రైల్వే బోర్డు పరిశీలనలో ‘కాజీపేట డివిజన్’
కాజీపేట రూరల్ : కాజీపేట రైల్వే డివిజన్ కేంద్రం ఏర్పాటును ఢిల్లీ రైల్వే బోర్డు సమన్వయంతో ఏర్పాటైన కమిటీ పరిశీలిస్తోందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ తెలిపారు. కొత్త రైల్వే డివిజన్లు, కొత్త రైల్వే జోన్ల ఏర్పాటు బోర్డు కమిటీ పరిశీలనలో ఉన్నాయన్నారు. కాజీపేట జంక్షన్ పర్యటనలో భాగంగా మంగళవారం జిల్లాకు వచ్చిన ఆయన రైల్వే డ్రైవర్ల కార్యాలయంలోని డ్రైవర్ల కౌన్సెలింగ్ కార్యాలయూన్ని ముఖ్య అతిథిగా ప్రారంభించారు. అనంతరం డ్రైవర్ల కార్యాలయం లో తనిఖీ చేశారు. క్రూ కంట్రోల్లో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన విధివిధానాలైపై అధికారులను అభినందించారు.
అక్కడి నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ ముందు డ్రైవర్ల విశ్రాంతి కార్యాలయమైన రన్నింగ్ రూంలోకి వెళ్లి డ్రైవర్ల సెంట్రలైజ్డ్ ఏసీ పడక గదులు, రీడింగ్‌రూం, డైనింగ్ హాల్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు జీఎం స్టేషన్ ప్లాట్‌ఫాంల తనిఖీ నిర్వహించారు. స్టేషన్‌లోని రైల్వే రెస్టారెంట్‌ను పరిశీలించి రోజువారీ అమ్మకాలపై ఆరా తీశారు. డీజిల్ లోకోషెడ్‌కు వెళ్లి అక్కడ మల్టీపుల్ యూనిట్ జంపర్ కేబుల్ సిస్టంను ప్రారంభించారు. డీజిల్ లోకోషెడ్ అభివృ ద్ధి, కార్మికుల సమస్యలను షెడ్ సీనియర్ డీఎంఈ లచ్చిరాం నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీజిల్ లోకోషెడ్, ఎలక్ట్రిక్ లోకోషెడ్ నిర్వహణ, అభివృద్ధి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం తెలుసుకున్నా రు.
ఆ తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ ముందు గల రన్నింగ్‌రూం కార్యాలయంలో శ్రీవాస్తవ విలేకరులతో మాట్లాడారు. కాజీపేటకు మంజూరైన ఫిట్‌లైన్ల నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ పరంగా లోపాలున్నాయని.. వాటిని పరిశీలిస్తున్న ట్లు తెలిపారు. రైల్వే బడ్జెట్లో మంజూరైన కాజీపేట నుంచి ముంబయి వరకు వెళ్లే వీక్లి ఎక్స్‌ప్రెస్‌ను త్వరలో ప్రవేశపెట్టేం దుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాజీపేటకు మం జూరైన వ్యాగన్ షెడ్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ నివేదికను జిల్లా కలెక్టర్ రైల్వే శాఖకు ఇంకా అందజేయలేద ని చెప్పారు. రైల్వే శాఖకుు భూమి ఎప్పుడు అప్పగిస్తే అప్పు డు రైల్వేబోర్డు వ్యాగన్ నిర్మాణపనులను చేపట్టేందుకు సిద్ధం గా ఉందన్నారు.
వ్యాగన్‌షెడ్ నిర్మాణంలో రాష్ట్ర ముఖ్యమం త్రి సుముఖంగా ఉన్నారని తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్-నాగపూర్, హైదరాబాద్-చెన్నై మధ్య హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. పెరిగిన ట్రాఫిక్‌కు సరిపడా సిబ్బందిని నియమించేందుకు తగు చర్య లు తీసుకుంటున్నట్లు జీఎం వెల్లడించారు. సమావేశంలో జీఎం వెంట సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్కే.మిశ్రా, చీఫ్ మె కానికల్ ఇంజనీర్ ఖాదర్ హమ్మద్, సికింద్రాబాద్, కాజీపేటలోని రైల్వే విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు.