ఇలియానాపై నాకెలాంటి ఈర్ష్య లేదు.. దానికోసమే ప్రయత్నించా!: వాణి కపూర్
రైడ్.. 2018లో అజయ్ దేవగన్ (Ajay Devgn) హీరోగా రాజ్‌కుమార్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే రైడ్ 2 (Raid 2 Movie). ఇందులో మరోసారి అజయ్ దేవ్‌గణ్ హీరోగా, రాజ్‌కుమార్ గుప్తా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే హీరోయిన్ మాత్రం మారింది. తొలి భాగంలో ఇలియానా కథానాయికగా ఉండగా రెండో భాగంలో మాత్రం ఆమె స్థానంలో వాణీ కపూర్‌ను ఎంపిక చేశారు.సేమ్ ఇక్కడ కూడా..ఇలియానా (Ileana D'Cruz)ను ఎందుకు తప్పించారన్న ప్రశ్నలపై అజయ్, వాణికపూర్ స్పందించారు. రైడ్ 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ దేవ్‌గణ్ మాట్లాడుతూ.. మీరు చాలా హాలీవుడ్ సినిమాలు చూసే ఉంటారు. జేమ్స్‌బాండ్ ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాల్లో జేమ్స్‌బాండ్ ఒక్కరే ఉండరు. ఆ పాత్ర కొనసాగుతుంది కానీ నటులు కాదు. ఎప్పటికప్పుడు జేమ్స్‌బాండ్ రోల్‌లోకి కొత్తవాళ్లు వస్తుంటారు. అదే ఇక్కడ కూడా జరిగింది అని క్లారిటీ ఇచ్చాడు.ఇలియానాపై అసూయ లేదువాణీ కపూర్ (Vaani Kapoor) మాట్లాడుతూ.. రైడ్ 1 సినిమాలో హీరోయిన్గా చేసినవారిపై నాకెలాంటి ఈర్ష్య లేదు. మా ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. రచయిత, దర్శకుడు నన్ను సంప్రదించారు. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నేను ప్రయత్నించాను. అంతే.. ఈ సినిమాలో నాలో మరో కోణాన్ని చూస్తారు. ఈ పాత్ర నాకు కొత్తగా ఉంది అని చెప్పుకొచ్చింది.సినిమా రిలీజ్ ఎప్పుడంటే?రైడ్ 2 విషయానికి వస్తే.. ఇందులో అజయ్.. ఐఆర్ఎస్ అధికారి అమయ్ పట్నాయక్‌గా కనిపించనున్నాడు. రితేశ్ దేశ్‌ముఖ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పాఠక్, కుమార్ మంగత్ పాఠక్, భూషణ్ కుమార్, గౌరవ్ నంద, క్రిషణ్ కుమార్, ప్రగ్యా సింగ్ నిర్మించారు. రైడ్ 2 మే 1న విడుదల కానుంది. ఈ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చదవండి: నేను నివసించని ఇంటికి రూ.1 లక్ష కరెంట్ బిల్లు.. కంగనా షాక్