్రలో జగపతిబాబు.. అతడి ప్రత్యర్థి పాత్రలో, పాత పగలతో బుసలు కొట్టే మిర్చి సంపత్. వీళ్లిద్దరి పిల్లలు నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్. తన మనవరాలికి ఆకాశంలోంచి దిగొచ్చే రాజకుమారుడే కావాలనుకునే ఒక నాయనమ్మ.. వీళ్లందరి కాంబినేషన్ కలిపితే ''రారండోయ్ వేడుక చూద్దాం.'' ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. చైతూ సరసన రకుల్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ''మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం.. అన్నీ కలిపి మిక్సీలో వేసి కొడితే నువ్వు..'' అంటుంది నాగచైతన్య క్యారెక్టర్. సరదాగా మాట్లాడుకుందామని పిలిస్తే తనతో మాట్లాడకుండా నాన్న అంటాడేంటి, అతడికి తనకంటే నాన్నే ఎక్కువా అనుకునే రకుల్.. ''నాన్న ఎక్కువా ఏంటి... ఎక్కువే!'' అన్న సమాధానం. వీటన్నింటి మధ్య జరిగే ఒక చిన్నపాటి ఘర్షణ. చివరకు నాగచైతన్య కనుక్కున్న అతిపెద్ద విషయం ఏమిటంటే.. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం'!!
మధ్యలో ఆటవిడుపు కోసం చైతూ స్నేహితుడి పాత్ర పోషించే వెన్నెల కిషోర్ చెప్పే సిద్ధాంతం. ''ఎ రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఈజ్ లైక్ పులి అండ్ కుందేలు.. పులి కుందేలుకి ఎదురెళ్లినా దానికే రిస్కు, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికే రిస్కు'' అనే ఓ ఫిలాసఫీని కిషోర్ తనదైన స్టైల్లో చెబుతాడు. ఈ మధ్యలో మిర్చి సంపత్‌కు, జగపతిబాబుకు మధ్య ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న వైరం బయట పడుతుంది. ''నేను మోసం అనే నమ్ముతున్నా.. చంపడమో, చావడమో'' అంటాడు సంపత్. తనకు చైతూయే కావాలని రకుల్ తన తండ్రిని అడుగుతుంటే.. అతడు మాత్రం 'వద్దన్నానా' అని ఓ రేంజిలో చెబుతాడు. భ్రమరాంబ (రకుల్ పాత్ర పేరు)ను పెళ్లి చేసుకోబోయేది తానేనంటూ ముఖం మీద గాయాలతో చైతూ చెప్పడంతో రెండు నిమిషాల ట్రైలర్ ముగుస్తుంది. ఒకవైపు కుటుంబ కథా చిత్రం లాగ కనిపిస్తూనే.. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటుతో కూడిన బరువైన సన్నివేశాలు, సంపత్-జగపతి బాబు ఫ్లాష్‌బ్యాక్ వైరం, ఫైటింగులు వీటన్నింటితో కలిపి సినిమాలో ఏదో ఉందని అని జనాలతో అనిపించే ప్రయత్నం ట్రైలర్లో కనిపించింది. ఇక వేడుక చూసేందుకు మనం కూడా సిద్ధం కావాల్సిందే మరి.
And here it is #RarandoiVedukaChudam theatrical trailer https://t.co/g6BIHjAtro
— chaitanya akkineni (@chay_akkineni) 13 May 2017