radio host
-
ద్రౌపదిగా వినిపిస్తా!
మహాభారతంలో ద్రౌపది పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ పాత్రలో వినిపించడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి. వావ్.. మరి ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు? పాండవులుగా నటించేదెవరు? కౌరవుల మెయిన్ టీమ్ కౌన్? ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్లోకి వస్తే వెంటనే ఫుల్స్టాప్ పెట్టండి. ఎందుకంటే.. ఇది సినిమానో, టీవీ సీరియలో, వెబ్ సిరీసో కాదు. రేడియోలో ‘మహాభారతం’ వినబోతున్నాం. ఇందులో ద్రౌపది పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారు శిల్పా శెట్టి. ‘‘నాలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. చిన్నప్పుడు బీఆర్ చోప్రా మహాభారతం మాత్రమే టీవీలో చూసే చాన్స్ ఉండేది. అందులో ద్రౌపది పాత్ర చాలా బాగుంటుంది. ఈ పాత్రకు వాయిస్ అందిచ బోతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు శిల్పా. వెండితెరపై హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అలాగే బుల్లితెరపై కూడా సత్తా చాటారు శిల్పా. ఇప్పుడు రేడియో ప్లాట్ఫామ్లోకి ద్రౌపది పాత్రతో ఫస్ట్ టైమ్ ఎంట్రీ ఇస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఆప్నే’ సినిమా తర్వాత శిల్పాశెట్టి మరో ఫుల్ లెంగ్త్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. -
లైవ్‌లోనే పండంటి బిడ్డకు జననం
ఓ రేడియో ప్రజెంటర్ తాను లైవ్ షోలో ఉండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మధురమైన క్షణాలని కూడా ఈ రేడియో ప్రజెంటర్ లైవ్‌లో తన శ్రోతలతో పంచుకుంది. సెయింట్ లూయిస్ నగరంలోని ''ది ఆర్చ్ స్టేషన్''లో కాస్డేడే ప్రోక్టర్ ఉదయం వ్యాఖ్యాతగా పనిచేస్తోంది. సోమవారం రోజు ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి విభాగంతో పనిచేసే తమ రేడియో స్టేషన్, సిజేరియన్ విభాగం ద్వారా ఆమె బిడ్డ జననాన్ని ప్రసారం చేసింది. రెండు వారాల ముందుగానే బిడ్డ జన్మించినట్టు ప్రోక్టర్ చెప్పారు. రేడియో శ్రోతలతో తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను పంచుకోవడం చాలా అద్భుతంగా ఉందని ప్రోక్టర్ ఆనందం వ్యక్తంచేశారు. ప్రతి రోజూ లాగా తన జీవితం గురించి అన్ని విషయాలను రేడియో శ్రోతలతో పంచుకునే తాను.. ఈ విషయాన్ని కూడా శ్రోతలకు ఎయిర్‌లోనే తెలిపానన్నారు. రేడియో అభిమానులు సైతం బేబికి పేరు పెట్టడంలో ఫుల్‌గా పోటీపడుతున్నారు. 12 సిల్లీ పేర్లను, 12 పేర్లను కపుల్ ఎంపికచేశారని ది రివర్‌ఫ్రంట్ టైమ్స్ న్యూస్‌పేపర్ ప్రొగ్రామ్ డైరెక్టర్ స్కాట్ రోడి చెప్పారు. ఎయిర్‌లోనే జన్మనివ్వడం ఓ మ్యాజికల్ మూమెంట్ అని ప్రోక్టర్ కో హోస్ట్ స్పెన్సార్ గ్రేవ్స్ అన్నారు. ప్రస్తుతం ప్రోక్టర్ ప్రసూతి సెలవులు తీసుకోనున్నారు. -
లైవ్‌లో మాట్లాడుతుండగా.. రేడియో జాకీ హత్య
రియోడిజనీరో: బ్రెజిల్లో దారుణ ఘటన జరిగింది. ఓ రేడియో జాకీని దుండగులు అతి కిరాతకంగా కల్చి చంపారు. లైవ్ కార్యక్రమం నిర్వహిస్తుండగానే రేడియో స్టేషన్లోకి ప్రవేశించిన ఇద్దరు ముసుగులు ధరించిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే.. జోవా వెల్డసిర్ డీ బోర్బా(52) బ్రెజిల్ రేడియో డిఫ్యుసొరా ఏఎమ్లో వ్యాఖ్యాతగా పనిచేస్తున్నాడు. ఇంతకు ముందు 10 ఏళ్లుగా నేర సంఘటనలను రిపోర్ట్ చేసే కార్యక్రమాలు నిర్వహించిన బోర్బా ఇటీవలే సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రేడియో కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన బోర్బాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ సమయంలో బోర్బా పాటు ఉన్న సహోద్యోగి ఈ ఘటనపై మాట్లాడుతూ.. సిగరెట్ తాగడానికి తాను బయటకు వెళ్లి వచ్చే సరికి దుండగులు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసులు వెల్లడిచారు. క్రైమ్ ఘటనలను రిపోర్ట్ చేసే సమయంలోనే బోర్బాకు నేరస్తుల నుంచి పలుమార్లు హెచ్చరికలు వచ్చాయని తెలుస్తోంది. గత ఏడాది కాలంగా బ్రెజిల్లో ఎనిమిది మంది రేడియో వ్యాఖ్యాతలు హత్యకు గురయ్యారని బ్రెజిల్ అసోసియేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ప్రజెంటర్స్ వెల్లడించింది.