Railway contractor
-
ఓటేస్తారా... ఇళ్లు కూల్చమంటారా?
సాక్షి, నెల్లూరు (వీఆర్సీసెంటర్): రైల్వే స్థలాల్లో 40 ఏళ్లుగా స్థిర నివాసాలను ఏర్పర్చుకొని జీవనం సాగిస్తున్న వందలాది కుటుంబాలకు బెదిరింపుల పర్వం ఎదురవుతోంది. అండగా ఉండాల్సిన పాలకులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి ఓటేయకపోతే ఇళ్లు కూల్చేస్తామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.10 వేలు తీసుకొని వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలంటూ రైల్వే కాంట్రాక్టర్లు.. తామిచ్చిన అపార్ట్మెంట్లను తీసుకొని రోజూ రూ.30 దాచుకొని నెలకు రూ.1800 చెల్లించాలని, లేని పక్షంలో తామేమీ చేయలేమని అధికార పార్టీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక రైల్వే నిర్వాసితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ తీసుకోవాల్సిందే.. ఇళ్లు కోల్పోయిన వారికి జనార్దన్‌రెడ్డికాలనీలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో ఇళ్లు కేటాయిస్తామని, దీనికి గానూ నెలకు రూ.1800 మేర చెల్లించాలని అధికార పార్టీ నేతలు ఉచిత సలహా ఇచ్చారు. అయితే నిర్వాసితులు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కొత్తూరులోని వైఎస్సార్‌నగర్‌లో పాడుబడిన ఇళ్లను ఇస్తామని, అక్కడికి వెళ్లకపోతే తామేమీ చేయలేమంటూ బెదిరించారు. తాజాగా కొన్ని రోజుల నుంచి రైల్వే కాంట్రాక్టర్ల బెదిరింపు పర్వం ప్రారంభమైంది. రూ.10 వేలను ఇస్తామని, వెంటనే ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు. దీనిపై నిర్వాసితులు ఆందోళనతో ఉన్నారు. మొదటి నుంచి అండగా ఎమ్మెల్యే అనిల్ మూడో రైల్వే లైన్ పనులకు గతేడాది రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వెంకటేశ్వరపురం, బర్మాషెల్‌గుంట, తదితర ప్రాంతాల్లో 40 ఏళ్ల నుంచి స్థిర నివాసాలు ఏర్పర్చుకున్న 500 గృహాలకు హద్దులు నిర్ణయించి ఇళ్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే తమకు ప్రత్యామ్నాయంగా నివాస స్థలాలను చూపించాకే తొలగించాలంటూ వీరు స్పష్టం చేశారు. వీరికి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ అండగా నిలిచి హైకోర్టును ఆశ్రయించారు. స్టే రావడంతో ఇళ్ల తొలగింపు ఆగిపోయింది. జనార్దన్‌రెడ్డికాలనీలో గల 60 ఎకరాల సీజేఎఫ్ఎస్ స్థలాల్లో నిర్వాసితులకు తొమ్మిది అంకణాలను ప్రభుత్వం ఇస్తే వారు ఇళ్లు నిర్మించుకునేందుకు తన వంతు సాయం చేస్తానని భరోసా సైతం ఇచ్చారు. మరోవైపు రైల్వేలైన్ నిర్మాణ పనులను నివాసాల పక్కన కాకుండా వేరే చోట ప్రారంభించారు. పాడుబడిన ఇళ్లకు వెళ్లాలంటున్నారు 40 ఏళ్ల నుంచి అన్ని వసతులు కలిగిన వెంకటేశ్వరపురాన్ని వదిలి వెళ్లమంటున్నారు. అపార్ట్మెంట్లు నచ్చకపోతే, సౌకర్యాల్లేని పాడుబడిన కొత్తూరులోని ఇళ్లకు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. ఎలాంటి రక్షణ లేని ప్రాంతానికి ఎలా వెళ్తాం. – మస్తాన్‌బీ, రైల్వే నిర్వాసితులు ఎమ్మెల్యే అనిల్ ఎంతకాలం కాపాడతారో... ఎమ్మెల్యే అనిల్ ఎంతకాలం కాపాడతారో చూస్తామని బెదిరిస్తున్నారు. మొదట్నుంచి మాకు అండగా ఉంది ఆయనే. అనిల్‌ను గెలిపించుకొని ఇళ్లను కాపాడుకుంటాం. – సీతమ్మ, రైల్వే నిర్వాసితులు హామీ ఇచ్చి ఇప్పుడిలా మాట్లాడటం సరికాదు ఇళ్లను కూల్చే సమయంలో ఎమ్మెల్యే