లైవ్‌లోనే పండంటి బిడ్డకు జననం
ఓ రేడియో ప్రజెంటర్ తాను లైవ్ షోలో ఉండగానే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ మధురమైన క్షణాలని కూడా ఈ రేడియో ప్రజెంటర్ లైవ్‌లో తన శ్రోతలతో పంచుకుంది. సెయింట్ లూయిస్ నగరంలోని ''ది ఆర్చ్ స్టేషన్''లో కాస్డేడే ప్రోక్టర్ ఉదయం వ్యాఖ్యాతగా పనిచేస్తోంది. సోమవారం రోజు ఆమెకు ఒక్కసారిగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆసుపత్రి విభాగంతో పనిచేసే తమ రేడియో స్టేషన్, సిజేరియన్ విభాగం ద్వారా ఆమె బిడ్డ జననాన్ని ప్రసారం చేసింది. రెండు వారాల ముందుగానే బిడ్డ జన్మించినట్టు ప్రోక్టర్ చెప్పారు.
రేడియో శ్రోతలతో తన జీవితంలో అత్యంత మధురమైన క్షణాలను పంచుకోవడం చాలా అద్భుతంగా ఉందని ప్రోక్టర్ ఆనందం వ్యక్తంచేశారు. ప్రతి రోజూ లాగా తన జీవితం గురించి అన్ని విషయాలను రేడియో శ్రోతలతో పంచుకునే తాను.. ఈ విషయాన్ని కూడా శ్రోతలకు ఎయిర్‌లోనే తెలిపానన్నారు. రేడియో అభిమానులు సైతం బేబికి పేరు పెట్టడంలో ఫుల్‌గా పోటీపడుతున్నారు. 12 సిల్లీ పేర్లను, 12 పేర్లను కపుల్ ఎంపికచేశారని ది రివర్‌ఫ్రంట్ టైమ్స్ న్యూస్‌పేపర్ ప్రొగ్రామ్ డైరెక్టర్ స్కాట్ రోడి చెప్పారు. ఎయిర్‌లోనే జన్మనివ్వడం ఓ మ్యాజికల్ మూమెంట్ అని ప్రోక్టర్ కో హోస్ట్ స్పెన్సార్ గ్రేవ్స్ అన్నారు. ప్రస్తుతం ప్రోక్టర్ ప్రసూతి సెలవులు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment