పూరీలో ఈటల సైకత శిల్పం
ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు పార్టీ నేతలు, కరీంనగర్ జిల్లా నాయకులు ఆదివారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పాలు చేసే సుదర్శన్ పట్నాయక్ చేత ఈటలకు టీఆర్ఎస్ నేత రఘు వీర్‌సింగ్ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బడ్జెట్లో అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసిన ఈటలను ‘తెలంగాణ పూలే’గా అభివర్ణిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.