రథసప్తమికి ముమ్మర ఏర్పాట్లు
జి.మామిడాడ (పెదపూడి) : పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలో శ్రీ సూర్యనారాయణ మూర్తి జయంతి, రథసప్తమిని శుక్రవారం వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ, ఈవో, ఆలయ ధర్మకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ మంగళాశాసనాలతో ఆలయంలో శుక్రవారం నుంచి రథ సప్తమితో ప్రారంభమైయ్యే కార్యక్రమాలు ఈ నెల 11 వరకు జరుగుతాయి. 7న స్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో పూజలు, దేవేరులతో సూర్యనారాయణుని ఉత్సవ విగ్రహాల ఆలయ ప్రదక్షిణ చేయనున్నారు. రథోత్సవం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభిస్తారు. ఆలయ కమిటీ, ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామస్తులు, యూత్ స్వామి రథాన్ని లాగనున్నారు. పెదపూడి ఎస్సై వీఎల్వీకే సుమంత్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు చేస్తున్నారు.
రథసప్తమి రోజున ఆలయంలో జరిగే కార్యక్రమాలు వివరాలు
తెల్లవారు జామున 4.00 గంటలకు స్వామివారిని మేల్కొలుపు, నిత్యార్చన, నవకలçశ స్నపనం అలంకరణ
5.45 గంటల నుంచి 9 గంటల వరకు భక్తులు,విద్యార్థులు సూర్యనమస్కారాలు వేయుట
6.00 గంటలకు విశేష ఆరాధన
6.30 గంటల నుంచి స్వామి వారు భక్తులకు దర్శనం
1.30 గంటలకు స్వామివారి రథోత్సవ ప్రారంభం
6.30 గంటలకు స్వామివారి రథోత్సవం ఆలయానికి చేరుట.