
గుంతకల్లు: తనను, తన కుటుంబాన్ని చంపుతామని టీడీపీ నేత ఆకుల నాగరాజు బెదిరిరస్తున్నాడని రైల్వే కాంట్రాక్టర్ శ్రీరామ్‌చౌదరి, ఆయన భార్య నాగమణిగౌడ్ వాపోయారు. ఆదివారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం తమ కుమారుడిని ట్యూషన్‌కు వదిలేందుకు వెళుతుండగా ఆకుల నాగరాజు అటకాయించి ‘ఎమ్మెల్యేలపై కేసు ఎలా పెడతావ్.. వెంటనే విత్‌డ్రా చేసుకోకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి హతమారుస్తా’ అంటూ బెదిరించినట్లు వివరించారు. ఘటనపై 100కి ఫిర్యా దు చేయడంతో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారని తెలి పారు. తన కుటుంబానికి టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించా లని పోలీసులను కోరినట్లు పేర్కొన్నారు.
బెదిరింపులు అవాస్తం
శ్రీరామ్‌చౌదరిని ఆకుల నాగరాజు బెదిరించింది అవాస్తవమని వన్‌టౌన్ ఎస్‌ఐ వెంకట ప్రసాద్ తెలిపారు. శ్రీరామ్ చౌదరిని స్టేషన్‌కు పిలిపించి విచారణ చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి శ్రీరామ్ చౌదరి రన్నింగ్ రూం కాంట్రాక్ట్ పని చేసే సమయంలో పాల వ్యాపారి ఆకుల నాగరాజుకు రూ. 3 లక్షల వరకు బకాయి పడ్డారన్నారు. అప్పు ఇవ్వకుండా కేసులో తన పేరు ఎలా చేర్చావంటూ శ్రీరామ్‌చౌదరిని అతను నిలదీశారన్నారు. బెదిరించారనడం అవాస్తవమని తేల్చి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment