ఆలయాలు కిటకిట..
మంత్రాలయం: ప్రముఖ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తజనులు పోటెత్తారు. శుక్రవారమూ భక్తుల రద్దీ కొనసాగింది. రాఘవేంద్రుల దర్శనార్థం తమిళనాడు, కర్ణాటక ప్రాంతం నుంచి భారీగా తరలివచ్చారు. మూలబృందావన దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించారు. పరిమళ ప్రసాదం, పంచామృతాభిషేకం, అన్నపూర్ణ భోజనశాల, తుంగానదీ తీరం, మంచాలమ్మ దర్శన క్యూలైన్లు భక్తులతో రద్దీగా కనిపించాయి.
ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల రథోత్సవాలు, పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు మూలరాముల పూజలు, బృందావనం, మంచాలమ్మ అలంకరణలు భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల్లో ఏఏవో మాదవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, జోనల్ మేనేజర్ శ్రీపతిఆచార్, సీఐ నాగేశ్వరావు, పీఆర్వో రాఘవేంద్రరావు, అసిస్టెంట్ పీఆర్వో వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.