ఉగ్రవాద సోదరులు అరెస్టు
బెర్లిన్: ఉగ్రవాదులుగా భావిస్తున్న ఇద్దరు జర్మనీ సంతతికి చెందిన మోరాకో సోదరులను జర్మనీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరికి ఇస్లామిక్ స్టేట్, ‘నుస్రా ఫ్రంట్’ అనే ఉగ్రవాద సంస్థల్లో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ పోలీసులు వారిని రచిద్(25), ఖలీద్(24) జర్మన్ సంతతికి చెందిన మోరాకన్లుగా గుర్తించారు.
వీరిద్దరూ కూడా 2013లో సిరియాకు వెళ్లి ఉగ్రవాదంలో శిక్షణ తీసుకున్నారని, అనంతరం రచిద్ ‘అల్ నుస్రా’లో చేరాడని అతడిపై ఇప్పటికే కిడ్నాపింగ్, గూఢచర్యం ఆరోపణలు ఉన్నట్లు కోర్టుకు చెప్పారు. ఇస్లామిక్ స్టేట్లో చేరి పలు ఆ సంస్థ చేసిన పలు దాడుల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక అతడి సోదరుడు ఖలీద్ మాత్రం నేరుగా ఇస్లామిక్ స్టేట్లో చేరి ఉగ్రవాద చర్యలకు పూనుకున్నట్లు స్పష్టం చేశారు.