Radha yatra devotees
-
జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు ఎలా!?
సాక్షి, న్యూఢిల్లీ : ‘దీన్ని మేం అనుమతించినట్లయితే ఆ భగవంతుడైన జగన్నాథుడు మమ్మల్ని క్షమించరు’ అని ఒడిశాలో ప్రతి ఏటా జరిగే పూరి జగన్నాథ స్వామి రథయాత్రను ఈసారి కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అనుమతించాలా, లేదా? అన్న అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్య ఇది. ప్రతి ఏటా జరిగే జగన్నాథుడి రథయాత్రలో పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు పాల్గొంటారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేటి పరిస్థితుల్లో అంత మంది భక్తులను కట్టడి చేయడం తమ వల్ల కాదంటూ ఒడిశా ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ పరిస్తితుల్లో రథయాత్రకు అనుమతిస్తే ఆ జగన్నాథుడే క్షమించరంటూ సుప్రీంకోర్టు జూన్ 18వ తేదీన స్టే ఉత్తర్వులు జారీ చేసింది. (ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం) జూన్ 22వ తేదీ, సోమవారం ఈ అంశం మళ్లీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు అనూహ్యంగా జగన్నాథ రథయాత్రపై స్టే ఉత్తర్వులను ఎత్తివేశారు. 500 మంది చొప్పున మూడు రథాలను లాగేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టు అనేక షరతులను విధించింది. రథానికి 500 మంది అంటే మూడు రథాలకు కలిసి 1500 మంది భక్తులవుతారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, సిబ్బంది, అధికారులు, పోలీసు సిబ్బందిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. రథాలను లాగే భక్తులను ఎలా ఎంపిక చేయాలి? వారికి కరోనా లేదని నిర్ధారించడానికి వైద్య పరీక్షలు ఎలా నిర్వహించాలి? రథయాత్ర జరగుతుందని తెల్సిన భక్తులు లక్షలాదిగా కాకపోయినా వేలాదిగా తరలి వస్తే? వారిని ఎలా అడ్డుకోవాలి? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య దాదాపు నాలుగున్నర లక్షలకు చేరుకున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలు కలిగిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో అంతమంది భక్తులకు ఎలా కరోనా పరీక్షలు నిర్వహించగలమని అధికారులు తలపట్టుకున్నారు. ఈ రకంగా అనుమతులు ఇవ్వడం వల్ల ఇతర పరిణామాలకు దారితీస్తాయన్న అభిప్రాయం ఉంది. అహ్మదాబాద్‌లో జగన్నాథుడి రథయాత్రను నిర్వహించేందుకు తమకు అనుమతించడంటూ గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలవడమే నిదర్శనమని నిపుణుల అభిప్రాయం. (ఆగస్టు వరకు రైలు ప్రయాణాలు లేనట్టేనా?) -
జగన్నాథ రథయాత్రకు షరతులతో అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్రకు లైన్ క్లియర్ అయింది. రథయాత్రకు షరతులతో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ కమిటీ సమన్వయంతో యాత్ర చేపట్టాలని స్పష్టం చేసింది. జగన్నాథ దేవాలయ కమిటీ సరైన నియంత్రణ విధించాలని, భక్తులు లేకుండా రథయాత్ర నిర్వహించాలని, రథయాత్రను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. పెద్దసంఖ్యలో భక్తులు రాకుండా చూసుకోవాలని, ప్రజారోగ్యం విషయంలో రాజీపడరాదని స్పష్టం చేసింది. జూన్ 18న ఇచ్చిన తీర్పును సవరించిన సర్వోన్నత న్యాయస్ధానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు అంతకుముందు సుప్రీంకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ గతంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గు చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని పిటిషనర్ చేసిన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం జూన్ 18న పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధించింది. అయితే యాత్ర నిర్వహణపై సానుకూల పరిస్థితులను లోతుగా సమీక్షించకుండా సుప్రీం తీర్పు వెల్లడించిందని కొన్ని వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఆ వర్గాలు 17 సవరణలతో పిటిషన్లు దాఖలు చేశాయి. ఆయా పిటిషన్లు పరిశీలించిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది. (ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం) -
ఆ దేవుడే మనల్ని క్షమించడు: సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : పూరీ జగన్నాథ రథయాత్రపై సందిగ్ధత వీడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో యాత్ర నిర్వహణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రథయాత్ర నిర్వహిస్తే ఆ దేవుడే మనల్ని క్షమించడు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు భారతీయ వికాస్ పరిషత్ (బీవీపీ) దాఖలు చేసిన స్పెషల్‌లీవ్ పిటిషన్‌పై గురువారం సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. భౌతిక దూరం నిబంధనకు ప్రాధాన్యం కల్పించేందుకు యాత్ర నిర్వహణలో యాంత్రిక శక్తి, ఏనుగుల వినియోగం పట్ల హైకోర్టు మొగ్గం చూపడం ఆలయ సంప్రదాయ, చట్ట వ్యతిరేకమని బీవీపీ కోర్టుకు వివరించింది. (ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం) పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పూరీజగన్నాథ రథయాత్రపై స్టే విధిస్తూ తీర్పును వెలువరించింది. కాగా విపత్కర పరిస్థితుల్లో జగన్నాథుని రథయాత్ర పలుమార్లు నిలిపి వేసినట్లు చారిత్రాత్మక దాఖలాలు ఉన్నాయి. గడిచిన 452 ఏళ్లలో 32 సార్లు వాయిదా పడినట్లు పిటిషినర్ సంస్థ అధ్యక్షుడు సరేంద్ర పాణిగ్రహి సుప్రీంకోర్టును వివరించారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రాష్ట్రమంత్రి మండలి గురువారం సాయంత్రం భేటీ కానున్నట్లు సమాచారం. -
ఆదిదంపతుల రథోత్సవం
-
కనులపండువగా సాగిన ధర్మప్రచార రథయాత్ర
పగిడ్యాల(కర్నూలు జిల్లా): లోక క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీశైల భ్రమరాంబా మల్లికార్జున దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం మండల పరిధిలోని నెహ్రూనగర్ గ్రామంలో కొనసాగిన ధర్మప్రచార రథయాత్ర భక్తుల జనసందోహాం మధ్య కనులపండువగా సాగింది. సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన రథయాత్రకు గ్రామంలోని ప్రజలు పాల్గొని భక్తిప్రపత్తులను ప్రదర్శించారు. గ్రామానికి చేరుకున్నా ధర్మప్రచార రథానికి సర్పంచ్ శేషమ్మ, సింగిల్‌విండో ఛైర్మన్ కట్టుబడి శ్రీనివాసులునాయుడు, ఎంపీటీసీలు రంగన్న, పద్మావతమ్మ, గ్రామపెద్దలు లోకానందరెడ్డి, మండ్ల సుధాకర్, సత్యమయ్యశెట్టిలు ఘన స్వాగతం పలికారు. పడమర నెహ్రూనగర్ నుంచి తూర్పు నెహ్రూనగర్‌లోని ఎల్లంబావి, పీకే ప్రాగటూరు వరకు భక్తుల కేరింతల మద్య బాణా సంచా పేల్చుతూ మంగళ వాయిద్యాలు, భాజభజంత్రీలు, తప్పెట్లతో పెద్ద ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్థానిక శ్రీరాములు దేవాలయం వద్ద శ్రీ భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల కళ్యాణ మహోత్సవ వేడుకలను దేవస్థాన అర్చకులు వైభవోపేతంగా జరిపించారు. ఈ వేడుకలను తిలకించడానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు నిశ్చయ తాంబులాదులను సమర్పించి భక్తిని చాటుకున్నారు.