ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతికి మోదీ సంతాపం
న్యూఢిల్లీ: బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవేంద్రన్ గణేశ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మతిలేని హింసాకాండకు యువకుడి జీవితంగా అర్ధాంతరంగా ముగిసిపోయిందని ట్విటర్ లో పేర్కొన్నారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో విదేశీగడ్డపై ఉద్యోగానికి వెళ్లిన యువకుడిని ముష్కర మూకలు పొట్టన పెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాఘవేంద్రన్ కుటుంబానికి మోదీ సంతాపం తెలిపారు.
ఈనెల 22న బ్రసెల్స్ మెట్రోస్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో రాఘవేంద్రన్ మృతి చెందినట్టు సోమవారం నిర్ధారించారు. బ్రసెల్స్ మెట్రోస్టేషన్ తోపాటు విమానాశ్రయంలో ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లలో 35 మంది మృతి చెందారు. గణేశ్ అవశేషాలను బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు నేడు అప్పగించే అవకాశముంది.
A young life, full of hope & promise cut short by mindless violence... condolences to family of Raghavendran, who lost his life in Brussels.
— Narendra Modi (@narendramodi) 29 March 2016