rahula gandhi
-
వయనాడ్‌ను వదులుకున్న రాహుల్ .. ఉప ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు.దీంతో వయనాడ్ (కేరళ), రాయ్‌బరేలీ (యూపీ) స్థానాల్లో ఒక నియోజకవర్గాన్ని ఆయన వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై తాను ఎటూ తేల్చుకోలేకపోతున్నానంటూ ఇటీవల రాహుల్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, తన నిర్ణయం రెండు వర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని అన్నారు. ఈ తరుణంలో వయనాడ్ స్థానాన్ని వదులుకున్నట్లు రాహుల్ గాంధీ అధికారింగా ప్రకటించారు. రాహుల్ రాజీనామాతో వయనాడ్‌లో జరిగే ఉప ఎన్నికల్లో ఆయన సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం అనివార్యమైంది.ఈ సందర్భంగా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాయ్ బరేలితో గాంధీ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉంది.వయనాడ్ సీటుకు రాహుల్ రాజీనామా చేస్తారు. ఆస్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు’ అని ఖర్గే వెల్లడించారు.‘వయనాడ్‌తో నాకు అనుబంధం ఉంది. జీవితాంతం వయనాడ్ నాకు గుర్తుంటుంది. ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేస్తారు. కష్ట కాలంలో వయనాడ్ నుంచి నన్ను గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.‘వయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నా..రాయ్ బరేలిలో నా సోదరుడికి ఎప్పుడు మద్దతుగా ఉంటా’ అని ప్రియాంక గాంధీ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అరంగేట్రంపై గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఆమె అమేథీ లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై సుదీర్ఘ ఉత్కంఠకు తెరదించుతూ రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకే ఆమె పోటీకి దూరమైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అయితే, ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని అన్నారు. తాజా రాహుల్ గాంధీ వయనాడ్‌కు రాజీనామా చేయడంతో..ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగ్రేటం అనివార్యమైంది. -
‘హత్య చేసేందుకే గన్మెన్లు తొలగించారు’
శంషాబాద్ : అర్ధరాత్రి గన్మెన్లను తొలగించడం మమ్మల్ని హత్య చేసేందుకేనని అనర్హత వేటుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లు ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్లపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో వారు కేంద్ర ఎన్నికల కమిషనర్, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసేందుకు బుధవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు ఎయిర్‌పోర్టులో విలేకరులతోమాట్లాడుతూ.. టీఆర్ఎస్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఒక్క నిరుద్యోగికీ ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని అనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. కాంట్రాక్టులు ఆంధ్రాప్రాంత నాయకులకు ఇచ్చి కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గవర్నర్ కుర్చీలను లాగేసి, శాసనమండలిలో టేబుల్‌పై ఎక్కి కొట్టినప్పుడు ఎవరినీ కూడా అనర్హులుగా ప్రకటించలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దుచేసే హక్కు ఈయనకు ఎక్కడిదని సూటిగా అడిగారు. -
'డీఎస్ కు ప్రజలే బుద్ధి చెబుతారు'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లిన డి.శ్రీనివాస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో డీఎస్ పార్టీ మారిన అంశాలపై వివరించారు. బంగారు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన డీఎస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని రవి అన్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోందని రవి ఈ సందర్భంగా ఆయన వారితో చెప్పారు.