మూలాలు కనుక్కోండి: రాఘవాచారి
తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మూలాలను కనుక్కొని వారి కుటుంబాలను ఆదుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి పభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం అచ్చంపేట టీఎన్జీవో భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలు, ప్రజా ప్రతినిధులు రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలపై కథనాలు, వార్తలను మీడియాలో రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వచ్చే నెల 13న నిర్వహించ తలపెట్టిన పాలమూరు రైతు గోస సభకు సంబంధించిన కరపత్రాలను ఈ సందర్భంగా ఆయన విడుదల చేశారు.