నేనున్నా.. మీకేం కాదు
సాక్షి, కడప : తన రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలతో పాటు ప్రజలలో భరోసా నింపారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డి, జయరాములు, జెడ్పీ చైర్మన్ రవి, వైఎస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మన్ తిరుపేల రెడ్డి, మాజీ మున్సిపల్ వైఎస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి, మాసీమ బాబుతో పాటు నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ను కలుసుకున్నారు.
డిపాజిటర్లకు అన్యాయం చేసిన అక్షయ గోల్డ్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానన్నారు. జర్నలిస్ట్‌లకు హెల్త్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో కూడా మాట్లాడతామన్నారు. కడప, పులివెందులకు చెందిన ముస్లింలు ఈ సందర్భంగా జగన్‌తో ప్రత్యేకంగా భేఠీ అయ్యారు. వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు.