railway contractors
-
ఎల్లో ట్యాక్స్ కట్టలేం
- స్పష్టంచేసిన ఓబులవారిపల్లి - కృష్ణపట్నం రైల్వే కాంట్రాక్టు కంపెనీ - రూ. ఐదు కోట్లు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ డిమాండ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణం పనుల్లో తనకు 25 శాతం కమిషన్ ఇవ్వాలని స్పీకర్ శివప్రసాద్ కుమారుడు కోడెల శివరామకృష్ణ రైల్వే కాంట్రాక్టర్లు మీద దౌర్జన్యం చేసిన సంఘటన మరువక ముందే నెల్లూరు జిల్లాలో ఇలాంటి సంఘటన మరొకటి బయట పడింది. ఓబులవారిపల్లి- కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు చేస్తున్న గుజరాత్‌కు చెందిన మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులను నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్మే కరుగొండ్ల రామకృష్ణ రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. ఆ కంపెనీ సెక్రటరీ కల్పేష్ దేశాయ్ ఇతర అధికారులు నెల్లూరులో సోమవారం విలేకరుల వద్ద ఎమ్మెల్యే బెదిరింపులు, దౌర్జన్యాలను బట్టబయలు చేశారు. తమ సైట్ మేనేజర్ రామును ఎమ్మెల్యే ఫోన్లో బెదిరించిన ఆడియో సీడీలను మీడియాకు అందించారు. రూ.183 కోట్ల పనిలో 5 శాతం కానీ, లేదా రూ.5 కోట్లు కానీ పర్సెంటేజీ కింద ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ తమ మీద ఒత్తిడి చేస్తున్నారని కల్పేష్ దేశాయ్ వెల్లడించారు. తాము తక్కువ మొత్తంతో ఈ కాంట్రాక్టు దక్కించుకున్నందువల్ల అంత మొత్తం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ సంస్థ అధికారులను బూతులు తిడుతున్నారనీ, పనులు చేస్తున్న సిబ్బంది మీద తన అనుచరులతో దాడులు చేయించడంతో వారు బెదిరిపోయి పనులకు రావడం లేదని తెలిపారు. ఎమ్మెల్యే నుంచి తమకు రక్షణ కల్పించి పనులు జరిపించకపోతే రైల్వే శాఖకు చెప్పి పనులు పూర్తిగా నిలిపివేయడం తప్ప మరో మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయం గురించి రైల్వే మంత్రి సురేష్‌ప్రభు, రైల్వే ఉన్నతాధికారులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశామన్నారు. కంపెనీ మేనేజర్ రాము, ఎమ్మెల్యే రామకృష్ణ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ మేనేజర్: నమస్తే సర్ నేను రాము. నేను మా కంపెనీ జీఎంకు ఫోన్ చేసి మీ నాలుగు డిమాండ్లు చెప్పినా ను. శుక్రవారం సాయంత్రం లేదా శనివారానికి వస్తామని చెప్పినారు. అంతవర కు పనిచేయించడానికి అడ్డు చెప్పొద్దు సార్. ఎమ్మెల్యే: ఇలాంటివన్నీ వద్దు.. మీకు ఎన్నిసార్లు చెప్పినాను. మేనేజర్: కాదు సార్ ఎమ్మెల్యే రామకృష్ణ మాకు అన్నలాంటోడు, మేం మాట్లాడుకుంటామని అంటున్నారు. ఎమ్మెల్యే: అవన్నీ ఏం కుదరదు.. వాళ్లకు... పగలగొడతా (బూతులు తిట్టారు). మేనేజర్: సార్ అలా అనద్దండి. శుక్రవారం నాటికి నేను వాళ్లను పిలిపిస్తా. అంతవరకు పనులు ఆగకుండా చేయిస్తే నేను కూడా చెప్పుకునే దానికి ఉంటుంది. ఎమ్మెల్యే జెంటిల్మెన్ నా మాటకు విలువ ఇచ్చారని చెప్పుకోవచ్చు. శుక్రవారం నాటికి మా వాళ్లు వచ్చి సెటిల్ చేసుకోకపోతే శనివారం నేనే పనులు నిలిపివేయిస్తా. ఎమ్మెల్యే: సరేలే మా వాళ్లతో చెబుతా. -
నలుగురు ఘరానా దొంగల అరెస్టు
- నిందితుల్లో ఇద్దరు పోలీసులు, ఓ రైల్వే కాంట్రాక్టర్ న్యూఢిల్లీ: డెలివరీ బాయ్‌ను అపహరించి, అతనివద్ద నుంచి రూ. 50 లక్షల పార్సిల్‌తోపాటు మొబైల్ ఫోన్లను దోచుకున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జాయింట్ కమిషనర్ రవీంద్ర యాదవ్ అందించిన వివరాల ప్రకారం... సెంట్రల్ ఢిల్లీకి చెందిన ఓ డెలివరీ బాయ్‌ను కిడ్నాప్ చేసి, అతనివద్దగల నగదు, మొబైల్ ఫోన్లను దోచుకొని, బాధితుడ్ని పూడ్చిపెట్టిన కేసులో రాజ్ బహదూర్ అలియాస్ రాజు(ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్), సురేందర్‌కుమార్ వర్మ(హర్యానా పోలీస్ కానిస్టేబుల్), సంజయ్ అలియాస్ ధరమ్వీర్, వాసుదేవ ప్రసాద్(రైల్వే కాంట్రాక్టర్లు) లను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సహకరించిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పట్టుబడ్డవారి నుంచి రూ. 12 లక్షల నగదు, రూ. 1.5 లక్షల విలువచేసే గృహోపకరణాలు, మొబైల్ ఫోన్లతోపాటు టొయోటా, వ్యాగన్ ఆర్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే పార్సిల్లో రూ. 50 లక్షలు ఉన్నాయని బాధితులు ఫిర్యాదు చేయగా పట్టుబడినవారు మాత్రం అందులో రూ. 43 లక్షలు మాత్రమే ఉన్నాయని పోలీసు విచారణలో వెల్లడించారు. అంతపెద్దమొత్తంలో సొమ్ము రైల్వే పార్సిల్లోకి ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై రైల్వే అధికారులకు ఢిల్లీ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇక వివరాల్లోకెళ్తే... అలహాబాద్ కార్గో క్యారియర్ కంపెనీలో పనిచేస్తున్న రిషి చంద్ ఏప్రిల్ 22న పోలీసులను సంప్రదించాడు. ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ట్రెయిన్ ద్వారా అలహాబాద్‌కు పంపేందుకు ఏప్రిల్ 13న తాను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి ఓ పార్సిల్‌ను తీసుకున్నానని, ఆ పార్సిల్‌లోని కార్టన్‌లో మొబైల్ ఫోన్లతోపాటు రూ. 50 లక్షల నగదు ఉన్నాయని చెప్పాడు. సదరు పార్సిల్‌ను తీసుకొని రిక్షాలో పహాడ్గంజ్వైపు వెళ్తుండగా నలుగురైదుగురు వ్యక్తులు తనను అడ్డగించారని, అందులో ఇద్దరు పోలీసు డ్రెస్‌లో ఉన్నారని తెలిపాడు. ఆ తర్వాత వారు తనను బల వంతంగా ఓ నల్లని కారులో ఫరీదాబాద్‌కు తీసుకెళ్లారని, తన వద్ద ఉన్న పార్సిల్‌ను లాక్కొని తనను సూరజ్‌కుంద్ ప్రాంతంలో పూడ్చిపెట్టారని పోలీసులకు తెలిపాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారన్నాడు. ముందు భయపడినా అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన చంద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని అరెస్టు చేశారు.