అనిల్ హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు. మరుసటి రోజు టీడీపీ నాయకుడు ఇళ్లను కూల్చకుండా తామే ఆపామని చెప్పి వెళ్లిపోయారు. తాజాగా ఆ నాయకుడే ఇక్కడికి వచ్చి అపార్ట్మెంట్లు తీసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. – మీరాంబీ, రైల్వే నిర్వాసితులు ఇళ్లు కూల్చేస్తే మా పరిస్థితేంటి..? వెంకటేశ్వరపురంలో 45 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం. ఇన్నేళ్ల అనుబంధం ఉన్న ఈ ప్రాంతాన్ని వదిలి కొత్తూరు వెళ్లాలని బెదిరిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కడైనా ఖాళీ జాగా ఇస్తే పూరిపాక వేసుకొని హాయిగా జీవిస్తాం. – బిల్లుపాటి మాల్యాద్రి, రైల్వే నిర్వాసితుడు -
కేఈ వర్సెస్ తుగ్గలి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఉన్న కేఈ, తుగ్గలి నాగేంద్ర మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలో విభేదాలు ముదిరి, ఏకంగా దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రాంతంలోకి కేఈ శ్యాంబాబు స్టిక్కరు తగిలించుకున్న వాహనంలో ఆయన అనుచరులు వచ్చి.. కాంట్రాక్టు సంçస్థకు చెందిన లారీలు, జేసీబీలపై దాడులు చేశారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. లింగనేనిదొడ్డి నుంచి గుంతకల్లు వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర రూ.78 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. వీటిని తుగ్గలి నాగేంద్ర అండదండలతో కాంట్రాక్టర్లు చేస్తున్నారనేది కేఈ వర్గం భావన. కాంట్రాక్టు చేయొద్దని తుగ్గలిని వారించినప్పటికీ వినకపోవడం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమను బెదిరించేందుకు చేస్తున్న ఈ ఘటనలకు భయపడబోమని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. కేఈ శ్యాంబాబు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా సంఘటనలోనూ ఆయనపై సొంత పార్టీ నేతనే ఆరోపణలు చేయడం గమనార్హం. మరోవైపు దీనిపై కేఈ వర్గం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మొదటి నుంచి ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా దాడుల దాకా వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జరిగిన సంఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ అదే తీరు! వాస్తవానికి ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు మొదటి నుంచీ నడుస్తోంది. అయితే, చంద్రబాబు కుటుంబానికి తుగ్గలి నాగేంద్ర దగ్గర కావడంతో కేఈ వర్గం ఆయన్ను ఏమీ చేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇక ఏటా నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవానికి జిల్లాలోని అందరు నేతలను పిలిచిన తుగ్గలి నాగేంద్ర.. కేఈ కుటుంబాన్ని మాత్రం దూరంగా ఉంచారు. అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కేఈ వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండల కార్యాలయంలో హల్చల్ చేశారు. తమ వర్గానికి కూడా కార్పొరేషన్ రుణాలు అందేలా జాబితా రూపొందించాలంటూ ఉద్యోగులపై చిందులు వేశారు. దీంతో నాగేంద్రపై కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఇక రైల్వే కాంట్రాక్టు విషయంలో ఎవ్వరూ టెండరు వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ కాంట్రాక్టు పనులను వారే తీసుకోవాలని భావించారు. అయితే, దీన్ని ఖాతరు చేయని తుగ్గలి నాగేంద్ర టెండర్లో పాల్గొనడమే కాకుండా పనులు సైతం దక్కించుకున్నారు. ఇది కేఈ వర్గానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రైల్వే పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి.. లారీలు, జేసీబీల అద్దాలు పగలగొట్టి, పనులు చేయవద్దంటూ బెదిరింపులకు దిగారు. వారు కేఈ శ్యాంబాబుకు చెందిన స్టిక్కర్లు అతికించిన వాహనాల్లో వచ్చారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. దీనిపై పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటివరకు కేఈ కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
నీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హతమారుస్తా
గుంతకల్లు: తనను, తన కుటుంబాన్ని చంపుతామని టీడీపీ నేత ఆకుల నాగరాజు బెదిరిరస్తున్నాడని రైల్వే కాంట్రాక్టర్ శ్రీరామ్‌చౌదరి, ఆయన భార్య నాగమణిగౌడ్ వాపోయారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం తమ కుమారుడిని ట్యూషన్‌కు వదిలేందుకు వెళుతుండగా ఆకుల నాగరాజు అటకాయించి ‘ఎమ్మెల్యేలపై కేసు ఎలా పెడతావ్.. వెంటనే విత్‌డ్రా చేసుకోకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హతమారుస్తా’ అంటూ బెదిరించినట్లు వివరించారు. ఘటనపై 100కి ఫిర్యా దు చేయడంతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారని తెలి పారు. తన కుటుంబానికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించా లని పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు. బెదిరింపులు అవాస్తం శ్రీరామ్చౌదరిని ఆకుల నాగరాజు బెదిరించింది అవాస్తవమని వన్‌టౌన్ ఎస్ఐ వెంకట ప్రసాద్ తెలిపారు. శ్రీరామ్ చౌదరిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి శ్రీరామ్ చౌదరి రన్నింగ్ రూం కాంట్రాక్ట్ పని చేసే సమయంలో పాల వ్యాపారి ఆకుల నాగరాజుకు రూ. 3 లక్షల వరకు బకాయి పడ్డారన్నారు. అప్పు ఇవ్వకుండా కేసులో తన పేరు ఎలా చేర్చావంటూ శ్రీరామ్చౌదరిని అతను నిలదీశారన్నారు. బెదిరించారనడం అవాస్తవమని తేల్చి చెప్పారు. -
రైల్వే కాంట్రాక్టర్‌పై టీడీపీ నేత జులుం
∙కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని బెదిరింపులు ∙దుప్పటి పంచాయితీ చేసిన పోలీసులు గుంతకల్లు:గుంతకల్లు రైల్వే డివిజన్లోని ధర్మవరం రైల్వే రన్నింగ్ రూం నిర్వహణ కోసం గత నెల 27న టెండర్ల ప్రక్రియ ముగిసింది. రూ.1.24 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టును రైల్వే శాఖ నిర్ణయించిన ధర కంటే 8 శాతం తక్కువకు కోట్ చేసి ఎస్కే ఎంటర్ ప్రైజెస్ కంపెనీ దక్కించుకుంది. ఇదే కాంట్రాక్టుకు పోటీపడిన ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ అనుచరుడు నరేంద్ర 35 శాతం ఎక్కువ ధరకు టెండర్ కోట్ చేశాడు. సహజంగా 8 శాతం తక్కువకు కోట్ చేసిన ఎస్కే ఎంటర్‌ప్రైజెస్‌కు ధర్మవరం కాంట్రాక్ట్ దక్కింది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత ఎస్కే అహ్మద్ సోమవారం డీఆర్ఎం కార్యాలయానికి వచ్చారు. అధికారులను కలిసి రన్నింగ్ రూం నిర్వహణ పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలనే విషయంపై చర్చిస్తున్నారు. అయితే అనుచరులతో అక్కడికి చేరుకున్న నరేంద్ర రైల్వే