‘పొన్నాల’ నియామకంపై నిరసన
యువకుడి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య నియామకాన్ని నిరసిస్తూ సంజయ్‌గాంధీ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు రాఘవగౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జేబులో జాతీయ జెండాను పెట్టుకొని సోమవారం ఉదయం ఆయన గాంధీభవన్‌లోకి ప్రవేశించాడు.
భవనం పైకి ఎక్కిన అతను... అవినీతిపరుడైన పొన్నాలను తొలగించాలంటూ నినాదాలు చేశాడు. లేకుంటే ఆత్మహత్యకు పాల్పడతానని బెదిరించాడు. పోలీసులు అతన్ని కిందకి దింపి బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.