రాంచీ రేస్ గెలుపు
రాంచీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్)లో భాగం గా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాంచీ రేస్ 1-0 తేడాతో ఉత్తరప్రదేశ్ విజార్డ్స్‌పై నెగ్గింది. ఆట ప్రారంభమైన 18వ నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌ను జాక్సన్ గోల్‌గా మలిచాడు. మ్యాచ్ ఆద్యంతం ఈ ఆధిక్యాన్ని నిలుపుకోవడంతో రాంచీ విజయం సాధించింది.
కళింగపై ముంబై విజయం
ముంబై: హెచ్ఐఎల్లో దబాంగ్ ముంబై తమ తొలి విజయాన్ని అందుకుంది. కళింగ లాన్సర్స్‌తో స్థానిక మహీంద్ర స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో గెలిచింది. 18వ నిమిషంలో జెరెమీ హేవర్డ్, 42వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ ముంబైకి గోల్స్ అందించారు. కళింగ తరఫున 42వ నిమిషంలో ఆమిర్ ఖాన్ గోల్ చేశాడు.