కార్యాలయంలోనే ఎస్కే అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. కాంట్రాక్ట్ నుంచి తప్పుకోవాలని, అధికారం తమ చేతుల్లో ఉందనే విషయం మరవద్దని బెదిరించాడు. టీడీపీ నేత హల్చల్ చేస్తున్న సమయంలో సీనులోకి పోలీసులు ఎంటర్ అయ్యారు. ఇరుపక్షాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నరేంద్ర చౌదరి బెదిరింపులపై ఎస్కే అహ్మద్ వన్‌టౌన్ ఎస్ఐ నగేష్ దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు దేశం నేత దౌర్జన్యంపై కేసు నమోదు చేయకపోగా సర్దుకుపోవాలంటూ సలహా ఇచ్చారు. మొత్తానికి దుప్పటి పంచాయితీతో ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపారు. ఈ ఘటన కు సంబంధించి పంచాయతీ వ్యవహారాన్ని ధర్మవరంలోనే తేల్చుకుంటామంటూ నరేంద్ర వెళ్లిపోగా, రాజకీయలకు భయపడే ప్రసక్తే లేదని ఎస్కే అహ్మద్ కూడా వెనుతిరిగాడు. ఇదే విషయమై టీడీపీ నేత నరేంద్ర పోలీసులకు వివరిస్తూ తాను బెదిరింపులకు పాల్పడలేదన్నారు. కాంట్రాక్ట్ పనిని తనకు ఇస్తానన్న ఎస్కే అహ్మద్ రూ.2 లక్షలు గుడ్‌విల్ డిమాండ్ చేశాడన్నారు. ఇప్పటికే అతడికి రూ.లక్ష నగదు ముట్టజెప్పానని, డబ్బు తీసుకుని కూడా తనపై కేసు పెట్టేందుకు సిద్ధమయ్యాడంటూ ఎస్కే అహ్మద్‌పై ఆరోపించాడు. అయితే అలాంటిదేంలేదని కాంట్రాక్టర్ ఎస్కే అహ్మద్ కొట్టిపారేశారు. -
రేయ్.. పనులాపు!
► రైల్వే కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపు ► డీజిల్‌షెడ్ పనుల అడ్డగింత ► టీఎస్ఆర్ కంపెనీ సిబ్బందిపై దౌర్జన్యం గుంతకల్లు : రేయ్.. ఒక్కసారి చెబితే మీకు అర్థం కాదా?! మా ఏరియాలో పనులెలా చేస్తారో చూస్తాం. వెంటనే ఆపకపోతే తీవ్ర పరిణామాలుంటాయ్’ అని గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అనుచరులు బెదిరించారు. ఫలితంగా గుంతకల్లు రైల్వే డీజిల్ షెడ్డు విస్తరణ పనులు ఆగిపోయాయి. టీఎస్ఆర్ కంపెనీ ఇప్పటికే రూ.9 కోట్లతో డీజిల్‌షెడ్ అభివృద్ధి పనులను చేస్తోంది. మరో రూ.15 కోట్ల పనులకు గత మంగళవారం జోనల్ స్థాయి అధికారులు టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్‌ను దక్కించుకునేందుకు గుంతకల్లు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడైన రైల్వే కాంట్రాక్టర్ సురేష్‌నాయుడు తీవ్రంగా ప్రయత్నించాడు. మిగిలిన కాంట్రాక్టర్లతో రాయ‘బేరాలు’ నడిపి అంతా ఓకే చేసుకున్నాడు. అయితే..చివరి నిమిషంలో టెండర్‌ను టీఎస్ఆర్ కంపెనీయే కైవసం చేసుకుంది. దీన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. గత శనివారం 25 మంది అనుచరులతో వెళ్లి పనులను అడ్డగించాడు. అప్పుడు నిలిచిన పనులను టీఎస్ఆర్ కంపెనీ రెండు రోజుల కిందట తిరిగి ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ సురేష్‌నాయుడు, కౌన్సిలర్ సంజీవులు, చోటామోటా నాయకులతో కలిసి సోమవారం పనులు జరుగుతున్న ప్రాంతానికి వె ళ్లారు. టీఎస్ఆర్ కంపెనీ సిబ్బందిని పరుష పదజాలంతో దూషించారు. తమకు లాభాల్లో భాగం కానీ, గుడ్‌విల్ కానీ ఇవ్వనిదే పనులు జరగనివ్వబోమని తేల్చిచెప్పారు. వారి బెదిరింపులతో కాంట్రాక్టర్, పనులు చేసే కూలీలు బెదిరిపోయారు. కాగా.. తొలుత ప్రారంభించిన రూ.9 కోట్ల పనులకు సంబంధించి కాంట్రాక్టర్ సురేష్ నాయుడుకు రూ.2.50 లక్షల గుడ్‌విల్ ముట్టజెప్పినట్లు టీఎస్ఆర్ కంపెనీ సిబ్బంది తెలిపారు.