కాచిగూడలో రైల్వే మ్యూజియం
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజియంను గురువారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కే.శ్రీవాత్సవ ప్రారంభించారు. రైల్వే వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి నేటి అత్యాధునిక రైల్వే వ్యవస్థ వరకు కాల క్రమేణా మారుతున్న పరిణామాలకనుగుణంగా మారిన విధంగా అన్ని రకాల మోడల్ రైళ్ల నమూనాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆడియో విజువల్ లాంజ్‌ను కూడా ప్రారంభించారు.
కుతుబ్‌షాహీ కాలం నుంచి మీర్ మెహమూద్ ఆలీ ఖాన్ కాలంలోని ఉస్మానియన్ శైలి వరకు జరిగిన మార్పులకు ప్రతీకగా నిలిచింది. ఇక్కడ ఉన్న సాంప్రదాయ ముస్లిం శైలితో అద్భుతమైన తోథిక్ స్టైల్‌ని కలుపుకుంటూ మధ్య డోమ్ మరియు ఇరువైపులా ఉండే డోమ్‌లు నిర్మాణం చేశారు. ఇవే అనంతరం హైదరాబాద్‌లో నిర్మించబడే సరికొత్త సమాజిక భవన సముదాయాల నిర్మాణానికి నాంది పలికాయి.